టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పల్సర్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లు ఎంతో ప్రాచుర్యాన్ని దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసినదే. ఫోర్-స్ట్రోక్ మోటార్‌సైకిళ్లు ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తల్లో బజాజ్ ఆటో తమ పల్సర్ బైక్‌ను విడుదల చేసి, యువకుల హృదయాలను దోచుకుంది.

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

బజాజ్ పల్సర్ బైక్ యొక్క పాపులరాటీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను ఒకే ఇంజన్ ఆప్షన్ మరియు డిజైన్‌కు పరిమితం చేయకుండా ఇందులో అనేక రకాల మోడళ్లు, వేరియంట్లను విక్రయిస్తోంది. కస్టమర్ల అవసరాలు మరియు వారి బడ్జెట్‌కు అనుగుణంగా పల్సర్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ లైనప్‌లో 125సీసీ నుండి 220సీసీ వరకూ మొత్తం 10 రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ లైనప్‌లో కొత్తగా మరింత శక్తివంతమైన పల్సర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పల్సర్ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌గా కొత్త 250సీసీ బైక్‌ను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది.

MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

పెద్ద 250సీసీ ఇంజన్‌తో కూడిన బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ఆటో తమ పూనే ప్లాంట్ సమీపంలో టెస్టింగ్ చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్ పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉన్నప్పటికీ, ఇందులోని కొన్ని రకాల డిజైన్ ఎలిమెంట్స్ బయటకు స్పష్టమవుతున్నాయి.

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

కొత్త బజాజ్ పల్సర్ 250 సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్నట్లు సమాచారం. ఇది సరికొత్త డిజైన్, కొత్త ఇంజన్ మరియు కొద్దిగా సవరించిన ఎర్గోనామిక్స్‌తో రానుంది. ప్రస్తుతం లభిస్తున్న పల్సర్ బైక్‌లతో పోలిస్తే, ఇందులో పెద్ద ఇంజన్‌కు తగినట్లుగానే పల్సర్ 250 ఆకారంగా కూడా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

పల్సర్ 250 బైక్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ తమ ఇతర పల్సర్ మోడళ్లలో ఉపయోగించే కొన్ని భాగాలను ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్ పూర్తిగా ఎల్ఈడి లైట్లతో అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

ఆసక్తికరంగా, కొత్త బజాజ్ పల్సర్ 250 బైక్‌లో డొమినార్ 250లో ఉపయోగించిన ఇంజన్‌ను కాకుండా పూర్తిగా సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. డొమినార్ 250లో లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించగా, కొత్త పల్సర్ 250లో ఆయిల్ లేదా ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగింవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులో 4-వాల్వ్ హెడ్ కూడా ఉండకపోవచ్చని సమాచారం.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

పనితీరు పరంగా, కొత్త బజాజ్ పల్సర్ 250 ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పల్సర్ ఎన్ఎస్200 కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కొత్తగా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్, ఎత్తులో అమర్చిన సైలెన్సర్ మరియు స్ప్లిట్ సీట్ డిజైన్ వంటి అంశాలను ఈ స్పై చిత్రాలలో గమనించవచ్చు.

టెస్టింగ్ దశలో కొత్త బజాజ్ పల్సర్ 250

ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి బజాజ్ ఆటో తమ కొత్త పవర్‌ఫుల్ 250సీసీ పల్సర్ బైక్‌ను విడుదల చేయవచ్చని అంచనా. ఈ కొత్త బైక్ ధర విషయానికి వస్తే, ప్రస్తుతం పల్సర్ సిరీస్‌లో మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన మోడల్ పల్సర్ ఆర్ఎస్200 ధర (రూ.1.52 లక్షల) కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

Source: Bikewale

Most Read Articles

English summary
Bajaj Pulsar 250 Spotted Testing, Could Arrive Before This Festive Season, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X