సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న 2021 EICMA (2021 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షో) లో ప్రముఖ ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) తమ సరికొత్త TRK 800 అడ్వెంచర్ బైక్ ను ఆవిష్కరించింది. విడుదల కొత్త బెనెల్లీ టిఆర్‌కె 800 (Benelli TRK 800) మోటార్‌సైకిల్ ఈ ఇటాలియన్ బ్రాండ్ నుండి వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ బైక్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

బెనెల్లీ టిఆర్‌కె 800 మోటార్‌సైకిల్ 754 సిసి, పారలల్ ట్విన్ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపోయగించారు. ఈ డబుల్ ఓవర్‌హెడ్ కామ్ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను జనరేటే చేస్తుంది. ఈ ఇంజన్ 6స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. రైడర్ సౌకర్యం మరియు సేఫ్టీ కోసం ఇందులో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌ కూడా ఉంటుంది.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

మెకానికల్స్ విషయానికి వస్తే, బెనెల్లీ టిఆర్‌కె 800 బైక్‌లో ట్యూబ్లర్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌, 170 మిమీ ట్రావెల్ అప్‌ఫ్రంట్‌తో రీబౌండ్, కంప్రెషన్ మరియు స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబల్ తో కూడిన 50 మిమీ మార్జోచి ఫ్రంట్ ఫోర్క్‌లు అలాగే, బైక్ వెనుక భాగంలో కఠినమైన రోడ్లపై సైతం సున్నితమైన రైడ్ ను ఆఫర్ చేసేందుకు వీలుగా మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బెనెల్లీ టిఆర్‌కె 800 ముందు భాగంలో 19 ఇంచ్ మరియు వెనుక భాగంలో 17- ఇంచ్ స్పోక్డ్ వీల్స్‌ ఉన్నాయి.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

ఈ స్పోక్ వీల్స్ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. రైడర్ల ఆఫ్-రోడ్ అనుభవాన్ని మరింత ఉల్లాసభరితం చేసేందుకు కంపెనీ ఇందులో ఇరువైపులా ఆఫ్-రోడ్ స్పెసిఫిక్ టైర్లను అమర్చింది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 4-పిస్టన్ కాలిపర్‌లతో కూడిన రెండు 320 మిమీ బ్రెంబో సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒక సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో కూడిన సోలిటరీ 260 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

బెనెల్లీ టిఆర్‌కె 800 మొత్తం బరువు 226 కిలోలు మరియు ఈ సరికొత్త ఇటాలియన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ యొక్క సీటు ఎత్తు భూమి నుండి 834 మిమీ గా ఉంటుంది. ఈ బైక్ లో భారీ 22 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది, ఇది దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కొత్త బెనెల్లీ టిఆర్‌కె 800 యొక్క అత్యంత ఆకర్షణీయమైన విషయం దాని డిజైన్. ఈ బైక్ యొక్క ఫ్రంట్ డిజైన్ చాలా షార్ప్ గా ఉంటుంది. కోణీయ హెడ్‌ల్యాంప్‌లపై ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను ఆన్ చేసినప్పుడు, దీని ఫ్రంట్ డిజైన్ మరింత షార్ప్ గా కనిపిస్తుంది.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

దీని ఫ్రంట్ ఫెయిరింగ్ కూడా సరికొత్త బెనెల్లీ బాడీవర్క్‌తో అనుసంధానించబడిన ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లకు హోస్ట్‌గా పనిచేస్తుంది. కొత్త బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ మజిక్యులర్ ఫెయిరింగ్ ను కలిగి ఉంటుంది. Benelli TRK 800 లో రైడర్ కోసం సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ మరియు నకల్ గార్డ్‌లను కూడా కలిగి ఉంది. సరికొత్త బెనెల్లీ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో అధిక రిజల్యూషన్ కలిగిన 7ఇంచ్ టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇది రైడర్ కు కావల్సిన సమాచారాన్ని అందిస్తుంది.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

ఇంకా ఇందులో పిలియన్ రైడర్ కోసం అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు చంకీ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. బెనెల్లీ టిఆర్‌కె 800 యొక్క స్పోక్డ్ వీల్స్ కూడా డ్యూయల్-టోన్ (షో బైక్ కోసం ఆరెంజ్ అండ్ బ్లాక్) ఫినిషింగ్ ని కలిగి ఉంటాయి. కొత్త Benelli TRK 800 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వచ్చే ఏడాది యూరప్ మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఆ తర్వాత ఇది భారతదేశంలో కూడా విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

Benelli 502C Urban Cruiser విడుదల

ఇదిలా ఉంటే, బెనెల్లీ ఇండియా గత జూలై నెలలో భారత మార్కెట్లో తమ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ ధర రూ. 4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఈ కొత్త 502సి అర్బన్ క్రూయిజర్ బైక్ బెనెల్లీ బ్రాండ్ యొక్క పాపులర్ ఇటాలియన్ డిజైనింగ్‌కు ఒక చక్కటి ఉదాహరణగా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ అతి తక్కువ ప్యానెళ్లతో చాలా వరకూ నేక్డ్ మోటార్‌సైకిల్‌లా డిజైన్ చేసింది. ముందు వైపు నుండి చూస్తే ఈ బైక్ చాలా అగ్రెసివ్‌‌గా కనిపిస్తుంది.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

బెనెల్లీ 502సి క్రూయిజర్ బైక్‌ను బయటి నుండి కనిపించే ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. కంపెనీ దీనిని క్రూయిజర్ బైక్ అని చెబుతున్నప్పటికీ, చూడటానికి ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌లా ఉంటుంది. ఈ బైక్‌లో చాలా తక్కువ సీటింగ్ స్పేస్ ఉంటుంది. బహుశా ఇది ఒక్క రైడర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడిందేమో. తక్కువ సీట్ హైట్ కారణంగా బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్, రైడర్‌కు అల్ట్రా-కంఫర్టబుల్ రైడ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో సింగిల్ పీస్ ఫ్లోటింగ్ సీట్ ఉంటుంది, దీని డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.

సరికొత్త Benelli TRK 800 అడ్వెంచర్ బైక్ ఆవిష్కరణ; త్వరలోనే విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వబడింది. - ఈ బైక్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Benelli reveales new trk 800 adeventure motorcycle at eicma 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X