Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) దేశీయ విపణిలో విక్రయిస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ (Hero Xtreme 160R) లో కంపెనీ స్టీల్త్ 'ఎడిషన్ ఎడిషన్' (Stealth Edition) పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో కొత్త హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

ప్రస్తుత పండుగ సీజన్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు హీరో మోటోకార్ప్ ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ను విడుదల చేసింది. కొత్త హీరో ఎక్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ (Hero Xtreme 160R Stealth Edition) బైక్ మ్యాట్ బ్లాక్ కలర్‌ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఈ బైక్ పై 'స్టీల్త్ ఎడిషన్' అనే బ్యాడ్జ్‌ ఉంటుంది. ఈ మార్పులతో ఇది స్టాండర్డ్ మోడల్ కన్నా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

ఇదిలా ఉంటే, కొంతకాలం క్రితమే, టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అప్‌డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఇది తాజాగా వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌తో ఏవిధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

Hero Xtreme 160R Stealth Edition vs TVS Apache RTR 160 4V: ధర

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధర విషయానికి వస్తే, కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ ని రూ. 1,21,372 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. ఇక కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ధర విషయానికి వస్తే, మార్కెట్లో ఈ మోడల్ ధర రూ. 1,16,660 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ధర పరంగా చూస్తే, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి కన్నా హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ ధర కాస్తంత తక్కువగా ఉంది.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

Hero Xtreme 160R Stealth Edition vs TVS Apache RTR 160 4V: ఫీచర్లు

టీవీఎస్ మోటార్ కంపెనీ అనేక కొత్త అప్‌డేట్‌ లతో తమ కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి స్పెషల్ ఎడిషన్‌ ను విడుదల చేసింది. ఈ బైక్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో సర్దుబాటు చేయగల క్లచ్ మరియు బ్రేక్ లివర్, ప్రత్యేకమైన హెడ్‌ల్యాంప్‌లు, రెడ్ అల్లాయ్ వీల్స్‌ తో ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్ మరియు కొత్త సీట్ ప్యాటర్న్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

మరోవైపు, కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ మోడల్ కొత్త మ్యాట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్ తో లభిస్తుంది. ఈ పాపులర్ నేక్డ్ స్ట్రీట్ బైక్ యొక్క కొత్త స్టీల్త్ ఎడిషన్ అనేక అదనపు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో లాంచ్ చేయబడింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బి ఛార్జర్ మరియు ఎల్‌సిడి బ్రైట్‌నెస్ అడ్జస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ఇందులోని స్పీడోమీటర్ లో కొత్త గేర్ ఇండికేటర్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

Hero Xtreme 160R Stealth Edition vs TVS Apache RTR 160 4V: ఇంజన్

ఇంజన్ పరంగా, చూస్తే, కొత్తగా అప్‌డేట్ చేయబడిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి బైక్ లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. స్టాండర్డ్ మోడల్ లో లభించే అదే పాత 159.7 సిసి ఎఫ్ఐ, 4 స్ట్రోక్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ నే ఈ స్పెషల్ ఎడిషన్ లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.63 బిహెచ్‌పి శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

ఇక హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్‌ విషయానికి వస్తే, ఇందులో కూడా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ బైక్ లో 160 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది ఎక్స్-సెన్స్ (XSens) టెక్నాలజీ మరియు అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 15.2 bhp పవర్ ను మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది.

Xtreme 160R Stealth Edition vs Apache RTR 160 4V: రెండింటిలో ఏది బెస్ట్?

Hero Xtreme 160R Stealth Edition లభించే ప్రత్యేకమైన ఫీచర్లలో ఎల్ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ తో కూడిన డ్రాయిడ్ హెడ్‌ల్యాంప్‌ కూడా ఉంటుంది. ఈ బైక్ లోని ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ రాత్రివేళల్లో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి, దీనిని కాంతికి అనుగుణంగా బ్రైట్‌నెస్ ను సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించారు.

Most Read Articles

English summary
Comparison between hero xtreme 160r stealth edition vs tvs apache rtr 160 4v
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X