లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఇ-బైక్‌-గో (eBikeGo) గడచిన ఆగస్ట్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ 'రగ్గడ్' (Rugged) కోసం ఇప్పటి వరకూ లక్ష యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్ ను ప్రారంభించిన రెండు నెలల్లోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

గడచిన ఆగస్ట్ నెలలో ఇబైక్‌గో రగ్గడ్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఇది ఇటు సిటీ ప్రయాణానికి మరియు అటు ఆఫ్-రోడింగ్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇదొక మోటో-స్కూటర్, అంటే ఇది చిన్న స్కూటర్ లాంటి టైర్లను మరియు మోపెడ్ లాంటి బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఇబైక్‌గో రగ్గడ్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదలైంది. వీటిలో G1 మరియు G1+ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 79,999 మరియు రూ. 99,999 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటో స్కూటర్ దాని పేరుకు తగినట్లుగానే మంచి రగ్గడ్ పెర్ఫార్మెన్స్‌ ను కలిగి ఉంటుంది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఇబైక్‌గో ఇప్పటి వరకూ రగ్గడ్ ఎలక్ట్రిక్ బైక్ కోసం మొత్తం 1,06,650 యూనిట్ల బుకింగ్ లను పొందింది. అంటే, ఈ మొత్తం ఆర్డర్ల విలువ సుమారు రూ. 1,000 కోట్లకు పైమాటే. మొత్తం బుకింగ్‌లలో దాదాపు 67 శాతం బుకింగ్స్ టైర్ 2 మరియు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 22 డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 3 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. రగ్గడ్ ఎలక్ట్రిక్ మోటో స్కూటర్ యొక్క బాడీని స్వింగ్ ఛాస్సిస్ మరియు స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఈ బైక్ ఛాస్సిస్‌పై కంపెనీ 7 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వేరు చేయగల రెండు 2 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు వీటిని స్కూటర్ నుండి తొలగించి, విడిగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 3.5 గంటల సమయం పడుతుంది. పూర్తి ఛార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 160 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో 12 అంతర్నిర్మిత స్మార్ట్ సెన్సార్లు ఉంటాయి. రగ్గడ్ యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్‌ను లాక్ / అన్‌లాక్ చేయవచ్చు. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలారమ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్ ను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తే, ఇందులోని అలారమ్ మ్రోగి, చుట్టుప్రక్కల వారిని మరియు బైక్ ఓనర్ ని ఇది అలెర్ట్ చేస్తుంది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

రగ్గడ్ ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్ సాధించిన ఈ మైలురాయి గురించి eBikeGo వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ, ఈ స్కూటర్ ను ప్రవేశపెట్టిన రెండు నెలల్లోనే అద్భుతమైన స్పందన లభించదని, దేశవ్యాప్తంగా ఉన్న 22 డీలర్‌షిప్‌ల ద్వారా 1 లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చాయని, ఇది ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఏ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీకైనా, ఒక అద్భుతమైన అవకాశం అని ఆయన అన్నారు.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఇబైక్‌గో రగ్గడ్ భారతదేశం యొక్క అత్యంత పర్యావరణ అనుకూలమైన, తెలివైన మరియు మన్నికైన ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్, ఇది దేశంలో ఇ-మొబిలిటీ దిశను మారుస్తుందని మరియు ఎలక్ట్రిక్ బైక్ కేటగిరీలో ఆవిష్కరణల సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన చెప్పారు. రాబోయే నెలల్లో, రూ. 500 కోట్ల విలువైన 'రగ్గడ్' యొక్క 50,000 అదనపు బుకింగ్‌లను తాము అంచనా వేస్తున్నామని చెప్పారు.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ebikeGo ఈ స్కూటర్ కోసం బుకింగ్‌లను రూపొందించడంలో సహాయపడటానికి, కంపెనీ ఒక రెఫరల్ ప్రోగ్రామ్‌ను కూడా ఏర్పాటు చేసింది, దీనిలో రెఫరర్ మరియు రిఫరీ ఇద్దరూ ప్రతి విజయవంతమైన డీల్ పట్ల రూ. 1000 తగ్గింపు పొందుతారు. అలాగే, ఎవరైనా 100 లేదా అంతకంటే ఎక్కువ బుకింగ్‌లను రెఫర్ చేసిన వారు ఉచితంగా రగ్గడ్ స్కూటర్ ను పొందుతారని కంపెనీ తెలిపింది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ఆసక్తి గల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ (www.rugged.bike) లో నామ మాత్రపు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్ అడ్వాన్స్‌ని కంపెనీ రూ. 499 గా నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఈ బైక్ వద్దనుకుని, బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ బుకింగ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది.

లక్షకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న eBikeGo Rugged ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్

ప్రస్తుతం దీపావళి పండుగ సీజన్‌లో బుకింగ్‌లను పెంచడంలో సహాయపడటానికి ebikeGo తమ రగ్గడర్ ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్ శ్రేణిలో నాలుగు కొత్త రంగులను జోడించింది. అవి - రెడ్, బ్లూ, బ్లాక్ మరియు రగ్డ్ స్పెషల్ ఎడిషన్. ఈ సంస్థ Amazon, Bigbasket, Delhivery మరియు Zomato వంటి బహుళ b2b క్లయింట్‌లతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది.

Most Read Articles

English summary
Ebikego rugged electric bike gets over 1 lakh bookings in 2 months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X