ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

గత వారం ఫేమ్ II (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ఈవీ పాలసీలో కేంద్ర ప్రభుత్వం చేసిన సబ్సిడీ సవరణల కారణంగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా, ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

కోమకి ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ఓ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. కోమకి ఇప్పటికే ఫిబ్రవరి 2021 నుండి కేరళ, గుజరాత్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో డీలర్‌షిప్‌లను ప్రారంభించి. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

ప్రస్తుతం, భారతదేశంలో పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో బ్యాటరీలపై అందించే సబ్సిడీని మరింత పెంచింది.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

ఫేమ్ II స్కీమ్ క్రింద ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఇటీవల భారత ప్రభుత్వం సవరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌లో ప్రోత్సాహకాలను కిలోవాట్‌కు రూ.10,000 నుండి రూ.15,000 పెంచింది. ఈ ప్రోత్సాహకాలు 50 శాతం పెరగడంతో, తయారీదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

ఈ ప్రయోజనం వలన కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు లబ్ధి పొందనున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవే కాకుండా, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంటే, లాంగ్ రన్‌లో ఇవి కస్టమర్లకు ఎక్కువ నగదు ప్రయోజనాలను అందిస్తాయి.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

కోమకి అందిస్తున్న పెద్ద ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ టిఎన్-95‌పై లభించే సబ్సిడీ విషయానికి వస్తే, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.20,000 సబ్సిడీని అందిస్తోంది. అదే సమయంలో, కోమకి ఎస్‌ఇ ధర రూ.15,000 తగ్గుతుంది.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

కోమకి 2021 నాటికి భారత మార్కెట్లో 14,500 లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ గత కొంతకాలం క్రితమే తమ వాహనాలను విక్రయించడం ప్రారంభించింది మరియు ప్రస్తుతం కంపెనీ తమ అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో ఉంది.

ఫేమ్ II సబ్సిడీ సవరణ : కోమకి ఎలక్ట్రిక్ టూవీలర్లపై భారీ డిస్కౌంట్!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత ప్రభుత్వం ఫేమ్-II స్కీమ్‌ను 2025 వరకు పొడిగించింది. ఫలితంగా, దేశంలోని ఈవీ తయారీదారులు తమ దీర్ఘకాలిక ప్రణాళికలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు మాత్రం బాగానే ఉన్నాయి.

Most Read Articles

English summary
Fame II Incentive Subsidy: Komaki Electric Two-wheelers Gets Huge Price Cut, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X