అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీనికి ప్రధాన కారణంగా దేశంలో అమాంతం పెరిగిన ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు. భారీగా పెరిగిన ఈ ఇంధన ధరలు సామాన్య ప్రజలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. కావున చాలామంది వాహన కొనుగోలుదారుల ద్రుష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపైన పడింది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు వంటి నగరాల్లో ఎక్కువ మంది తమ రోజువారీ ప్రయాణానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లలో ఒకటిగా ఉంది, కావున ఈ నగరంలో ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నారు. కావున వీరిలో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మక్కువ కలిగి ఉన్నారు.

కావున బెంగళూరులో ఎలక్ట్రిక్ వాహనాలను కావలసిన సంఖ్యలో అందించడానికి, భారతదేశంలోని ప్రముఖ డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ కంపెనీ గ్రీవ్స్ కాటన్ ఏకంగా 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బెంగళూరులోని మల్టీ-బ్రాండ్ EV రిటైల్ స్టోర్ 'ఆటోఈవీమార్ట్‌' (AutoEVMart) ప్రారభించింది.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ఇప్పుడు బెంగళూరులో ప్రారంభమైన ఈ AutoEVMart లో ఆంపియర్, ఆటోలైన్, బాలన్ ఇంజినీరింగ్, క్రేయాన్ మోటార్స్, డీటేల్, హీరో లేక్ట్రో, గో జీరో, కైనెటిక్, ఎమ్ఎల్ఆర్, ఒమేగా సైకి మొబిలిటీ, రోవీట్ వంటి బ్రాండ్‌ల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిల్స్, లోడర్లు, ఆటోలు మరియు రిక్షాలతో సహా అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయన్న మాట.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ప్రస్తుతం ఈ AutoEVMart కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఒక్క మార్ట్ సందర్శించి మీకు నచ్చిన వాహనం ఎంచుకోవచ్చు. కావున ఇది కస్టమర్లకు మంచి షాపింగ్ అనుభూతిని అందిస్తుంది.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

బెంగళూరులో ఆటోఈవీమార్ట్‌ ప్రారంభించిన సందర్భంగా గ్రీవ్స్ రిటైల్ సీఈవో వైవీఎస్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు కర్ణాటక రాజధాని నగరం అయిన బెంగళూరులో మా మొదటి ఆటోఈవీమార్ట్ స్టోర్‌ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు ముందు వరుసలో ఉండే బెంగళూరులో ఈ ఆటోఈవీమార్ట్ స్టోర్‌ ప్రారంభించడం కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ఆటోఈవీమార్ట్ స్టోర్ లో ఇ-సైకిల్ శ్రేణి ప్రారంభ ధర కేవలం రూ. 23,299 నుండి మొదలై రూ. 54,999 వరకు ఉంటుంది. ఇ-సైకిల్ బ్రాండ్‌లలో ఆటోలైన్, గో జీరో, హీరో లెక్ట్రో మరియు వోల్ట్రాన్ వంటివి ఉన్నాయి. ఇందులో కస్టమర్‌లు 25 కిమీ నుండి 80 కిమీ మధ్య పరిధిని కలిగి ఉండే సైకిల్‌లను ఎంచుకోవచ్చు.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

అదే సమయంలో ఈ ఆటోఈవీమార్ట్ లో అనేక ప్రసిద్ధ ఇ-స్కూటర్‌లు మరియు ఇ-మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంపియర్ ఎలక్ట్రిక్, గ్రీవ్స్ కాటన్ యాజమాన్యంలోని క్రేయాన్ మోటార్స్, డిటెల్, కైనెటిక్ మరియు రోవీట్ వంటి ఇతర బ్రాండ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు రూ. 48,000 నుంచి మొదలై రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. కావున మీరు ఇక్కడ నచ్చిన వాహనాన్ని నచ్చిన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ద్విచక్ర వాహన విభాగంలో ఆంపియర్ మాగ్నస్ EX కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క బ్యాటరీ ఛార్జ్‌పై 100 కిమీ క్లెయిమ్ పరిధిని కలిగి ఉంది. మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్ యాంటీ-థెఫ్ట్ అలారం, డిజిటల్ డ్యాష్‌బోర్డ్, USB ఛార్జర్ మరియు CBS వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ధర రూ. 69,000, (ఎక్స్-షోరూమ్).

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

AutoEVMart లో కేవలం ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ విభాగంలో వీటి ధరలు రూ. 1.83 లక్షల నుండి రూ. 8.17 లక్షల మధ్య ఉన్నాయి. ప్యాసింజర్ త్రీవీలర్ ధరలు రూ. 2.10 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో Omega Seiki మొబిలిటీ, ఆంపియర్ ఎలక్ట్రిక్, బాలన్ ఇంజనీరింగ్ & MLR వంటి ఆటోఈవీమార్ట్‌లో రిటైల్ చేయబడిన త్రీ-వీలర్ బ్రాండ్‌లు ఉన్నాయి.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

ఎలక్ట్రిక్ ఇ-రిక్షాలు మరియు ఆటోలు ఒకే బ్యాటరీ ఛార్జ్‌పై 100 కిమీ మరియు 120 కిమీ డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఇ-త్రీ-వీలర్ల విషయానికి వస్తే, ఆంపియర్ ELE త్రీ-వీలర్ EV కూడా స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రవాణాకు చాలా అనుకూలంగా ఉంటుంది. ELE త్రీ-వీలర్ EV లోడర్, గూడ్స్ క్యారియర్, ప్యాసింజర్ క్యారియర్‌లతో పాటు మరికొన్ని వైవిధ్యాలతో అందుబాటులో ఉంది.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి దేశ వ్యాప్తంగా ఇలాంటి మల్టిపుల్ AutoEVMart స్టోర్‌ల అవసరం ఎంతైనా ఉంది. కావున కంపెనీ ఇలాంటి స్టోర్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం మాత్రమే కాకుండా హోమ్ డెలివరీ చేయడం లేదా స్టోర్‌లో పికప్ చేయడం వంటి సౌకర్యవంతమైన ఆప్షన్‌లను కూడా అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అన్ని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే స్టోర్‌లో.. అదే AutoEVMart: ఇప్పుడు మన బెంగళూరులో

అంతే కాకూండా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను అందిన్చటం మాత్రమే కాకుండా స్టోర్ బ్యాటరీ మార్పిడి వంటి సౌకర్యాలను కూడా అందిస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో మొట్టమొదటి ఆటోఈవీమార్ట్ కళ్యాణ్ నగర్‌లోని HRBR లేఅవుట్, 1వ బ్లాక్‌లో ఉంది. ఒకే చోట ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను చూడాలనుకునే వారు మరియు కొనుగోలు చేయాలనే వారు ఇక్కడ సందర్శించవచ్చు. ఇది నిజంగా గొప్ప అనుభూతిని అందిస్తుంది.

Most Read Articles

English summary
Greaves auto ev mart electric vehicle retail store opens in bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X