తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility) తమిళనాడులోని రాణిపేటలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీ ఆంపియర్ (Ampere) బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తుంది. రాణిపేటలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు ఆ రాష్ట్ పరిశ్రమల శాఖ మంత్రి తంగం తేనరసు ప్రారంభించారు.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రారంభించిన ఈ అధునాతన ఈవీ ప్లాంట్ దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ గా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. తమిళనాడులోని రాణిపేటలో ఏర్పాటు చేసిన ఈ ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ సుమారు 10.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగార జాబితాలో చేరింది. తమిళనాడులోని ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ తర్వాత ఇదే అతిపెద్ద ఈవీ ఫ్యాక్టరీ కానుంది.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

ప్రారంభంలో ఈ ప్లాంట్ లో 1,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్లాంట్ లో 1,20,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు సమీప భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1 మిలియన్ (10 లక్షల) యూనిట్లకు పెంచుతామని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం రానున్న పదేళ్లలో 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడిలో భాగంగానే, కంపెనీ ఈ కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్లాంట్ లో నియమించుకునే ఉద్యోగులలో 70 శాతం మంది మహిళలే ఉంటారని కంపెనీ తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపింది. అత్యంత పోటీతో కూడుకున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్ లో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వాటాను పొందుతున్నట్లు కంపెనీ తెలిపింది.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి హాజరైన తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగం పుంజుకుందని, ఈవీ పరిశ్రమకు సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి అనేక పరిశ్రమలు సమాజాన్ని మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేకాకుండా, ఈ ఫ్యాక్టరీలో ఎక్కువ మంది మహిళా కార్మికులను నియమించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

భారతదేశాన్ని ప్రపంచంలోని తయారీ కేంద్రంగా మార్చేందుకు, మహిళా కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మరియు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ నగేష్ ఎ. బసవహలి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రయాణికుల కోసం సరసమైన మరియు నమ్మదగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయడంపై తాము దృష్టి పెడుతున్నామని, ఇది దేశాన్ని కార్బన్ రహితంగా చేయాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని అన్నారు.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ బ్రాండ్ తమ బిజినెస్ టు బిజినెస్ (బి2బి) మోడల్ క్రింద డెలివరీ భాగస్వాములు మరియు రైడ్-షేరింగ్ కంపెనీలకు పెర్ఫార్మెన్స్ స్కూటర్లను అందిస్తోంది. అలాగే వ్యక్తిగత కస్టమర్ల కోసం ఆంపియర్ విస్తృత స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఆంపియర్ అందిస్తున్న కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లలో రియో, మాగ్నస్, జిల్, వి48తో పాటుగా మరికొన్ని ఇతర మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

భారత మార్కెట్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గడచిన అక్టోబర్ 2021 నెలలో కంపెనీ మొత్తం 7,500 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది. అలాగే, ఈ ఏడాది ఆగస్టులో 5,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో (FY21 Q2) కంపెనీ విక్రయించిన 7,178 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (FY22 Q2) లో కంపెనీ మొత్తం 13,280 యూనిట్ల ఈవీలను విక్రయించింది.

తమిళనాడులో మరో అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రారంభం.. పనిచేసే వారిలో 70 శాతం మంది మహిళలే..

ఆంపియర్ బ్రాండ్ ఇటీవల ప్రారంభించిన మాగ్నస్ ఈఎక్స్ (Magnus EX) ఎలక్ట్రిక్ స్కూటర్ కు కస్టమర్ల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఈవీ పూర్తి చార్జ్ పై 121 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. దేశంలోని అనేక పట్టణాలు మరియు నగరాల నుండి డీలర్‌షిప్ అవకాశాల కోసం సుమారు 5,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తెలిపింది. ప్రస్తుతం, ఈ సంస్థ దేశవ్యాప్తంగా 7000 టచ్‌పాయింట్‌లతో రిటైల్ నెట్‌వర్క్ ను కలిగి ఉంది.

Most Read Articles

English summary
Greaves electric mobility opens its largest ev production facility in ranipet tamil nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X