రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, త్వరలో రాబోయే పాత వాహనాల స్క్రాపేజ్ పాలసీ మరియు కొత్త కాలుష్య నిబంధనలు వంటి పలు అంశాల నేపథ్యంలో, ప్రజలు సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు స్వస్తి పలికి, పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకుంది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగానే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాహన తయారీ సంస్థలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే, భారత ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అనేక కంపెనీలు ఉండగా, ఇప్పుడు తాజాగా మరొక కొత్త కంపెనీ ఈ వ్యాపారంలోకి ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Greta Electric Scooters) హార్పర్, ఇ-వెస్పా, గ్లైడ్ మరియు హార్పర్ జెడ్ఎక్స్ అనే నాలుగు ఇ-స్కూటర్‌లను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ. 60,000 నుండి మొదలై రూ. 92,000 వరకు ఉన్నాయి.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

గ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది రాజ్ ఎలక్ట్రోమోటివ్‌లో భాగంగా ఉంటుంది, ఇది పెడల్‌తో నడిచే సైకిళ్లు, రిక్షాలు, ట్రైసైకిళ్లు మరియు బైక్‌లను ఎలక్ట్రిక్‌గా మార్చడంలో ప్రత్యేకత కలిగి ఉన్న సంస్థ. ఈ కంపెనీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుండి 2019 లో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం ఆమోదం కూడా పొందింది. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నాలుగు ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

గ్రెటా విడుదల చేసిన నాలుగు స్కూటర్ల పేర్లు హార్పర్ (Harper), హార్పర్ జెడ్ఎక్స్ (Harper ZX), ఇ-వెస్పా (Evespa) మరియు గ్లైడ్ (Glide). వీటిలో ప్రతి ఒక్కటి విభిన్నమైన బాడీ స్టైలింగ్‌ ను కలిగి ఉంటాయి మరియు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, గ్రెటా హార్పర్ మరియు గ్రెటా హార్పర్ జెడ్ఎక్స్ మోడళ్లు స్పోర్టీ బాడీ స్టైలింగ్ ను కలిగి ఉంటాయి. ముందు వైపు పెద్ద ఫ్రంట్ అప్రాన్‌లు, షార్ప్ బాడీ ప్యానెల్‌లు మరియు సొగసైన టర్న్ సిగ్నల్‌లతో ఇవి స్పోర్టీ ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

ఈ రెండు మోడళ్ల మధ్య మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, హార్పర్‌ (Greta Harper)లో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉండగా, హార్పర్ జెడ్ఎక్స్ (Greta Harper ZX) ఒకే హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. అయితే హ్యాండిల్‌బార్ కౌల్, రియర్ వ్యూ మిర్రర్స్ మరియు సీట్ వంటి ఇతర ఫీచర్లు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో దాదాపు ఒకే విధంగా ఉంటాయి. రెండు స్కూటర్లకు బ్యాక్‌రెస్ట్‌లు ఉన్నందున, వీటిపై ప్రయాణించే పిలియన్ రైడర్‌లకు అదనపు సౌకర్యం లభిస్తుంది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

ఇకపోతే, మరొక స్కూటర్ ఇ-వెస్పా (Greta Evespa) అనేది పెట్రోల్ వెర్షన్ వెస్పా స్కూటర్ మాదిరిగానే రెట్రో మోడ్రన్ స్టైల్ లో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో క్లాసిక్ ఫ్లాట్ ఫ్రంట్ ఆప్రాన్, కర్వ్డ్ బాడీ ప్యానెల్స్, గుండ్రటి హెడ్‌ల్యాంప్‌ మరియు గండ్రటి రియర్ వ్యూ మిర్రర్‌లతో ఇది క్లాసిక్ లుక్ లో ఉంటుంది. దీని టర్న్ ఇండికేటర్లు ఫ్రంట్ ఆప్రాన్‌లోనే అమర్చబడి ఉంటాయి. ఇక ఈ జాబితాలో నాల్గవ మోడల్ అయిన గ్లైడ్ (Greta Glide) ఫ్యూచరిస్టిక్, నో-ఫ్రిల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుంది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

గ్రెటా గ్లైడ్ స్కూటర్ యూనిబాడీ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉండి, ప్రంట్ ఆప్రాన్‌లో గుండ్రటి హెడ్‌ల్యాంప్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో గుండ్రటి సైడ్ మిర్రర్స్, హ్యాండిల్‌బార్ కి దిగువన అమర్చిన సన్నటి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, ఫ్లాట్ హ్యాండిల్‌బార్, కాంపాక్ట్ ఫ్లైస్క్రీన్ మరియు పిలియన్ రైడర్ కోసం బ్యాక్‌రెస్ట్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. ఈ నాలుగు గ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కూడా ఫ్లోర్‌బోర్డ్‌లను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను 48 వోల్ట్ లేదా 60 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 70 కి.మీ నుండి 100 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీలను సన్నా నుండి వంద శాతం చార్జ్ చేసుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. కస్టమర్ల అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్‌ల సామర్థ్యాన్ని పెంచుకోవడం మరియు తగ్గించుకోవడం వంటి ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

ఈ నాలుగు గ్రెటా స్కూటర్లు మొత్తం 22 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. వీటిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏటిఏ (ATA) సిస్టమ్, రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ అలారం మరియు కీలెస్ స్టార్ట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉంచాయి. హార్డ్‌వేర్ పరంగా, చూస్తే హార్పర్, హార్పర్ జెడ్ఎక్స్ మరియు ఇ-వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్లు డ్రమ్ డిస్క్ కాంబో బ్రేకింగ్‌తో అమర్చబడి ఉంటాయి. కాగా, గ్రెటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఈ నాలుగు మోడల్‌లు మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే ఎక్కువ స్టోరేజ్ స్థలాన్ని అందిస్తాయని కంపెనీ తెలిపింది.

రూ. 60,000 లకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రైడింగ్ రేంజ్ కూడా ఎక్కువే..

గ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇప్పటికే నేపాల్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం, గ్రెటాకి భారతదేశంలో రెండు షోరూమ్‌లు ఉన్నాయి. అయితే, కంపెనీ తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తోంది. అంతేకాకుండా, యూరప్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కూడా గ్రెటా సన్నాహాలు చేస్తోంది.

Most Read Articles

English summary
Greta electric launches four new battery powered scooters in india price starts from rs 60000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X