GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

ఎలక్ట్రిక్ వాహన వినియోగం దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఎక్కువవుతున్న తరుణంలో చాలా కంపెనీలు మార్కెట్లో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ GT-ఫోర్స్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021 లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

GT-ఫోర్స్ కంపెనీ 2021 EV ఇండియా ఎక్స్‌పోలో GT డ్రైవ్, GT డ్రైవ్ ప్రో మరియు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్‌ అనే మూడు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆవిష్కరించింది. ఈ మూడు ఉత్పత్తులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. అంతే కాకూండా ఇవన్నీ కూడా అత్యాధునిక సాంకేతికతలను పొందుతాయి. ఈ మూడు స్కూటర్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

ఇందులో మొదట GT-డ్రైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పూర్తిగా ఛార్జ్ తో దాదాపు 150 కి.మీ పరిధిని అందిస్తుంది. కంపెనీ స్కూటర్‌లో హై-ఎండ్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించింది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

GT-డ్రైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకానమీ, స్టాండర్డ్ మరియు టర్బో మోడ్స్. అంతే కాకుండా ఈ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను పొందుతుంది. ఈ ఫీచర్ హైవేలపై స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు అదే వేగాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

ఇక GT డ్రైవ్ యొక్క దిగువ వేరియంట్, GT డ్రైవ్ ప్రో విషయానికి వస్తే, ఇది స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉంటుంది. ఈ స్కూటర్ తక్కువ దూరాలకు ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, మహిళలు, పిల్లల కోసం ప్రవేశపెట్టబడింది. GT డ్రైవ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో లెడ్ యాసిడ్ మరియు లిథియన్ అయాన్ బ్యాటరీలను అందించడం జరిగింది.

వీటితో పాటు GT ఫోర్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క నమూనాను కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ బైక్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

GT-ఫోర్స్ కంపెనీ దేశంలో తన పరిధిని విస్తరించడంతో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశవ్యాప్తంగా ఇప్పటికి 80 నగరాల్లో 100 కి పైగా డీలర్‌షిప్‌లతో డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్‌లలో తన ఉనికిని కొనసాగిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 150కి పైగా డిస్ట్రిబ్యూటర్లకు నెట్‌వర్క్‌ను విస్తరించాలని వాహన తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

నివేదికల ప్రకారం కంపెనీ ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో 7 ఎలక్ట్రిక్ టూ వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. భారతీయ మార్కెట్లో, GT-ఫోర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు హీరో ఎలక్ట్రిక్ మరియు ఒకినావా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలో దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తాయి. అప్పటి వరకు వేచి ఉండక తప్పదు.

GT Force నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు & ఎలక్ట్రిక్ బైక్‌ కూడా.. త్వరలో

దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం రోజురోజుకి ప్రగతి మార్గంలో పయనిస్తోంది. ఈ సమయంలో GT ఫోర్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ మూడు ఉత్పత్తులను తీసుకురానుంది. వీటికి తప్పకుండా మంచి ఆదరణ ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Gt force unveiled electric scooters and bike at ev auto expo 2021 details
Story first published: Tuesday, December 28, 2021, 14:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X