హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ బైక్ శ్రేణిపై ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్ మరియు స్ప్లెండర్ ఐ స్మార్ట్‌లపై ఏకంగా రూ. 14 వేల తగ్గింపును అందిస్తోంది.

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

కొత్త ఆర్థిక సంవత్సరం (2021-22) రాకముందే కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అంతే కాకుండా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో సహా ఇఎంఐ లావాదేవీలపై కంపెనీ రూ. 12 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

ఇప్పుడు కంపెనీ ఇది మాత్రమే కాకుండా పాత బైక్‌లపై ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌గా రూ. 2,000 తగ్గింపును అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు హీరో స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్ మరియు స్ప్లెండర్ ఐస్మార్ట్లలకు మాత్రమే వర్తిస్తాయి. దీని గురించి మరింత సమాచారం కోసం సమీప హీరో డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

హీరో స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ శ్రేణిలో అత్యంత సరసమైన బైక్. స్ప్లెండర్ ప్లస్ 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది, ఇది గరిష్టంగా 8.02 బిహెచ్‌పి శక్తిని మరియు 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదేవిధంగా హీరో సూపర్ స్ప్లెండర్ 125 సిసి ఇంజన్ కలిగి ఉంది, ఇది 10.8 బిహెచ్‌పి శక్తిని మరియు 10.6 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

స్ప్లెండర్ ఐ‌ స్మార్ట్ 113.2 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 9 బిహెచ్‌పి శక్తిని మరియు 9.89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సంస్థ యొక్క స్కూటర్ శ్రేణిలో 100 సిసి, 110 సిసి మరియు 125 సిసి స్కూటర్లు కూడా ఉన్నాయి.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

హీరో దేశంలో అతిపెద్ద బైక్ తయారీదారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, హీరో 2021 జనవరిలో 4,85,889 ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. హీరో మోటోకార్ప్ తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా ప్రవేశించడానికి కూడా సిద్ధమవుతోంది.

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

దీని కోసం సంస్థ మూడు ప్రాజెక్టులపై కృషి చేస్తోంది, దీనిలో కంపెనీ మొదటి ప్రాజెక్టులో తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. రెండవ ప్రాజెక్టులో, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ యొక్క నమూనాపై కంపెనీ పనిచేస్తుంది, ఇక చివర మూడవ ప్రాజెక్టులో, సంస్థ పెట్టుబడి ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

MOST READ:500 ఎకరాల్లో ఓలా మెగా ప్లాంట్; హోసూర్‌లో శరవేగంగా జరుగుతున్న పనులు

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

హీరో మోటోకార్ప్ ప్రస్తుతానికి ఇంకా ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయలేదు. అయితే కంపెనీ యొక్క ప్రత్యర్థులైన బజాజ్ మరియు టివిఎస్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేశాయి. అయితే హీరో మోటోకార్ప్ కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

హీరో మాస్ట్రో ఎడ్జ్ ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిగి ఉన్న ఒక కార్యక్రమంలో గత ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నమూనాను కంపెనీ వెల్లడించింది. అయితే ఒక సంవత్సరం గడిచినా కంపెనీ ఈ స్కూటర్‌ను విడుదల చేయలేదు.

కంపెనీ రాబోయే ఉత్పత్తుల విషయానికి వస్తే, ఇందులో మొదటిగా రానున్నది ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చు, ఇది హీరో మాస్ట్రో ఎడ్జ్ రూపకల్పనపై తయారు చేయబడుతుంది. ఈ స్కూటర్ ప్రస్తుత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా చౌకగా ఉంటుంది, ఇది బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ మరియు ఈథర్ వంటి ప్రీమియం స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

Most Read Articles

English summary
Hero Announced Discount On Splendor Bikes Upto Rs 14,000 Details. Read in Telugu.
Story first published: Saturday, February 27, 2021, 9:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X