2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

2021 ముగుస్తోంది. 2022 రావడానికి ఇంకా ఎన్ని రోజులో లేదు. ఈ తరుణంలో ఇప్పటికే చాలా వాహన తయారీ సంస్థలు రానున్న కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు తెలిపాయి. ఇందులో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కూడా ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

నివేదికల ప్రకారం హీరో మోటోకార్ప్ తన బైక్‌లు మరియు స్కూటర్ల ధరలను రానున్న కొత్త సంవత్సరం 2022 జనవరి 4 నుండి పెంచబోతున్నట్లు అధికారికంగా తెలిపింది. ముడిసరుకుల ధరలు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల జరుగుతోంది. కంపెనీ రూ. 2,000 వరకు పెంచే అవకాశం ఉంది.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

అయితే పపెంచనున్న ధరల వివిరాలు మోడల్స్ వారీగా అందుబటులో లేదు, త్వరలో కొత్త ధరల జాబితా అధికారికంగా వెలువడుతుంది. కొత్త సంవత్సరంలో పెరగనున్న ధరలు కొనుగోలుదారులపైనా ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయం త్వరలో తెలుస్తుంది.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ సమయంలో కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. వాహనాల తయారీకి కావాల్సిన ముడిసరుకులు ధరలు పెరగటం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

రానున్న రోజుల్లో కంపెనీ యొక్క ఉత్పత్తుల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గకూడదని, కొనుగోలుదారులకు అనుకూలంగా ఉండే ఫైనాన్స్ పథకాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త పథకాల వల్ల కొనుగోలుదారులు ఇప్పుడు మరింత సులభంగా వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

కంపెనీ అందిస్తున్న కొత్త పథకాల కింద జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ మరియు జీరో ప్రాసెసింగ్ ఉచితంగా లభిస్తాయి. ఈ అవకాశం కేవలం 2021 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ యొక్క వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ సదాకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

కంపెనీ యొక్క అమ్మకాలు చాలా తక్కుగా ఉన్న కారణంగా కంపెనీ ఈ ఫైనాన్స్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనితో పాటు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మరెన్నో ఆఫర్లను కూడా తీసుకు వచ్చింది. ఈ సంవత్సరం చివరిలో ద్విచక్ర వాహనాల అమ్మకాలను మెరుగుపరచడానికి, కంపెనీ రిటైల్ ఫైనాన్స్ కార్నివాల్‌తో ముందుకు వచ్చింది, దీని కింద కస్టమర్ల టూ వీలర్ కొనుగోలు ప్రక్రియను మెరుగుపరచాలని కంపెనీ కోరుకుంటుంది.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఆఫర్ల కింద కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనితో పాటు ఆధార్ ఆధారిత అప్లికేషన్ స్కీమ్ ప్రారంభించబడింది, దీని కింద మీకు వాహన ఫైనాన్స్ కోసం మాత్రమే ఆధార్ అవసరం. ఈ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడానికి, మీరు Hero MotoCorp యొక్క డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

ఇదిలా ఉండగా హీరో మోటోకార్ప్ ఇటీవల 2021 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో కంపెనీ 3,49,393 ద్విచక్ర వాహనాలను విక్రయించింది, ఇది నవంబర్ 2020లో విక్రయించిన 5,91,091 యూనిట్లతో పోలిస్తే 40.89% క్షీణించింది. హీరోల అమ్మకాలు కూడా నెలవారీగా భారీగా క్షీణించాయి.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

2021 అక్టోబర్ నెలలో విక్రయించిన 5,47,970 యూనిట్ల ద్విచక్ర వాహనాలతో పోలిస్తే నవంబర్ 2021లో 36.24% క్షీణతను కంపెనీ నమోదు చేసింది. కంపెనీ యొక్క మొతం దేశీయ అమ్మకాలు 42.90% తగ్గి 3,28,862 యూనిట్లకు చేరుకున్నాయి, అయితే మొత్తం ఎగుమతులు నవంబర్ 2021లో 35.66% పెరిగి 20,531 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తానికి కంపెనీ యొక్క అమ్మకాలు పండుగ సీజన్లో కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల కాలంలో హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 ని కొత్త కలర్ ఆప్సన్ లో విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పుడు మొత్తం 8 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్లో కొత్త కలర్ ఆప్సన్ కాకుండా ఇతర మార్పులు ఏమి చేయలేదు, అంతే కాకుండా ఈ స్కూటర్ ధరలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.

2022 లో మోగనున్న ధరల మోత.. Hero MotoCorp

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 యొక్క ఈ కొత్త కలర్ ఆప్సన్ లో, మూడు రంగుల మిశ్రమం కనిపిస్తుంది. దీని ముందు భాగంలోని ప్యానెల్, ఫ్లోర్‌బోర్డ్ ప్యానెల్ మరియు ఫ్రంట్ ఫెండర్ అంటివి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక దాని వెనుక భాగంలో బ్లాక్ కలర్ ఇవ్వబడింది, ఈ కలర్స్ మాత్రమే కాకుండా రెడ్, బ్లూ మరియు గ్రే కలర్ హైలైట్‌లు కూడా అక్కడక్కడా చూడవచ్చు. ఈ కొత్త స్కూటర్ వాహన వినియోగదారులను ఆకర్షించడంలో తప్పకుండా విజయం సాధిస్తుంది. కావున ఈ నెలలో అమ్మకాలు కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Hero motocorp bike scooter price hike from 4th january details
Story first published: Friday, December 24, 2021, 9:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X