అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం చెందిన బైక్ అండ్ స్కూటర్ తయారీదారులలో ఒకటి Hero Motocorp (హీరో మోటోకార్ప్). Hero Motocorp యొక్క అమ్మకాలు 2021 లో కొంతవరకు పెరుగుదల దిశవైపు పయనించింది. కంపెనీ నివేదికలు ప్రకారం 2021 జులై నెలలో దేశీయ మార్కెట్లో దాదాపు 4,29,138 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కంపెనీ యొక్క అమ్మకాలు 2020 వ సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సంవత్సరం ఏకంగా 14.23 శాతం తగ్గాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

Hero Motocorp యొక్క అమ్మకాలు 2020 జూలై నెలలో మొత్తం 5,00,307 యూనిట్లుగా కంపెనీ నివేదికల ప్రకారం స్పష్టమవుతుంది. అదేవిధంగా జులై నెల యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ 25,190 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. అంటే ఎగుమతులు గత సంవత్సరం కంటే కూడా 233.42 శాతం పెరిగినట్లు తెలిసింది. గత 2020 జులైలో కేవలం 7,555 యూనిట్ల వహ్హనాలను మాత్రమే కంపెనీ ఎగుమతి చేసింది.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

అమ్మకాల పరంగా Hero Motocorp కంపెనీ యొక్క ఏ బైక్ లేదా ఏ స్కూటర్ టాప్ 5 జాబితాలో చేరింది, అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.

Rank Domestic Jul-21 Jun-20 Growth (%)
1 Splendor 2,50,794 2,13,413 17.52
2 HF Deluxe 1,06,304 1,54,142 -31.04
3 Glamour 20,606 51,225 -59.77
4 Passion 18,316 44,377 -58.73
5 Pleasure 17,713 16,290 8.74
6 Destini 125 8,070 13,184 -38.79
7 Maestro 3,631 6,201 -41.44
8 Xtreme 160R 2,302 0 -
9 Xpulse 200 1,402 1,457 -4.95
Rank Exports Jul-21 Jul-20 Growth (%)
1 Achiever 8,623 989 771.89
2 Splendor 7,925 2,816 181.43
3 Hunk 3,518 386 811.40
4 HF Delux 3,052 40 7530.00
5 Xpulse 200 1,214 964 25.93
6 Maestro 650 48 1254.17
7 Pleasure 128 40 220.00
8 Destini 125 80 80 0
9 Glamour 0 512 -100.00
10 Passion 0 1,270 -100.00
11 Xtreme 150 0 410 -100.00
అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

Hero Motocorp కంపెనీ దేశీయ మార్కెట్లో, గత నెలలో అత్యధికంగా Hero Splendor (హీరో స్ప్లెండర్‌)ను విక్రయించింది. Hero Splendor యొక్క అమ్మకాలు మొత్తం 2,50,794 యూనిట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే దీని అమ్మకాలు 17.52 శాతం పెరిగాయి. రెండవ స్థానంలో Hero Deluxe (హీరో డీలక్స్) ఉంది. గత నెలలో కంపెనీ Hero Deluxe బైకులను మొత్తం 1,06,304 యూనిట్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించింది. అయినప్పటికీ Hero Deluxe యొక్క అమ్మకాలు మునుపటికంటే కూడా 31.04 శాతం తగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

Hero Motocorp కంపెనీ యొక్క Hero Glamour (హీరో గ్లామర్) ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో ఉంది. ఈ Hero Glamour బైక్ మొత్తం అమ్మకాలు 20,606 యూనిట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే దీని అమ్మకాలు 59.77 శాతం తగ్గాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

అదేవిధంగా Hero Passion (హీరో ప్యాషన్) 18,316 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో చేరింది. అంతే కాకుండా Hero Passion యొక్క అమ్మకాలు మునుపటికంటే కూడా 58.73 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

Hero Motocorp యొక్క Hero Pleasure (హీరో ప్లెజర్) స్కూటర్ ఈ లిస్ట్ లో 5 స్థానాన్ని పొందింది. Hero Pleasure యొక్క అమ్మకాలు 17,713 యూనిట్లు. ఈ అమ్మకాలు గత సంవత్సరం జూలై నెలతో పోలిస్తే 8.74 శాతం పెరిగాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు Hero Motocorp యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, ఇందులో టాప్ 5 జాబితాలో Hero Motocorp యొక్క Hero Achiever (హీరో అచీవర్) 8,623 యూనిట్ల ఎగుమతులతో మొదటి స్థానంలో ఉంది. ఈ అమ్మకాలు గత సంవత్సరం కంటే కూడా 771.89 శాతం ఎక్కువ.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

కంపెనీ యొక్క Hero Splendor (హీరో స్ప్లెండర్) రెండవ స్థానంలోనూ, Hero Hunk (హీరో హంక్) మూడవ స్థానంలోనూ ఉంది. వీటి ఎగుమతులు వరుసగా 7,925 యూనిట్లు మరియు 3,518 యూనిట్లు. ఈ అమ్మకాలు గత సంవత్సరం కంటే కూడా 181.43 శాతం మరియు 811.40 శాతం పెరిగాయి.

అమ్మకాల్లో అదరగొడుతున్న Hero Motocorp; మోడల్స్ వారీగా అమ్మకాలు

Hero HF Deluxe (హీరో హెచ్ఎఫ్ డీలక్స్) ఈ లిస్ట్ లో నాల్గవ స్థానంలో ఉంది. Hero HF Deluxe యొక్క ఎగుమతులు గత నెలలో 3,052 యూనిట్లు. Hero HF Deluxe యొక్క ఎగుమతులు మునుపటికంటే కూడా 7530.00 శాతం పెరిగాయి. అదే సమయంలో, చివరగా ఈ లిస్ట్ లో 5 వ స్థానంలో చేరిన Hero Motocorp యొక్క బైక్ Hero Xpulse 200 (హీరో ఎక్స్‌పల్స్ 200). ఇది 1,214 యూనిట్లను ఎగుమతి చేసి, మునుపటికంటే కూడా 25.93 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Most Read Articles

English summary
Hero motocorp july 2021 domestic sales and export breakup details
Story first published: Monday, August 30, 2021, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X