గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

భారతదేశంలో ప్రముఖ బైక్ అండ్ స్కూటర్స్ తయారీదారు హీరో మోటోకార్ప్ కొత్త 'గ్లామర్ ఎక్స్‌టెక్' ని విడుదల చేసింది. కొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 78,900 (ఎక్స్‌షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ డ్రమ్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ. 78,900 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 83,500.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్ అయిన తర్వాత ఇది గ్లామర్ రేంజ్‌లోనే ఖరీదైన బైక్‌గా మారింది. అయితే ఈ బైక్ అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్స్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో ఇప్పుడు కొన్ని మార్పులు కూడా జరిగాయి. ఇవన్నీ ఈ బైక్ కి మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసి బ్లాక్ మరియు మాట్టే యాక్సిస్ గ్రే కలర్స్.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

స్టాండర్డ్ హీరో గ్లామర్ మోటార్‌సైకిల్‌తో పోలిస్తే, కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ డిజైన్ లో దాదాపు ఎటువంటి మార్పులు ఉండవు. అయితే ఈ కొత్త వేరియంట్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, హెచ్-సిగ్నేచర్ పొజిషన్ లాంప్, 3 డి లోగో, రిమ్ టేప్ మరియు మాట్టే బ్లాక్ కలర్ స్కీమ్‌తో కాంట్రాస్ట్ బ్లూ యాక్సెంట్స్ లభిస్తాయి. కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల, ఇది స్టాండర్డ్ గ్లామర్ కంటే ఎక్కువ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో సెగ్మెంట్ ఫస్ట్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో గూగుల్ మ్యాప్ కనెక్టివిటీతో కాల్ అలెర్ట్, ఎస్ఎంఎస్ అలెర్ట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

గ్లామర్ ఎక్స్‌టెక్ లో కన్సోల్ గేర్ పొజిషన్ ఇండికేటర్, టాకోమీటర్ ఉంటాయి. ఇది ఎకో మోడ్ మరియు రియల్ టైమ్ ఫ్యూయెల్ కెపాసిటీ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇది కాకుండా, హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ ఇంటిగ్రేటెడ్ యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్ మరియు ఐ 3 స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను పొందుతుంది.

గ్లామర్ ఎక్స్‌టెక్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

రైడర్ మరియు పిలియన్ యొక్క భద్రత కోసం, మోటార్ సైకిల్‌లో సైడ్-స్టాండ్ విజువల్ ఇండికేషన్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ‘సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్' ఉన్నాయి. గ్లామర్ ఎక్స్‌టెక్ లో బ్యాంక్-యాంగిల్-సెన్సార్ కూడా ఉంది. వెనుక 5 స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్సార్బర్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి.

గ్లామర్ ఎక్స్‌టిఇసి విడుదల చేసిన హీరో మోటోకార్ప్; ధర & వివరాలు

గ్లామర్ ఎక్స్‌టెక్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు. ఇందులో 125 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉపయోగించబడ్డాయి.

Most Read Articles

English summary
Hero Glamour XTEC Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, July 21, 2021, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X