భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

భారతదేశంలో ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్య మానవుడిపై ఎక్కువ భారాన్ని కలిగిస్తున్నాయి. ఈ కారణంగా దేశీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది.

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భాగంగా కొత్త కంపెనీలు కూడా తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలగా రూపొందించడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తున్నాయి.

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

ఇప్పటికే మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు బజాజ్, టీవీఎస్ మోటార్ ఇప్పటికే భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

హీరో మోటోకార్ప్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హోండా మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కూడా ఉత్పత్తి చేయనున్నాయి. హీరో మోటోకార్ప్ ఇటీవలే తైవాన్లోని గొగోరోతో బ్యాటరీ ఎక్స్ఛేంజ్ నెట్‌వర్క్‌లు మరియు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

హీరో మోటోకార్ప్ తన తైవానీస్ భాగస్వామి గొగోరోతో పాటు దాని ఓన్ ఫిక్స్డ్-బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా తయారు చేసినట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ కొన్ని సంవత్సరాల క్రితం డ్యూయెట్ మరియు మాస్ట్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

కావున కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ స్కూటర్లలో ఒకదాన్ని వచ్చే ఏడాది ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కంపెనీ వచ్చే ఏడాది సరికొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టగలదు. కావున దేశంలో ఈ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టినట్లైతే మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

కరోనా ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు ప్రతిస్పందనగా హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 22 మధ్య నాలుగు రోజుల పాటు తన ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేసింది. తరువాత దీనిని మే 9 వరకు పొడిగించారు. ఇది ఇప్పుడు ఉత్పత్తి కేంద్రాన్ని మళ్ళీ 2021 మే 16 వరకు పొడిగించింది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

ఢిల్లీ మరియు ఎన్‌సిఆర్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ మరియు గుజరాత్‌లతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది భద్రత కోసం వ్యక్తిగత ప్రయాణానికి బైక్ అంబులెన్స్‌లను హీరో మోటోకార్ప్ అందిస్తుంది. హీరో మోటోకార్ప్ అనేక విధాలుగా కరోనాపై పోరాటంలో పాల్గొంటుంది.

భారత్‌లో ప్రవేశించనున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

దేశంలో హీరో మోటోకార్ప్ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉంది. కావున కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. త్వరలో హీరో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టినట్లైతే అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇతర వాహనదారులకు సరైన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం కూడా ఉంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

Most Read Articles

English summary
Hero MotoCorp’s First Electric Scooter Likely To Be Launched Next Year. Read in Telugu.
Story first published: Wednesday, May 12, 2021, 17:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X