లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి భయం మరియు ప్రజా రవాణా అందుబాటులో లేకపోడంతో కొనుగోలుదారులు ద్విచక్ర వాహనాలపై ఎక్కు ఆసక్తి చూపుతున్నారు.

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ గడచిన మే 2021 నెలలో మొత్తం 1,83,044 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు 62.44 శాతం వృద్ధి చెందాయని కంపెనీ పేర్కొంది. అయితే, మే 2020 ప్రధమార్థం అంతా సంపూర్ణ లాక్‌డౌన్‌తో గడిచిపోయిన సంగతి తెలిసినదే.

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

గత నెలలో హీరో మోటోకార్ప్ విక్రయించిన మొత్తం 1,83,044 యూనిట్లలో, కంపెనీ దేశీయ మార్కెట్లో 1,59,561 యూనిట్లను విక్రయించగా, మిగిలిన 23,483 యూనిట్లను పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 46.59 శాతం పెరగగా, ఎగుమతులు 512 శాతం పెరిగాయి.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

హీరో మోటోకార్ప్ మే 2021 నెలలో 1,78,706 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించగా 4,338 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. భారతీయ మార్కెట్లోని ఇతర వాహన తయారీదారుల మాదిరిగానే, హీరో మోటోకార్ప్ కూడా దాని నెలవారీ అమ్మకాలతో పోల్చినప్పుడు ప్రతికూల ఫలితాలను కనబరిచింది.

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

ఏప్రిల్ 2021 నెల అమ్మకాలతో పోలిస్తే, ఈ బ్రాండ్ గత నెల మొత్తం అమ్మకాలలో 50.83 శాతం క్షీణతను నమోదు చేసింది. ఏప్రిల్ 2021లో హీరో మోటోకార్ప్ మొత్తం 372,285 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ దాదాపు నెల రోజుల పాటు తమ ప్లాంట్లలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, గడచిన ఏప్రిల్ 22 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉత్పాదక కేంద్రాలలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. కాగా, మే 17న గురుగ్రామ్, హరిద్వార్ మరియు ధారుహేరాలో ఉన్న ఆరు తయారీ కర్మాగారాలలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

దేశంలో టీకా డ్రైవ్ వేగవంతం కావడం మరియు కోవిడ్-పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గడంతో, దేశవ్యాప్తంగా మార్కెట్లు క్రమంగా తెరుచుకుంటున్నాయి. రానున్న వారాల్లో వ్యాపారాలు వేగంగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు ఉద్యోగులు మరియు కస్టమర్లకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి కంపెనీ అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత వినూత్న డిజిటల్ సాధనాలను ప్రారంభించాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్ తెలిపింది.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన హీరో జోరు; కరోనా భయంతో పెరిగిన సేల్స్!

ఇదిలా ఉంటే, ఈ కష్ట కాలంలో హీరో మోటోకార్ప్ తమ వినియోగదారుల కోసం వాహనాలపై వారంటీ మరియు ఉచిత సేవలను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. సిఎస్ఆర్ ప్లాట్‌ఫామ్ "హీరో వి కేర్" కింద, హీరో మోటోకార్ప్ హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా పరిపాలనతో కలిసి నగరంలో తాత్కాలికంగా 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Most Read Articles

English summary
Hero MotoCorp Registers Over 62 Percent Growth In May 2021 Sales, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X