కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ గురించి ఆటోమోటివ్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో విధించిన సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా, ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు రెండు నెలల పాటు సున్నా అమ్మకాలను చూశాయి.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

ఈ ఏడాది కూడా అదే తరహా పరిస్థితులు ఎదురవ్వొచ్చని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంటే, మరికొన్ని కంపెనీ పరిమిత సిబ్బందితో వాహనాలను తయారు చేస్తున్నాయి.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

తాజాగా, భారతదేశపు అతిపెద్ద టూవీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్ 22 నుండి నాలుగు రోజుల పాటు తమ ప్లాంట్లు మరియు పరిశోధనా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, సంక్రమణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తమ ఉద్యోగుల భద్రత మరియు మంచి ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశంలోని అన్ని తయారీ కర్మాగారాలను మూసివేస్తుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకనటలో తెలిపింది.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

ప్లాంట్‌లను మూసివేయడం వలన నాలుగు రోజుల పాటు వాహనాల ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ తాత్కాలిక షట్‌డౌన్ వలన ప్లాంట్లలో అవసరమైన నిర్వహణ పనులు నిర్వహించడం సులువు అవుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

అదే సమయంలో, కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. కాగా, హీరో మోటోకార్ప్ తమ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయటం వలన టూవీలర్ల డిమాండ్, సప్లయ్ ఏమాత్రం ప్రభావితం కాబోదని కంపెనీ స్పష్టం చేసింది.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ భారతదేశంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చాప క్రింద నీరులా వ్యాపిస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే, ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉంది. వైరస్ సోకిన వారి సంఖ్య మరియు వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్‌లను విధిస్తున్నారు. అవరసమైతే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హీరో మోటోకార్ప్ తమ ఉద్యోగుల కోసం కరోనా టీకా ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

హీరో మోటోకార్ప్ గ్రూప్ కంపెనీలైన హీరో ఫిన్‌కార్ప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, రాక్‌మన్ ఇండస్ట్రీస్, హీరో ఎలక్ట్రానిక్స్ మరియు ఏజి ఇండస్ట్రీస్‌లో కంపెనీ కోవిడ్ టీకా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ టీకా ప్రచారంలో, హీరో మోటోకార్ప్ యొక్క 80,000 మందికి పైగా ఉద్యోగులు టీకాలు వేసుకోనున్నారు.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

హీరో మోటోకార్ప్ తమ అన్ని డీలర్‌షిప్‌లలో కూడా తప్పనిసరి టీకా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదులను అందిస్తున్నారు.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి కంపెనీ 100 కోట్ల రూపాయల సహాయక మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు వివరించింది. ఈ మొత్తంలో 50 శాతం పిఎం కేర్స్ ఫండ్‌లో జమ చేయగా, 50 శాతం మొత్తాన్ని దేశవ్యాప్తంగా నడుస్తున్న రాహత్ ప్రచారంలో ఖర్చు చేశారు.

కోవిడ్-19 సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్!

గత సంవత్సరం, కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేపట్టిన సహాయ చర్యలలో భాగంగా, కంపెనీ 23 లక్షల భోజన ప్యాకెట్లు, 37, 805 రేషన్ కిట్లు, 37,700 లీటర్ల హ్యాండ్ శానిటైజర్, 4.5 మిలియన్లకు పైగా ఫేస్ మాస్క్‌లు మరియు 57,000 పిపిఇ కిట్‌లను పంపిణీ చేసింది.

Most Read Articles

English summary
Hero Motocorp Temporarily Halts Production For Four Days Amid Corona Pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X