మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ తమ అన్ని ప్లాంట్లను మే 9, 2021వ తేదీ వరకూ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఈ తాత్కాలిక ప్లాంట్ల మూసివేతను మరికొన్ని రోజులు పొడగిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో, ఇది వరకు తీసుకు నిర్ణయాన్ని (తాత్కాలికంగా అన్ని ప్లాంట్ల మూసివేతను) మే 16, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద టూవీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్ 22న తమ అన్ని ప్లాంట్లను మరియు పరిశోధనా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

దేశంలో కోవిడ్-19 కేసులు నిరంతరం పెరగుతూనే ఉండటం వలన, ఈ గడువును మే 16 వరకు పొడిగించాలని హీరో మోటోకార్ప్ నిర్ణయించింది. ఈ సమయంలో జైపూర్‌లోని నీమ్రానాలో ఉన్న హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (జిపిసి) మరియు సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) సంస్థలను కూడా మూసివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

కోవిడ్-19 శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, సంక్రమణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తమ ఉద్యోగుల భద్రత మరియు మంచి ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ దేశంలోని అన్ని తయారీ కర్మాగారాలను మూసివేస్తున్నామని, అదే సమయంలో తాము ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఈ పరిస్థితులు మెరుగుపడిన త్వరగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి కావల్సిన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

ఈ విపత్కర సమయంలో, హీరో మోటోకార్ప్ కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తమ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేయటం వలన టూవీలర్ల డిమాండ్, సప్లయ్ ఏమాత్రం ప్రభావితం కాబోదని హీరో మోటోకార్ప్ చెబుతున్నప్పటికీ, పరిస్థితులు చూస్తుంటే మాత్రం రానున్న రోజుల్లో హీరో టూవీలర్ల కోసం వెయిటింగ్ పీరియడ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ తమ ఉద్యోగుల కోసం కరోనా టీకా ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. తమ ఉద్యోగుల భద్రత దృష్ట్యా కంపెనీ వారందరికీ ఉచితంగా టీకాలను వేయిస్తోంది. హీరో మోటోకార్ప్ గ్రూప్ కంపెనీలైన హీరో ఫిన్‌కార్ప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, రాక్‌మన్ ఇండస్ట్రీస్, హీరో ఎలక్ట్రానిక్స్ మరియు ఏజి ఇండస్ట్రీస్‌లో కంపెనీ కోవిడ్ టీకా కార్యక్రమాలను ప్రారంభించింది.

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

ఈ టీకా ప్రచారంలో, హీరో మోటోకార్ప్ యొక్క 80,000 మందికి పైగా ఉద్యోగులు టీకాలు వేసుకోనున్నారు. హీరో మోటోకార్ప్ తమ అన్ని డీలర్‌షిప్‌లలో కూడా తప్పనిసరి టీకా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదులను అందిస్తున్నారు.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి కంపెనీ 100 కోట్ల రూపాయల సహాయక మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు వివరించింది. ఈ మొత్తంలో 50 శాతం పిఎం కేర్స్ ఫండ్‌లో జమ చేయగా, 50 శాతం మొత్తాన్ని దేశవ్యాప్తంగా నడుస్తున్న రాహత్ ప్రచారంలో ఖర్చు చేశారు.

మరికొన్ని రోజుల పాటు ప్లాంట్లను మూసివేయక తప్పట్లేదు: హీరో మోటోకార్ప్

గత ఏడాది కూడా హీరో మోటోకార్ప్ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేపట్టిన సహాయ చర్యలలో భాగంగా, 23 లక్షల భోజన ప్యాకెట్లు, 37, 805 రేషన్ కిట్లు, 37,700 లీటర్ల హ్యాండ్ శానిటైజర్, 4.5 మిలియన్లకు పైగా ఫేస్ మాస్క్‌లు మరియు 57,000 పిపిఇ కిట్‌లను పంపిణీ చేసింది.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

Most Read Articles

English summary
Hero MotoCorp Temporary Plants Shutdown Extended Till May 16, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X