మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

భారత మార్కెట్లో అతి పెద్ద బైక్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ ఇటీవల తన బ్రాండ్ యొక్క బైకులు మరియు స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల 2021 జులై 01 నుంచి అమల్లోకి రానుంది. కంపెనీ యొక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల తయారీ ఖర్చు కూడా పెరిగిందని కంపెనీ తెలిపింది.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

ఈ పరిస్థితిలో సంస్థ వాహనాల ధరలను పెంచడం ద్వారా కంపెనీ యొక్క అధిక ధరల భారాన్ని తగ్గించబడాలచింది. ధరల పెరుగుదల తర్వాత కూడా వినియోగదారులపై అధిక భారం పడకుండా కంపెనీ జాగ్రత్త తీసుకోవడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలిపింది.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం 2021 జూలై 1 నుంచి తన ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 వరకు పెరుగుతుంది. ఈ ధరల పెరుగుదల కూడా మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ఉంటుంది. ఈ సంవత్సరం కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం వరుసగా ఇది మూడవసారి. కంపెనీ ఈ ఏడాది జనవరి మరియు ఏప్రిల్ నెలల్లో ధరలను పెంచిన విషయం అందరకి తెలిసిందే.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

హీరో మోటోకార్ప్ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో అంటే 2021 మే నెలలో మొత్తం 1,83,044 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. అదేవిధంగా 2020 మే నెలలోని అమ్మకాలు మొత్తం 1,12,682 యూనిట్లు. ఏప్రిల్ 2021 తో పోల్చితే మే 2021 లో కంపెనీ తక్కువ అమ్మకాలు జరిపినట్లు తెలిసింది.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం, 2021 ఏప్రిల్ నెలలో 372,285 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2021 మే నెలలో 1,78,076 మోటార్ సైకిళ్ళు, 4,338 స్కూటర్లను విక్రయించినట్లు తెలిసింది. అదే సమయంలో 2021 ఏప్రిల్‌లో 3,39,329 యూనిట్ల మోటార్‌సైకిళ్లు, 32,956 యూనిట్ల స్కూటర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ముడి పదార్థాలైన స్టీల్, ప్లాస్టిక్ ఖర్చులు అమాంతం పెరుగుతున్నాయి. అంతే కాకుండా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల కంపెనీకి సంబంధించిన మొత్తం కార్యకలాపాలు నిలిపివేయడం జరిగింది. ఈ కారణంగానే కంపెనీ తన బ్రాండ్ వాహనాలపై ధరలను పెంచవలసి వచ్చింది.

మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు

కరోనా సెకండ్ వేవ్ కారణంగానే కంపెనీ యొక్క అమ్మకాలు మరియు ఉత్పత్తి చాలా వరకు తగ్గింది. అయితే కంపెనీ ఇప్పుడు తమ వాహన ధరలను పెంచుడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉందా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Hero Bikes & Scooters Price Hike New Prices Effective From July 2021. Read in Telugu.
Story first published: Thursday, June 24, 2021, 12:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X