పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఏప్రిల్ 2021 నుండి తమ ఉత్పత్తుల ధరలను పెంచుతామని గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా భారతదేశపు అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ కూడా తమ ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ రేంజ్ మోడళ్ల ధరలను పెంచింది.

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

ఈ సిరీస్‌లో మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరలు రూ.3,000 వరకూ పెరిగాయి. ధరల పెంపు అనంతరం హీరో ఎక్స్‌పల్స్ 200 ధర రూ.1,18,230 లకు చేరుకోగా, ఎక్స్‌పల్స్ 200టి ధర రూ.1,15,800 లకు పెరిగింది. కాగా, హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ధర రూ.1,20,214 లకు చేరుకుంది.

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

ఈ మోటార్‌సైకిళ్లలో ధరల పెరుగుదల మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. హీరో ఎక్స్‌పల్స్ రేంజ్ మోటార్‌సైకిళ్లలో 199.6 సిసి సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ఇంజెక్ట్ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 18.01 బిహెచ్‌పి పవర్‌ను మరియు 16.15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగానే మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. హీరో మోటోకార్ప్‌తో పాటుగా యమహా, బజాజ్ ఆటో వంటి ఇతర టూవీలర్ బ్రాండ్స్ కూడా ఏప్రిల్ నెలలో తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

హీరో ఎక్స్‌పల్స్ రేంజ్‌లోని బైక్‌లు ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తో మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటాయి. ఈ బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఇది సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

హీరో కరిజ్మా మోటార్‌సైకిల్‌ను నిలిపివేసిన తర్వాత, దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ సరికొత్త ఎక్స్‌సెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ బైక్‌లో 200 సిసి ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 17 బిహెచ్‌పి పవర్‌ను మరియు 16.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

హీరో మోటోకార్ప్ గడచిన మార్చి 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ కంపెనీ గత నెలలో 5.77 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, గత ఏడాది మార్చిలో అమ్మిన 3.34 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం ఎక్కువ. బిఎస్ 6 అప్‌డేట్, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది అమ్మకాలు ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

పెరిగిన హీరో ఎక్స్‌పల్స్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిళ్ల ధరలు

హీరో మోటోకార్ప్ మార్చిలో ఇప్పటివరకు అత్యధిక వాహనాలను ఎగుమతి చేసింది. హీరో మోటోకార్ప్ 2021 మార్చిలో మొత్తం 32,617 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 17,962 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు 82 శాతం పెరిగాయి.

Most Read Articles

English summary
Hero Xpulse 200, Xpulse 200T And Xtreme 200S Prices Increased. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X