హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు

హీరో మోటోకార్ప్ తన ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ యొక్క 100 మిలియన్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ. 1,08,750 (ఎక్స్‌షోరూమ్). హీరో మోటోకార్ప్ 2021 జనవరి నెలలో 100 మిలియన్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి రికార్డును పూర్తి చేసింది. ఈ సందర్భంగా 6 స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ యొక్క స్పెషల్ 160 మోడల్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ యొక్క 100 మిలియన్ ఎడిషన్ మోడల్ డ్యూయల్ టోన్ పెయింట్‌ స్కీమ్ తో వస్తుంది. ఇది దాని స్టాండర్డ్ మోడల్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ రెడ్ అండ్ వైట్ డ్యూయల్ టోన్ పెయింట్‌లో ప్రవేశపెట్టబడింది. ఈ బైక్ సైడ్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్, హెడ్‌లైట్ మాస్క్ మరియు వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ పెయింట్ ఉపయోగించబడింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

అయితే ఈ బైక్ యొక్క అన్ని ఫీచర్లు స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడ్డాయి. ఇందులో హెడ్‌లైట్, టైల్ లైట్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్ లైట్ వంటివి ఉన్నాయి. మొత్తం మార్పులు బైక్ యొక్క పెయింట్ మరియు గ్రాఫిక్స్ మాత్రమే చేయబడ్డాయి. బైక్ యొక్క పవర్ ఫిగర్ కూడా మార్చబడలేదు.

MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్‌లో 163 ​​సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 15 బిహెచ్‌పి శక్తిని మరియు 14 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్‌లో ఆటో-సేల్ టెక్నాలజీ ఉన్నాయి, ఇది బైక్‌ను ట్రాఫిక్‌లో సజావుగా నడిపించేలా చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ సింగిల్ డిస్క్ మరియు డ్యూయల్ డిస్క్ వేరియంట్లలో అందుబాటులో ఉంచబడింది. బైక్ యొక్క సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1,03,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరియు డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1,06,950 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

హీరో మోటోకార్ప్ 2022 ఆర్థిక సంవత్సరానికి తన ఉత్పత్తి విధానాలను ప్రకటించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 70.50 లక్షల ద్విచక్ర వాహనాలను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో కరోనా లాక్ డౌన్ ముగిసిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

ద్విచక్ర వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, 2022 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత పరిస్థితుల కంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, ఇది డిమాండ్‌ను పెంచుతుందని కంపెనీ పేర్కొంది. దీనిని తీర్చడానికి, సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవటానికి, సంస్థ ప్రతి నెలా 6.50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం, కంపెనీ సంవత్సరానికి 4 లక్షల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది, ఇది రాబోయే కొన్నేళ్లలో 8 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 100 మిలియన్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు

ఫిబ్రవరి 2021 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కంపెనీ 5,05,467 యూనిట్ల ద్విచక్ర వాహనాన్ని విక్రయించింది. ఇందులో 4,84,433 యూనిట్ల ద్విచక్ర వాహనం దేశీయ మార్కెట్లో, 21,034 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది.

Most Read Articles

English summary
Hero Xtreme 160R 100 Million Edition Launched. Read in Telugu.
Story first published: Friday, March 12, 2021, 19:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X