Just In
Don't Miss
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- News
దారుణం.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో గాజు గ్లాసుతో చిత్రహింసలు...
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో విడుదలైన 2021 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ : పూర్తి వివరాలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా ఎంవై 2021 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త 2021 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ ధర దేశీయ మార్కెట్లో రూ. 15.96 లక్షలు, (ఎక్స్-షోరూమ్,ఇండియా).

భారత మార్కెట్లో ఈ కొత్త 2021 ఆఫ్రికా ట్విన్ కోసం హోండా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా ఉన్న బ్రాండ్ యొక్క డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. 2021 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరర్ బ్రాండ్ యొక్క బిగ్‌వింగ్ టాప్‌లైన్ షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతుంది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి రైడింగ్ అనుభవాన్ని అందించే విధంగా తయారుచేయబడింది. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉంటాయి.
MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

2021 హోండా ఆఫ్రికా ట్విన్ మునుపటి మోడల్ నుంచి ఫీచర్స్ మరియు పరికరాలతో ముందుకు వెళ్తుంది. ఈ అడ్వెంచర్-టూరర్ యొక్క ఎంవై 2021 లో ఉన్న ఏకైక మార్పు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో కొత్త పెయింట్ స్కీమ్స్ ప్రవేశపెట్టడం.

2021 హోండా ఆఫ్రికా ట్విన్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఇప్పుడు ‘డార్క్ నెస్ బ్లాక్ మెటాలిక్' కలర్ లో వస్తుంది. అడ్వెంచర్-టూరర్ యొక్క డిసిటి ఆటోమేటిక్ వేరియంట్ పెర్ల్ గ్లేర్ వైట్ కలర్స్ లో అందించబడుతుంది.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

2021 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కార్నరింగ్ లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, 5 టైప్స్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ మరియు అడ్జస్టబుల్ డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.

2021 ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపిల్ కార్ప్లే మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో 6.5 ఇంచెస్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కొత్త 2021 మోడల్‌లోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వీలీ కంట్రోల్, 6 యాక్సిస్ ఐఎంయు, కార్నరింగ్ ఎబిఎస్, రియర్ లిఫ్ట్ కంట్రోల్ మరియు డిసిటి వేరియంట్‌లో కార్నరింగ్ డిటెక్షన్ వంటివి ఉన్నాయి.
MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

అడ్వెంచర్ టూరర్ అర్బన్, టూర్, గ్రావెల్, ఆఫ్-రోడ్ మరియు రెండు అదర్ కస్టమైజేబుల్ మోడ్‌లతో సహా మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. 2021 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్‌లో అదే 1084 సిసి ప్యారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది మాన్యువల్ లేదా డిసిటి ట్రాన్స్మిషన్ అప్సన్ తో 98 బిహెచ్‌పి మరియు 103 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2021 హోండా ఆఫ్రికా ట్విన్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యంత ప్రీమియం మరియు ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్-టూరర్ ఆఫర్. కొత్త 2021 ఆఫ్రికా ట్విన్ తక్కువ నవీనీకరణలతో వస్తుంది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జిఎస్, డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ మరియు ట్రయంఫ్ టైగర్ 900 వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది.
MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి