సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

ఇటలీలోని ఫెరా మిలాన్ నగరంలో జరుగుతున్న 2021 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షో (EICMA)లో హోండా తమ కొత్త మాక్సీ స్కూటర్ 'ఎడివి 350' (Honda ADV 350) ని విడుదల చేసింది. హోండా యొక్క అడ్వెంచర్ స్కూటర్ సిరీస్ లో ఇది మూడవ మోడల్. హోండా ఇప్పటికే తమ అడ్వెంచర్ స్కూటర్ సిరీస్ లో X-ADV మరియు ADV 150 మోడళ్లను విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ లోకి ADV 350 మోడల్ వచ్చి చేరింది.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

హోండా ADV 350 యొక్క స్టైలింగ్ చూడటానికి హోండా X-ADV నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది మరియు ఇది ఆ స్కూటర్‌తో అనేక ఫీచర్లను కూడా పంచుకుంటుంది. హోండా ADV 35 మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. వీటిలో స్పాంగిల్ సిల్వర్ మెటాలిక్, మ్యాట్ కార్బోనియం గ్రే మెటాలిక్ మరియు మాట్ కార్నెలియన్ రెడ్ మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

ఈ సరికొత్త అడ్వెంచరస్ మాక్సీ స్కూటర్ హోండా యొక్క ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్ ఛాస్సిస్ పై నిర్మించారు. దీని కొలతల విషయానికి వస్తే, హోండా అడ్వెంచర్ 350 పొడవు 2200 మిమీ, వెడల్పు 895 మిమీ మరియు ఎత్తు 1295 మిమీ గా ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క వీల్‌బేస్ 1520 మిమీ గా ఉంటుంది. కొత్త అప్‌డేట్స్ కారణంగా, ఈ 2022 మోడల్ హోండా ADV 350 దాని మునుపటి మోడల్ కంపెనీ మరింత భారీగా (186 కిలోలు) ఉంటుంది.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

హోండా ADV 350 డ్యూయల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌ లతో పాటుగా రెండు-దశల సర్దుబాటు చేయగల (టూ-స్టెప్ అడ్జస్టబల్) విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులోని సస్పెన్షన్ సెటప్ ను 2 దశలు మరియు 133 మిమీ ట్రావెల్ తో స్లైడ్-లాక్ మెకానిజం ద్వారా సర్దుబాటు చేసే సౌలభ్యం ఉంటుంది. ఇంకా, ఈ స్కూటర్ లో USB టైప్ C సాకెట్ మరియు గ్లోవ్ బాక్స్‌ వంటి ఫీచర్లు కూడా న్నాయి. ఈ స్కూటర్ యొక్క సీటు ఎత్తు 795 మీటర్లు కాగా, అండర్ సీట్ స్టోరేజ్ 48 లీటర్లుగా ఉంటుంది.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

ఈ స్కూటర్ సీటు క్రింది భాగంలో రెండు ఫుల్ సైజ్ హెల్మెట్‌లను ఉంచగల స్థలం ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, హోండా అడ్వెంచర్ 350 లో ఆన్-స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, హోండా రోడ్‌సింక్ ఆల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కనెక్టింగ్ ఫీచర్ల సాయంతో ఫోన్ కాల్స్ స్వీకరించడం లేదా తిరస్కరించడం, సంగీతాన్ని కంట్రోల్ చేయడం మరియు జిపిఎస్ నావిగేషన్ మొదలైన వాటిని యాక్సెస్ చేయవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్ లాక్ ఫీచర్‌తో కూడా వస్తుంది, ఇందులో రైడర్ స్కూటర్ నుండి ఒక నిర్దిష్ట పరిధి నుండి దూరంగా వెళ్ళిన వెంటనే స్కూటర్ యొక్క ఇగ్నిషన్ మరియు సీటు ఆటోమేటిక్ గా లాక్ అవుతాయి.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త హోండా ADV 350 మాక్సీ స్కూటర్ లో 330 సిసి ఎస్ఓహెచ్‌సి 4 వాల్వ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 కిలోవాట్ (29 పిఎస్) శక్తిని మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 31.5 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ అడ్వెంచర్ స్కూటర్ పై ఫుల్ ట్యాంక్ ఇంధనంతో గరిష్టంగా 340 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. దీని సగటు మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లుగా సర్టిఫై చేయబడింది.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

హోండా అడ్వెంచర్ 350 బైక్ ను ఇటు సిటీ ప్రయాణానికి మరియు అటు అడ్వెంచర్ రైడింగ్ కోసం ఉపయోగించేలా డిజైన్ చేయబడింది. ఇందులో ముందు వైపు 37 మిమీ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ ఉంటుంది. ఈ స్కూటర్ కు ఇరువైపులా రెండు చక్రాలకు రెండు డిస్క్ బ్రేక్‌ లు అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

హోండా ఈ అడ్వెంచర్ స్కూటర్‌ కోసం కొన్ని రకాల యాక్సెసరీస్ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో అదనపు లగేజ్ తీసుకువెళ్లడం కోసం 50 లీటర్ల స్మార్ట్ టాప్ బాక్స్, రియర్ క్యారియర్ రాక్, ఇన్నర్ బ్యాగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే, శీతాకాలం కోసం ఈ స్కూటర్ కు హీటెడ్ గ్రిప్ లను కంపెనీ అదనపు యాక్ససరీగా అందిస్తోంది. అంతేకాకుండా, ఈ స్కూటర్ కోసం U-లాక్ మరియు అవుట్‌డోర్ కవర్ వంటి యాక్ససరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

హోండా ADV 350 మాక్సీ స్కూటర్ ముందుగా యూరప్ మార్కెట్లో విడుదల కానుంది, ఆ తర్వాత ఇతర మార్కెట్లకు వెళ్లే అవకాశం ఉంది. దీని ఖరీదు దృష్ట్యా ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయితే, చూడటానికి అచ్చం ఇలానే ఉండే మాక్సీ స్కూటర్ కావాలనుకునే వారికి యమహా ఇటీవలే ఏరో 155 అనే మాక్సీ స్కూటర్ ను విడుదల చేసింది. పాపులర్ యమహా ఆర్15 మోడల్ ఆధారంగా చేసుకొని ఈ మాక్సీ స్కూటర్ ను తయారు చేశారు.

సరికొత్త Honda ADV 350 మాక్సీ స్కూటర్ ఆవిష్కరణ; ఇది భారతదేశంలో విడుదల అవుతుందా..?

ఇదిలా ఉంటే, హోండా టూ-వీలర్స్ ఇటీవలే అమెరికా మార్కెట్లో తమ నావీ మోపెడ్‌ను విడుదల చేసింది. స్కూటర్ మరియు మోపెడ్ కలయికతో రూపొందించిన హోండా నావీ భారత మార్కెట్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంకో కంపెనీ దేశీయ మార్కెట్లో హోండా నావీ అమ్మకాలను నిలిపివేసింది. కాగా, ఇప్పుడు ఇదే స్కూటర్ ను కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చేస్తోంది. తాజాగా యుఎస్‌లో విడుదలైన హోండా నావీ స్కూటర్ కూడా భారతదేశంలోనే తయారైంది.

Most Read Articles

English summary
Honda motorcycles unveils new adv 350 maxi scooter at eicma 2021 features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X