ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ కంపెనీలు మరింత స్వచ్ఛమైన వాహనాల తయారీవైపు ఆసక్తి చూపుతుండటంతో, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కోసం సరికొత్త సాంకేతికతలు కనిపిస్తాయని స్పష్టమవుతోంది. మరోవైపు,పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ జోరుగా ఉంటోంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

తాజాగా, జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మరియు త్రీ-వీలర్స్ కోసం మొబైల్ పవర్ ప్యాక్ అనే కొత్త పోర్టబుల్ మరియు స్వాప్ చేయగల బ్యాటరీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

ఇది ప్రాథమికంగా విద్యుత్ వనరుగా ఉపయోగించడానికి, విద్యుత్తును నిల్వ చేసే కెపాసిటర్‌గా పనిచేస్తుంది. హోండా ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ కోసం హోమ్ ఛార్జర్‌పై పనిచేస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ టాక్సీలు లేదా రిక్షాలపై హోండా ఈ స్వాపబుల్ బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

అయితే, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ ఇంకా ఎలాంటి స్థిరమైన ప్రణాళికలను వెల్లడించలేదు. హోండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను పరీక్షిస్తోందని సమాచారం.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

హోండా గతంలో 2024 నాటికి మూడు కొత్త మోడళ్లను విడుదల చేస్తామని, ద్విచక్ర వాహనాల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయడంపై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

ఈ మూడు మోడళ్లలో ఒకటి 50సిసి పెట్రోల్ ఇంజన్‌కు సమానమైన ఎలక్ట్రిక్ మోపెడ్ కూడా ఉంది. మిగిలిన రెండు మోడళ్లలో ఒక ఇ-స్కూటర్ మరియు ఒక ఇ-మోటార్‌సైకిల్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా 125సిసి ఇంజన్‌కు సమానమైన పనితీరును చూపొచ్చవని అంచనా.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ మోడళ్లు నిరాడంబరంగా అనిపించినప్పటికీ, అవి హోండాకు ముఖ్యంగా భారతదేశం వంటి బడ్జెట్-సెంట్రిక్ మాస్ మార్కెట్ కోసం మంచి ప్రారంభ స్థానాన్ని కలిగి ఉంటాయి. వాస్తవానికి, ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అర్బన్, యుటిలిటీ విభాగాల్లో వాహనాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

హోండా తీసుకురాబోయే ఈ ఎంట్రీ లెవల్ మోడళ్లలో అవుట్పుట్ గణాంకాలు భారీగా ఉండకపోవచ్చు కాబట్టి, వాటిలో భారీ బ్యాటరీ ప్యాక్‌లను ఎంచుకోవడానికి బదులుగా, హోండా తన పిసిఎక్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌లో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడిన స్వాప్ చేయగల మొబైల్ పవర్ ప్యాక్ లాంటి వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

దేశంలో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను వ్యవస్థాపించడం ద్వారా హోండా ఈ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించాలని భావిస్తోంది. అంతేకాకుండా, హోండా బ్యాటరీ ప్యాక్‌లను చార్జ్ చేయటం కోసం ఓ హోమ్ ఛార్జర్‌పై కూడా పనిచేస్తుందని ఇటీవలి పేటెంట్లు వెల్లడించాయి. మార్పిడి స్టేషన్లలో ఛార్జర్లు ఒకేసారి రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి.

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!

ఇదిలా ఉంటే, స్వాప్ చేయగల బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి కెటిఎమ్, పియాజియో మరియు యమహా వంటి సంస్థలతో హోండా ఓ గ్లోబల్ అసోసియేషన్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ పరిణామాలు భారతదేశం వంటి మార్కెట్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Honda Planning To Introduce Battery Swapping Tech For Electric Vehicles, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X