స్పాట్ టెస్ట్‌లో కనిపించిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్: Hop Oxo

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులలో ఒకటి Hop Electric మొబిలిటీ. Hop Electric త్వరలో దేశీయ మార్కెట్లో తన టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

Hop Electric దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు Oxo. ఈ ఎలక్ట్రిక్ బైక్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో టెస్ట్ చేయబడింది. టెస్టింగ్ సమయంలో ఈ కొత్త బైక్ యొక్క కొన్ని చిత్రాలు వెలువడ్డాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్: Hop Oxo

సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లు పెట్రోల్ బైక్‌ల వలె వెళ్ళలేవు అనే ఒక అనుమానం చాలామంది వాహన వినియోగాదారులలో ఉంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే పెట్రోల్ బైక్‌లు చాలా శక్తివంతమైనవని, ఎలక్ట్రిక్ బైక్‌ల రూపకల్పన చూపారులను అంతగా ఆకర్శించలేవు అనే అనుమానాలు అపోహలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల గురించి అపోహలు. వాహన వినియోగదారులకున్న అన్ని అనుమానాలను Hop కంపెనీ యొక్క Oxo ఎలక్ట్రిక్ బైక్ పోగొడుతుంది.

Hop కంపెనీ యొక్క Oxo ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్ సమయంలో గంటకు 80 కిలోమీటర్ల నుంచి 90 కిమీ వేగంతో ప్రయాణించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం అరగంటలో ఈ వేగాన్ని చేరుకోవడం గమనార్హం. అయితే ఈ బైక్ టెస్టింగ్ సమయంలో పూర్తిగా కప్పబడి ఉంది. అయితే ఇది ఖచ్చితంగా వాహనదారులను ఆకర్శించడంలో తప్పకుండా విజయం సాధిస్తుంది.

Oxo ఎలక్ట్రిక్ బైక్ శబ్దం చేయదు. అంతే కాకుండా ఇది ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల పర్యావరణాన్ని కలుషితం చేయదు. ఈ బైక్ యాక్సలరేషన్ స్పీడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బైక్ త్వరలో భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం.

భారత మార్కెట్లో రోజురోజుకి ఇంధన ధరలు ఎక్కువవుతున్న కారణంగా, ఎక్కువమంది ప్రజలు ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌళిక సదుపాయాలు అందుబాటులో లేదు.

ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ బైకులు చాలా మంచి డిజైన్ మరియు చాలా సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. దీనితో పాటు బైకులు ఇంధన ఖర్చులను తీర్చడానికి మెరుగైన మైలేజ్ మరియు వేగవంతమైన వేగాన్ని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బైక్‌లో అందుబాటులో ఉంటే, ప్రజలు ఖరీదైన పెట్రోల్ బైక్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేస్తారు.

వాహన వినియోగాదారులు కోరుకునే అన్ని ఫీచర్స్ మరియు పరికరాలు ఈ కొత్త Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల Hop కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువమంది వాహనప్రియులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువకులు, తక్కువ ధర కలిగిన మరియు వేగంగా కదిలే ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడతారు. ఎలక్ట్రిక్ వాహనాలను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ వాహనాలకు ప్రత్యామ్నాయం చేయవచ్చు.

Hop Electric కంపెనీ ప్రపంచ ద్విచక్ర వాహన విభాగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందటానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. Hop Electric కంపెనీ ప్రస్తుతం మూడు ఎలక్టిక్ వానలను కలియు ఉంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు, మరొకటి ఎలక్ట్రిక్ బైక్. కంపెనీ నివేదికల ప్రకారం రానున్న మరో మూడు సంవత్సరాలలో కనీసం 10 ఎలక్ట్రిక్ వాహనాలను
విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కావలసిన సదుపాయాలను సిద్ధం చేసుకుంటోంది. కావున త్వరలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రస్తుతం పెట్రోల్ బంకులు ఉన్న రీతిలో అందుబాటులోకి రానున్నాయి. కావున ఎలక్ట్రిక్ వాహన వినియోగం రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో రానున్న ఈ కొత్త Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ త్వరలో దేశీయ మార్కెట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో ప్రజాదరణ పొందుతుందా, ఆశించిన అమ్మకాలతో ముందుకు సాగుతుందా అనే విషయాలు విడుదలైన తరువాత తెలుస్తాయి.

దేశీయా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను కల్పిస్తున్నారు. ఈ రాయితీలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనువులు చేసేవారికి భారీ మొత్తంలో రాయితీలు ఉపయోగపడతాయి. కావున కొనుగోలుదారులు ఈ రాయితీలను ఉపయోగించుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం వల్ల వినియోగాదారులు కేవలం ఇంధన ధరల భారం తగ్గడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడవచ్చు. కావున కొనుగోలుదారులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Hop electric mobility starts testing of oxo electric bike details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X