Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. Kawasaki KX250 మరియు Kawasaki KX450 మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 7.99 లక్షలు మరియు రూ. 8.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

Kawasaki ఈ రెండు మోటార్‌సైకిళ్లు పూర్తిగా హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం నిర్మించించింది. ఒకరకంగా చెప్పాలంటే, వీటిని డర్ట్ బైక్‌లుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ మీరు గమనించాల విషయం ఏమిటంటే, ఈ బైక్‌లను సాధారణ రోడ్లపై ఉపయోగించడానికి వీలు లేదు. ఇవి స్ట్రీల్ లీగల్ బైక్స్ కావు.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

కొత్త Kawasaki KX250 మరియు Kawasaki KX450 ఆఫ్-రోడ్ బైక్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత కవాసకి డీలర్‌షిప్ లలో బుకింగ్‌ లు ప్రారంభమయ్యాయి. త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

డిజైన్ విషయానికి వస్తే, Kawasaki KX250 మరియు Kawasaki KX450 చూడటానికి రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా భాగాలు, పరికరాలు మాత్రం అలాగే ఉంచబడ్డాయి. ఈ డర్ట్ బైక్‌లను సవరించిన తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించారు.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

ఈ తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌ ఈ మోటార్‌సైకిళ్ల డైనమిక్స్‌ ను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. వీటి రూపకల్పనలో ఎలాంటి టింకరింగ్ లేదు. అయితే, ఈ రెండు బైక్‌ లపై ఎర్గోనామిక్స్ మాత్రం మెరుగుపరచబడ్డాయి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

వీటిలో రీడిజైన్ చేసిన ఫ్యూయెల్ ట్యాంక్, ఒక ఫ్లాటర్ ట్యాంక్ సీట్ మరియు సన్నని కవచం ఉన్నాయి. Kawasaki ఈ డర్ట్ బైక్‌లను ERGO FIT అడ్జస్టబల్ హ్యాండిల్‌బార్‌ తో పరిచయం చేసింది మరియు వాటి ఫుట్‌పెగ్‌ లను కూడా కొత్త వాటితో రీప్లేస్ చేశారు.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

వైబ్రేషన్‌ను తగ్గించడానికి రెండు బైక్‌ల హ్యాండిల్‌బార్‌ లకు రెంటల్ అల్యూమినియం ఫ్యాట్‌బార్‌ ను అమర్చారు. ఈ మోటార్‌సైకిళ్ల నిర్వహణ కూడా మెరుగుపరచబడింది, ఇందుకు ప్రధాన కారణం దీనిలోని రేస్-రెడీ సస్పెన్షన్ సెటప్. ఇందులో ముందువైపు 49 మిమీ విలోమ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో కొత్త యూనిట్ ట్రాక్ యూనిట్ ఉన్నాయి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

ఈ ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిళ్లు చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులో KX250 బరువు 107 కేజీలు కాగా, KX450 బరువు 110 కేజీలుగా మాత్రమే ఉంటుంది. ఈ రెండు బైకుల ఇంజన్‌ల విషయానికి వస్తే, Kawasaki KX250 ఫ్యాక్టరీ-రేసర్ ట్యూనింగ్‌ తో కూడిన 249 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

అలాగే, Kawasaki KX450 ఇంజన్ కూడా రేస్-ట్యూన్డ్ 449 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో లభిస్తుంది. అయితే, ఈ రెండు ఇంజన్లనకు సంబంధించిన ఖచ్చితమైన పవర్, టార్క్ గణాంకాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ రెండు బైక్‌లు 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. Kawasaki తమ మోటోక్రోసర్ శ్రేణిలో హైడ్రాలిక్ క్లచ్‌ను అందించడం ఇదే మొదటిసారి కావటం విశేషం.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

Kawasaki నుండి క్యూ కడుతున్న కొత్త మోడళ్లు..

భారత మార్కెట్లో Kawasaki ఇటీవలి కాలంలో తమ లేటెస్ట్ వాహనాలను విడుదల చేస్తూ వస్తోంది. కంపెనీ ఇటీవలే తమ కొత్త 2022 Kawasaki Ninja 650, 2022 Kawasaki Z650 మరియు సరికొత్త 2022 Kawasaki Vulcan S క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

2022 Kawasaki Ninja 650 డీటేల్స్..

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 Kawasaki Ninja 650 బైక్ ధర రూ. 6.61 లక్షలు (ఎక్స్-షోరూమ్-ఇండియా) గా ఉంది. ఈ కొత్త కవాసకి నింజా 650 బైక్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. డెలివరీలు మాత్రం సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

2022 Kawasaki Z650 డీటేల్స్..

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2022 Kawasaki Z650 బైక్ ధర రూ. 6.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మిడిల్ వెయిట్ విభాగంలో వచ్చిన ఈ స్ట్రీట్ నేక్డ్ మోటార్‌సైకిల్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. అంతే కాకుండా ఇది 'కాండీ లైమ్ గ్రీన్ టైప్ 3' అనే కొత్త సింగిల్ కలర్‌లో కూడా లభిస్తుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Kawasaki అడ్వెంచర్ ఆఫ్-రోడ్ బైక్స్ KX250 మరియు KX450 విడుదల

2022 Kawasaki Vulcan S డీటేల్స్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Kawasaki Vulcan S క్రూయిజ్ మోటార్‌సైకిల్ ధర రూ. 6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఏవీ లేవు. కంపెనీ దీనిని ఇప్పుడు కొత్త మెటాలిక్ మ్యాట్ గ్రే పెయింట్ ఆప్షన్‌తో అందిస్తోంది. ఈ కొత్త మోడల్‌లో ఇంధన ట్యాంక్, రేడియేటర్ సైడ్ కవర్ మరియు వీల్ రిమ్‌ల గుండా నడుస్తున్న ఆకుపచ్చ పిన్‌స్ట్రిప్ ఈ బైక్ మొత్తం ఆకర్షణను పెంచుతుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kawasaki kx250 and kawasaki kx450 off road bikes launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X