దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీదారు కవాసకి మోటార్స్ ఇండియా తన 2022 కవాసకి జెడ్650 బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కవాసకి జెడ్650 బైక్ ధర రూ. 6.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). మిడిల్ వెయిట్ స్ట్రీట్ న్యాక్డ్ మోటార్‌సైకిల్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది 'కాండీ లైమ్ గ్రీన్ టైప్ 3' అనే కొత్త సింగిల్ కలర్‌లో లభిస్తుంది.

ఈ కొత్త బైక్ త్వరలో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కంపెనీ అందించిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ కొత్త కవాసకి జెడ్650 మోటార్ సైకిల్ డెలివరీలు 2021 సెప్టెంబర్ నెల నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బైక్ లో కొత్త కలర్ స్కీమ్ మరియు కొత్త ధర కాకుండా, కంపెనీ ఇందులోని ఫీచర్లను ఏ మాత్రం మార్చలేదు. ఇందులోని ఫీచర్స్ దాదాపు మునుపటిలాగానే ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కవాసకి ఇండియా దేశీయ మార్కెట్లో ఇటీవల తన కొత్త 2022 నింజా 650 బైక్ ని కూడా లాంచ్ చేసింది.దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 బైక్ ధర రూ. 6.61 లక్షలు(ఎక్స్-షోరూమ్-ఇండియా). కొత్త కవాసకి నింజా 650 బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కవాసకి యొక్క 2022 నింజా 650 బైక్ యొక్క ఫీచర్స్ మరియు పరికరాలతో పాటు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కవాసకి యొక్క జెడ్650 బైక్ విషయానికి వస్తే, ఇందులో మునుపటి మోడల్ లోని 649 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పి శక్తిని మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో కంపెనీ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త కవాసకి జెడ్650 బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు ఇవ్వబడ్డాయి. అదేవిధముగా ఈ బైక్ వెనుక భాగంలో 130 మిమీ మోనోషాక్‌ సెటప్ పొందుతుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ చేస్తుంది. ఇది మొత్తానికి చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కవాసకి జెడ్650 బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది 300 మిమీ ట్విన్ పెటల్ డిస్క్‌ను డ్యూయల్-పిస్టన్ కాలిపర్‌తో మరియు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో వెనుకవైపు సింగిల్ 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్‌ని కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త 2022 కవాసకి జెడ్650 లో కనిపించే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్‌లో 4.3 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు కవాసకి యొక్క 'రైడియాలజీ' యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ దీని మునుపటి మోడల్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త 2022 కవాసకి జెడ్650 బైక్ 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

2022 కవాసకి జెడ్650 బైక్ మంచి డిజైన్ కలిగి చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కవాసకి ఈ మోటార్‌సైకిల్ డిజైన్‌ని చాలా షార్ప్ గా ఉండే విధంగా చేసింది. కవాసాకి యొక్క సుగోమి డిజైన్ ఐడియాలజీని ఉపయోగించింది, ఇది దాని స్వంత ప్రకాశాన్ని కలిగి ఉందని మరియు సానుకూల వైబ్‌లను ఇస్తుందని నమ్ముతారు.

దేశీయ మార్కెట్లో విడుదలైన కవాసకి జెడ్650; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త 2022 కవాసకి జెడ్650 బైక్ ఇండియన్ మార్కెట్లో ట్రయంఫ్ ట్రైడెంట్ 660 మరియు హోండా సిబి650ఆర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. కస్టమర్లు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే కవాసకి ఇండియా కంపెనీ ఇటీవల తన భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోటార్‌సైకిళ్ల ధరను పెంచినట్లు అధికారికంగా తెలిపింది.

కవాసకి ఇప్పుడు ఈ కొత్త ధరల జాబితాలో దాదాపు మొత్తం 9 బైక్‌లను చేర్చింది. ఈ ధరల పెరుగుదలలో అతి తక్కువ పెరుగుదల రూ. 6,000 కాగా, గరిష్ట పెరుగుదల 15,000 రూపాయల వరకు ఉంటుంది.కవాసకి యొక్క ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
2022 kawasaki z650 launched with new color option at rs 6 24 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X