పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ గత మార్చి నెలలో టీజ్ చేసిన సరికొత్త కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ హై పెర్ఫార్మెన్స్ బైక్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు, ఇతర వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

నేటి నుండి కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో శక్తివంతమైన 1,301 సిసి ఎల్‌సి8 75-యాంగిల్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా ఈ 182 పిఎస్ పవర్‌ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. మెరుగైన థ్రోటల్ పనితీరు కోసం కెటిఎమ్ ఈ సూపర్ డ్యూక్ బైక్‌కు కొత్త క్విక్ షిఫ్టర్‌ను జోడించింది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఈ సూపర్ బైక్ మొత్తం బరువు 180 కిలోలు. ఈ బైక్ బరువును మరియు దాని ఇంజన్ విడుదల చేసే శక్తిని పోల్చి చూస్తే, ఇది 1: 1 పవర్ టూ వెయిట్ రేషియోని కలిగి ఉంటుంది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఇది 65-డిగ్రీల ఓపెనింగ్ యాంగిల్‌ను (కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ బైక్ కంటే 7-డిగ్రీలు తక్కువ) కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క చాలా భాగాల తయారీలో కార్బన్ ఫైబర్ వాడటం వల్ల బైక్ మొత్తం బరువును తక్కువగా ఉంచగలిగారు.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఈ కార్బన్ ఫైబర్ భాగాలలో ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్, కార్బన్ బేస్ ట్రే, రియర్ కౌల్ మరియు ఫ్రంట్ బ్రేక్ కూలర్‌తో కొత్త ఫ్రంట్ ఫ్రేమ్ కూడా ఉంటుంది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

అదే విధంగా టైటానియం మరియు కార్బన్ ఫైబర్ కవర్‌తో ఫినిష్ చేసిన అక్రోబాటిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా బైక్ బరువును తగ్గించటానికి సహాయపడింది. తేలికపాటి లిథియం-ఐయాన్ బ్యాటరీ వలన బైక్ బరువు సుమారు 2.5 కిలోలు తగ్గుతుంది.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

రీడిజైన్ చేసిన సబ్‌ఫ్రేమ్ కూడా వెహికల్ వెయిట్‌ను బ్యాలెన్స్ చేయటంలో సహకరించింది. ఈ కెటిఎమ్ డ్యూక్‌లో రెయిన్, స్ట్రీట్, పెర్ఫార్మెన్స్ మరియు ట్రాక్ అనే ఐదు వేర్వేరు రైడింగ్ మోడ్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు. రైడర్ తన అవసరాన్ని బట్టి ఈ రైడింగ్ మోడ్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఇంకా ఇందులో స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, మోటారు స్లిప్ రెగ్యులేషన్, సూపర్‌మోటో ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో కీలెస్ స్టార్ట్ ఆప్షన్ గురించి కెటిఎమ్ ఎక్కడా ప్రస్తావించలేదు.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

ఈ బైక్ లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. కెటిఎమ్ మై రైడ్ అప్లికేషన్ సాయంతో రైడర్లు ఈ బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లో 5-ఇంచ్ యాంగిల్-అడ్జస్టబల్ టిఎఫ్‌టి స్క్రీన్ ఉంటుంది. దీని సాయంతో కాల్స్, మెసేజెస్‌ను రిసీవ్ చేసుకోవటమే కాకుండా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా కంట్రోల్ చేయవచ్చు.

పవర్‌ఫుల్ కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ ఆవిష్కరణ - వివరాలు

అమెరికన్ మార్కెట్లో కొత్త 2021 కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ఆర్ బైక్ ధర 21,499 డాలర్లుగా ఉంది. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా. కేటిఎమ్ భారతీయ మార్కెట్లో 1000 సీసీ బైక్‌లను పరిచయం చేయనందున, ఈ బైక్ ఇప్పట్లో భారత తీరాలకు చేరుకునే అవకాశం కనిపించడం లేదు.

Most Read Articles

English summary
KTM 1290 Super Duke RR Officially Unveiled, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X