కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్కూటర్ ప్లెజర్ ప్లస్ (Pleasure+) కంపెనీ ఓ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ కొత్త 2021 Hero Pleasure+ XTec (హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్) మోడల్‌ను సోమవారం (అక్టోబర్ 11, 2021న) మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2021 హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్-టెక్ స్కూటర్‌ను కంపెనీ LX మరియు XTec అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 61,900 మరియు రూ. 69,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి. ఇదివరకటి ప్లెజర్ ప్లస్ స్కూటర్ తో పోలిస్తే, ఈ కొత్త 2021 మోడల్ ప్లెజర్+ ఎక్స్-టెక్ స్కూటర్ ను కంపెనీ కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

Hero Pleasure+ XTec - కొత్త ఫీచర్లు

కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్కూటర్ లో కంపెనీ జోడించిన కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 110 సిసి స్కూటర్ విభాగంలోనే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందిన మొదటి స్కూటర్. అంతేకాకుండా, ఈ కొత్త స్కూటర్ ను కంపెనీ ఇప్పుడు ప్రకాశవంతమైన జూబిలెంట్ ఎల్లో కలర్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ లో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

ఈ స్కూటర్‌ లో చేసిన అతిపెద్ద మార్పు ఏంటంటే, కొత్త ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్కూటర్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ తో అందుబాటులోకి రాబోతోంది. దీని సాయంతో రైడర్ తన స్మార్ట్‌ఫోన్ ను స్కూటర్ తో అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం డ్యాష్‌బోర్డ్ పై ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లో ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ఇవ్వబడింది, దీనిలో ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్ మరియు ఫోన్ బ్యాటరీ స్థితి వంటి సమాచారం తెలియజేయబడుతుంది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

ఇంకా ఇందులో i3S స్టార్ట్ / స్టాప్ సిస్టమ్, సెమీ డిజిటల్ స్పీడోమీటర్ మరియు సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా, ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్లపై క్రోమ్ గార్నిష్ కూడా ఉంటుంది. ఇది ప్రీమియం అప్పీల్‌ని ఇస్తుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే కొత్త హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

Hero Pleasure+ XTec - ఇంజన్

కొత్త హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ స్కూటర్ లో కేవలం కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 110 సిసి బిఎస్ 6 ఇంజన్‌ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ మైలేజీని మెరుగుపరచడానికి కంపెనీ ఇందులో తమ సిగ్నేచర్ మరియు సర్టిఫైడ్ i3S టెక్నాలజీని ఉపయోగించింది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

ప్లెజర్ ప్లస్ ఎక్స్-టెక్ లాంచ్ తో పెరగనున్న అమ్మకాలు..

ప్రస్తుతం, హీరో మోటోకార్ప్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హీరో ప్లెజర్ ప్లస్ మొదటి స్థానంలో ఉంటుంది. దీని సరసమైన ధర, తక్కువ బరువు మరియు ఎక్కువ మైలేజ్ వంటి అంశాల కారణంగా, కస్టమర్లు ఎక్కువగా ఈ మోడల్ ను ఆదరిస్తున్నారు. కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త 2021 హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ తో ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

సెప్టెంబర్ నెలలో హీరో మోటోకార్ప్ సేల్స్ ట్రెండ్..

హీరో మోటోకార్ప్ గడచిన సెప్టెంబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 5,30,000 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. వీటిలో 5,00,050 యూనిట్లను దేశీయ మార్కెట్‌లో విక్రయించగా, 25,000 బైకులు మరియు స్కూటర్లను కంపెనీ పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

సెప్టెంబర్ 2021 నెల మొత్తం అమ్మకాలలో హీరో మోటోకార్ప్ 4,89,417 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, స్కూటర్ల అమ్మకాలు 40,929 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 2020 నెలతో పోలిస్తే, ఆ సమయంలో కంపెనీ మొత్తం 7,15,718 యూనిట్ల బైకులు మరియు స్కూటర్లను విక్రయించగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల అమ్మకాలు 1,85,372 యూనిట్ల తగ్గాయి. మొత్తంగా చూస్తే, ఇవి 25.90 శాతం క్షీణతను నమోదు చేశాయి.

కొత్త 2021 Hero Pleasure Plus XTec విడుదల: ధర, ఫీచర్లు

అయితే, ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం మెరుగైన పనితీరును కనబరచాయి. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో కంపెనీ ఎగుమతులు 35.06 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముడిసరుకులు మరియు ఉక్కు ధరల పెరుగుదల కారణంగా హీరో మోటోకార్ప్ గత వారం తమ టూవీలర్ల శ్రేణిలో దాదాపు అన్ని మోడళ్ల ధరలను సవరించింది. దీంతో, ఎంపిక చేసిన హీరో బైకులు మరియు స్కూటర్లు ధరలు ఇప్పుడు సుమారు రూ. 3,000 వరకు పెరిగాయి.

Most Read Articles

English summary
New 2021 hero pleasure plus xtec launched price specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X