రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అందిస్తున్న క్లాసిక్ 350 (Classic 350) లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్ ను రేపు (సెప్టెంబర్ 1, 2021వ తేదీన) మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుత వెర్షన్ తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేయనుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

Royal Enfield నుండి గతేడాది మార్కెట్లోకి వచ్చిన Meteor 350 మోటార్‌సైకిల్ ను తయారు చేసిన సరికొత్త J ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కొత్త 2021 Classic 350 మోటార్‌సైకిల్ ను కూడా తయారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అనేక పోలికలు ఉండే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

సరికొత్త డిజైన్, లేటెస్ట్ టెక్ ఫీచర్లు మరియు కొత్త పరికరాలతో ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉండనుంది. ఇప్పటికే కొత్త 2021 Royal Enfield Classic 350 మోటార్‌సైకిళ్లను కంపెనీ డీలర్‌షిప్‌లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 1న ఈ మోటార్‌సైకిల్ ను లాంచ్ చేయడంతో పాటుగా కంపెనీ దాని బుకింగ్ లను మరియు డెలివరీలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

భారత ఎంట్రీ లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్లో Royal Enfield Classic 350 ఎల్లప్పుడూ అత్యధికంగా అమ్ముడయే మోడల్ గా ఉంది. ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లతో రానున్న ఈ బైక్, మునుపటి కన్నా ఎక్కువ సేల్స్ సాధిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. కంపెనీ ఈ బైక్ ను మంచి ఆకర్షణీయమైన రంగులలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

మార్కెట్లో కొత్త 2021 Royal Enfield Classic 350 ప్రారంభ ధర సుమారు రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. గత కొంత కాలంగా కంపెనీ ఈ కొత్త మోడల్ ను భారత రోడ్లపై నిరంతరం పరీక్షిస్తూ వచ్చింది. ఈ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఇది కూడా ఒకటి.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

కంపెనీ ఇటీవల విడుదల చేసిన టీజర్ వీడియోలో, ఈ బైక్ ముందు భాగాన్ని చూపించింది. ఇందులో గుండ్రటి హెడ్‌లైట్ మరియు దానికి ఇరు వైపులా ఉన్న గుండ్రటి టర్న్ ఇండికేటర్ లైట్లతో దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కాకపోతే, కంపెనీ ఇందులో కొన్ని మోడ్రన్ టచ్ లను ఇచ్చే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

కొత్త 2021 Classic 350 బైక్ లో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్ ను అందించవచ్చని సమాచారం. Royal Enfield ఈ తరహా కనెక్టింగ్ ఫీచర్ ను తొలిసారిగా తమ Meteor 350 మోడల్ లో పరిచయం చేసింది. ఆ తర్వాత తమ ప్రోడక్ట్ లైనప్ లోని ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్ ను విస్తరించింది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

అంతేకాకుండా, ఎప్పటి మాదిరిగానే ఇందులోని ఎగ్జాస్ట్ పైప్ (సైలెన్సర్) ను కూడా క్రోమ్ ఫినిషింగ్ తో ఆఫర్ చేయనున్నారు. దీని రియర్ వ్యూ మిర్రర్స్ కూడా గుండ్రంగా ఉంటాయి మరియు ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ కూడా మునుపటిలా ఉంచబడుతుంది. అయితే, దానిపై మునుపటి కన్నా ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ ఉండే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

ఇంజన్ పరంగా కూడా ఇందులో భారీ మార్పు ఉండనుంది. Meteor 350 మోడల్ లో ఉపయోగించిన అదే ఇంజన్ ను ఈ కొత్త 2021 Classic 350 మోడల్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో కొత్తగా 349 సిసి సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ఇంజక్షన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 27 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఇరువైపులా డిస్క్ బ్రేక్ లను ఉపయోగించనున్నారు మరియు ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేయనుంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

కొత్త 2021 Classic 350 స్పోక్ మరియు అల్లాయ్ వీల్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుందని సమాచారం. కస్టమర్ తన అవసరానికి మరియు ప్రాధాన్యతకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. సాధారణంగా, కొంచెం ఆఫ్-రోడింగ్ చేసే కస్టమర్లు స్పోక్ వీల్స్ ని ఎంచుకుంటుంటారు.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

ప్రస్తుతం మార్కెట్లో Royal Enfield Classic 350 ప్రారంభ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. కాకపోతే, ఈ కొత్త 2021 మోడల్ చేయబోయే మార్పుల కారణంగా దీని ధర సుమారు రూ. 6,000 నుంచి రూ. 9000 వరకు పెరగే అవకాశం ఉంది. పెరుగుతున్న ముడిసరుకు ధరల ప్రభావం వలన కంపెనీ ఈ బైక్ ధరలను కూడా పెంచే అవకాశం ఉంది.

రేపే కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ లాంచ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

Royal Enfield బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో Classic 350 అగ్రస్థానంలో ఉంది. గడచిన జూలై 2021 నెలలో కూడా Classic 350 అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. గత నెలలో ఇవి 16,890 యూనిట్లుగా నమోదు కాగా, జూన్ 2021 లో 17,377 యూనిట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త వచ్చే అప్‌డేట్ మోడల్ తర్వాత Classic 350 అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా.

Most Read Articles

English summary
New 2021 royal enfield classic 350 is all set for launch tomorrow details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X