బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్; పూర్తి వివరాలు

ప్రముఖ జర్మన్ బైక్ తయారీదారు బ్లాక్ టీ కంపెనీ ఇటీవల తన కొత్త మోడల్ అయిన 'బోన్‌ఫైర్‌'(Bonefire) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆవిష్కరించింది. బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ యొక్క మొదటి మోడల్. కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది కొన్ని సందర్భాలలో ఆఫ్-రోడర్ గా ఉపయోగపడుతుంది.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

కొత్త బ్లాక్ టీ బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 75 కిమీ. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎకో మోడ్‌లో 75 కి.మీ వరకు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ డిజైన్‌తో వస్తుంది. అంతే కాకుండా ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రతి రైడింగ్ మోడ్ విభిన్న రేంజ్ కలిగి ఉంటుంది.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ బైక్ ఒక స్క్రాంబ్లర్ స్టైల్. ఈ బైక్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభమయ్యిందని కంపెనీ సిఇఒ 'విక్టర్ సోమర్' అన్నారు. అంతే కాకూండా ఈ బైక్ ఉత్పత్తి మ్యూనిచ్‌లో ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

కొత్త బోన్‌ఫైర్‌ బైక్ 5.4 కిలో వాట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 7.2 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ స్పోర్ట్ మోడ్‌లో 55 కిమీ రేంజ్ కలిగి ఉంది. అయితే ఎకో మోడ్‌లో 75 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది.ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

బ్లాక్ టీ మోడల్స్ యొక్క అన్ని బైకులు ఒకే బ్యాటరీతో పనిచేసేలా ఉంటాయి. బోన్‌ఫైర్‌లో 18 ఇంచెస్ అల్యూమినియం రిమ్స్ ఉన్నాయి. బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 31 మిమీ ఫోర్కులు మరియు వెనుకవైపు 200 మిమీ ట్రావెల్ మరియు ట్విన్ షాక్ ఉన్నాయి.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

బ్లాక్ టీ సీఈఓ 'విక్టర్ సోమర్' ఈ కంపెనీని 2020 లో స్థాపించాడు. అయితే వింటేజ్ ఇన్స్పైర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించాడు. అయితే ఇది చివరకు ఈ కొత్త బోన్‌ఫైర్‌ బైక్ గా సృష్టించబడింది. కొన్ని నివేదికల ప్రకారం బోన్‌ఫైర్‌ బైక్ యూరప్ మరియు యుఎస్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది.

బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ ఆవిష్కరించిన జర్మన్ బ్రాండ్

కొత్త బ్లాక్ టీ బోన్‌ఫైర్‌ ఎలక్ట్రిక్ బైక్ భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదు. అయితే ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్లలో కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి. బోన్‌ఫైర్‌ ధర 3,999 యూరోలు (అంటే భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 3.5 లక్షలు).

Most Read Articles

English summary
German Brand Unveils Black Tea Bonfire Electric Motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X