కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

ప్రముఖ వాహనతయారీదారు యమహా ఈ రోజు భారత మార్కెట్లో తన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ యొక్క ప్రారంభ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్‌షోరూమ్).

ఇదిలా ఉండగా యమహా కంపెనీ ఈ బైక్ తో పాటు మరో రెండు మోడళ్లను కూడా ఆవిష్కరించింది. అవి యమహా ఫాసినో మరియు యమహా రే-జెడ్ఆర్ స్కూటర్స్. ఈ స్కూటర్లు చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ కొత్త స్కూటర్‌లను త్వరలో షోరూమ్‌లలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

త్వరలో రానున్న ఈ యమహా స్కూటర్స్ అప్‌డేటెడ్ డిజైన్, ఫీచర్స్ మరియు కొత్త పెయింట్ స్కీమ్‌తో పరిచయం చేసింది. ఈ స్కూటర్లో కంపెనీ కొత్త స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్ అందించింది. అంతే కాకూండా ఈ హెడ్‌లైట్ లోపల ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఇవ్వబడింది. టెయిల్ లైట్ డిజైన్ మరింత సొగసైనదిగా నవీకరించబడింది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

స్కూటర్ యొక్క రెండు వైపులా సైడ్ ప్యానెల్స్‌పై 3 డి ఫాసినో లోగో ఇవ్వబడింది. కొత్త ఫాసినో ఇప్పుడు మొత్తం 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్కూటర్ యొక్క బలాన్ని మెరుగుపరుస్తూ, సంస్థ ఫాసినో మెటల్ యొక్క ఫ్రంట్ ఆప్రాన్ మరియు మడ్‌గార్డ్‌ను తయారు చేసింది. ఇది కాకుండా, ఇప్పుడు 110 మిమీ విస్తృత వెనుక టైర్‌ను పొందుతుంది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

ఇందులో ఉన్న కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు స్కూటర్లలోనూ కొత్త ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో 'యమహా కనెక్ట్' కనెక్టివిటీ ఫీచర్‌ను కంపెనీ ఇచ్చింది. ఈ ఫీచర్స్ ద్వారా స్కూటర్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. రెండు స్కూటర్లలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్ ఇవ్వబడింది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

కంపెనీ ఈ స్కూటర్ల ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేయబడ్డాయి. బ్యాటరీతో నడిచే ఈ రెండు స్కూటర్లలో కంపెనీ బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇచ్చింది. అవసరమైనప్పుడు ఈ ఇంజన్ స్కూటర్‌కు ఎక్కువ శక్తిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హైబ్రిడ్ ఇంజిన్ కఠినమైన భూభాగాల్లో లేదా ఎక్కేటప్పుడు బ్యాటరీ సహాయంతో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

యమహా ఫాసినో మరియు రే-జెడ్ఆర్ 125 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ద్వారా 8.2 బిహెచ్‌పి పవర్ మరియు 9.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్కూటర్లలో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉపయోగించబడింది. కావున ఇప్పుడు స్కూటర్ ఎటువంటి శబ్దం రాకుండానే ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు చాలా కొత్త బైక్‌లు మరియు స్కూటర్లలో ఇవ్వబడుతోంది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

ఈ స్కూటర్లలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త యమహా ఫాసినోలో 21 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉటుంది. పెద్ద సైజు హెల్మెట్ ఈ స్టోరేజ్ స్పేస్ లో ఉంచవచ్చు. అండర్ సీట్లో యుఎస్‌బి ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పించబడింది.

కొత్త ఫాసినో & రే-జెడ్ఆర్ స్కూటర్లను ఆవిష్కరించిన యమహా; పూర్తి వివరాలు

ఇప్పుడు కంపెనీ ఈ రెండు స్కూటర్ల ధరను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ కొత్త స్కూటర్లు కొన్ని వారాల్లో యమహా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచబడతాయి. ఆ సమయంలో ధరలు నిర్ణయించబడతాయి. భారతదేశంలో, ఈ రెండు స్కూటర్లు సుజుకి యాక్సెస్ 125, టివిఎస్ ఎన్ టార్క్ 125 మరియు హోండా యాక్టివా 125 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Unveils New Fasino & Ray-ZR Scooters. Read in Telugu.
Story first published: Friday, June 18, 2021, 19:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X