త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఓలా, తమ మొట్టమొదటి స్కూటర్‌తో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందుకోసం ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని హోసూర్ వద్ద ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.చేశారు.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

తాజా సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ యొక్క మొదటి దశ (ఫేజ్-1) అతి త్వరలోనే పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సిఈఓ భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా, ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ప్రస్థుత స్థితిని తెలియజేసే ఓ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కొండలు, గుట్టలతో నిండిపోయిన వందల ఎకరాల భూమిని ఇలా పూర్తిగా అధునాతంగా మార్చేశామని, ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద టూవీలర్ ప్లాంట్ అవుతుందని, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఫేజ్ 1 దాదాపుగా పూర్తి కావస్తోందని భవీష్ వెల్లడించారు. అంతేకాదు, త్వరలోనే స్కూటర్లు కూడా రాబోతున్నాయని ఆయన తెలిపారు.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

ఇదివరకటి ట్వీట్‌లో భవీష్ అగర్వాల్ తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కలర్ ఆప్షన్లను సూచించాల్సిందిగా నెటిజెన్లను కోరారు. తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పెయింట్ ఆర్డర్ చేస్తున్నామని, ప్రజలు తమ నచ్చిన రంగులను సూచించాలని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. ఇప్పటికే బ్లాక్ కలర్‌లో ఓలా స్కూటర్‌ను తీసుకువస్తున్నామని, కొత్తగా ఇందులో ఏం కలర్ ఆప్షన్‌ను చూడాలని అనుకుంటున్నారని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని హోసూర్ ప్రాంతం వద్ద ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను దశల వారీగా నిర్మిస్తోంది. ఇందులో మొదటి దశ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. గడచిన జనవరి నెలలో ఓలా సంస్థ తమిళనాడు ప్రభుత్వం నుండి హోసూర్‌లో 500 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుండి కంపెనీ తమ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించింది.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

తమిళనాడు ప్రభుత్వం నుండి రూ.2400 కోట్లు వెచ్చించి ఓలా ఎలక్ట్రిక్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓలా ఈ కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తోంది. సుమారు 10 మిలియన్ల గంటలకు పైగా శ్రామిక శక్తిని ఉపయోగించి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అతి తక్కువ సమయంలో ఉత్పత్తిని ప్రారంభించాలని ఓలా భావిస్తోంది.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

అంతేకాకుండా, ఈ ప్లాంట్ నిర్మాణ సమయంలో ఆ స్థలంలో భూమిని చదును చేసేటప్పుడు అడ్డు వచ్చిన ప్రతి చెట్టును కూడా తిరిగి వేరే స్థలంలోకి సురక్షితంగా మార్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రకృతి చుట్టూ నిర్మితమవుతున్న ఈ ప్లాంట్, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెద్ద పీఠ వేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాంట్ ఏటా 20 లక్షల యూనిట్ల స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

గ్రీన్ కారిడార్ చుట్టూ నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, అక్కడ ఏర్పాటు చేయబోయే 10 ప్రొడక్షన్ లైన్స్ నుండి ప్రతి 2 సెకన్లకు 1 స్కూటర్ చొప్పున ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచం మొత్తంలో ఉత్పత్తయ్యే మొత్తం ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోల్చుకుంటే, సుమారు 15 శాతం వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ యొక్క తయారీ విభాగంలో, మానవశక్తి మాత్రమే కాకుండా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉన్న యంత్రాలను కూడా ఉపయోగించనుంది. ఈ ప్లాంట్‌లో సుమారు 5,000 రోబోట్లను ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఓలా తెలిపింది.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, నెథర్లాండ్స్‌కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా గతంలో కొనుగోలు చేసింది. ఎటెర్గో అందిస్తున్న 'యాప్‌స్కూటర్' ఆధారంగానే ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా తయారు చేస్తున్నారు. కాకపోతే, భారతీయ రోడ్ మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.

త్వరలోనే పూర్తి కానున్న ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ ఫేజ్-1; స్కూటర్స్ వస్తున్నాయ్..!

లాంగ్ రేంజ్ వేరియంట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా పూర్తి చార్జ్‌పై 240 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ స్కూటర్‌లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది మరియు దీనిని కేవలం 2.3 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్‌లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి మరియు ప్రతి మాడ్యూల్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Ola's Hosur Electric Two-wheeler Plant Phase-1 Construction To Be Completed Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X