BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS.. దీనివల్ల ఉపయోగాలు ఏంటి?

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన సంఖ్యలో మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేదు, కావున ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వాలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

ఇదిలా ఉండగా, REVOS సంస్థ భారతదేశంలో BOLT IoT అనే ఛార్జింగ్ పాయింట్‌లను పరిచయం చేసింది. ఇది USV-మద్దతుగల భారతీయ స్టార్టప్ కంపెనీ. అయితే BOLT దేశం యొక్క మొదటి మరియు అతిపెద్ద పీర్-టు-పీర్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్. అంతే కాకుండా BOLT భారతదేశపు అత్యంత సులభమైన మరియు అత్యంత సరసమైన EV ఛార్జింగ్ పాయింట్.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రైడర్‌లను కనెక్ట్ చేసే IoT-ప్రారంభించబడిన EV ఛార్జింగ్ పాయింట్‌ దేశం యొక్క మొట్టమొదటి అంకితమైన నెట్‌వర్క్ BOLT అని కూడా REVOS పేర్కొంది. REVOS వెబ్‌సైట్‌లో BOLT ను రూ. 3,000 కు విక్రయిస్తున్నారు. కానీ పరిచయ ఆఫర్ అక్టోబర్ 29 నుండి ఈ సంవత్సరం 2021 చివరి వరకు BOLT ఛార్జింగ్ సౌకర్యాన్ని కేవలం 1 రూపాయలకే అందించాలని కంపెనీ నిర్ణయించింది.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

ఈ సందర్భంగా REVOS కోఫౌండర్ మోహిత్ యాదవ్ మాట్లాడుతూ, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం చాలా పెరిగిపోతోంది, కావున రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా మార్చడానికి మరియు రాబోయే తరాలకు చక్కని పర్యావరణాన్ని అందించడానికి ప్రస్తుతం ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారటం చాలా అవసరం, అన్నారు.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఛార్జ్ చేయడం ప్రస్తుత కాలంలో నిజంగా సవాలు లాంటిది, దీనితో పాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు విస్తృతంగా వినియోగంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. PCO బాక్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

BOLT EV పరిశ్రమ కోసం కూడా ఇలాంటిదే చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకు ముందు ఎక్కువగా ఇనియోగంలో ఉన్న ఫోన్ బాక్స్ వలే ప్రతి సందు మరియు మూలలో ఈ ఛార్జింగ్ సదుపాయాలను తీసుకురావడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాము.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

అంతే కాకుండా రాబోయే కాలంలో BOLT EVలను స్మార్ట్ మరియు సురక్షితమైనవిగా చేయడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాము. దీనితో పాటు ఎవరైనా BOLT ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొనుగోలు చేయవచ్చు, లేదా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఛార్జింగ్ పాయింట్ల నుండి సమాంతర ఆదాయాన్ని కూడా పొందవచ్చని REVOS తెలిపింది.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

REVOS ప్రకారం BOLT ఛార్జింగ్ పాయింట్‌ను దుకాణాలు, గ్యారేజీలు లేదా పార్కింగ్ ప్రదేశాలలో సులభంగా అమర్చవచ్చు. BOLT ఛార్జింగ్ సిస్టమ్ విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి పవర్ కాలిక్యులేటర్‌తో వస్తుంది. దీనితో పాటు BOLT యజమానులు 'పబ్లిక్' మరియు 'ప్రైవేట్' మోడ్‌ల మధ్య మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

ఈ BOLT ఛార్జింగ్ పాయింట్ ప్రైవేట్ మోడ్‌లో ఇన్‌స్టాల్ చేయబడితే అది కేవలం దాని యజమాని మాత్రమే వినియోగించుకోవచ్చు, దానిని ఇతరులు వినియోగించుకోటానికి అవకాశం ఉండదు. అయితే పబ్లిక్ మోడ్ లో మాత్రమే అందరూ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో భాగంగా REVOS ఇప్పటికే 60 వేర్వేరు భారతీయ నగరాల్లో మొత్తం 3,600 KW కంటే ఎక్కువ సామర్థ్యంతో వేలాది బోల్ట్ ఛార్జర్‌లను అమర్చింది.

BOLT ఛార్జింగ్ పాయింట్‌ పరిచయం చేసిన REVOS

ఈ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా ప్రజల వినియోగం కోసం ఇంకా ప్రారంభించలేదు. ఇవి ఇప్పటికి ప్రైవేటుగా మాత్రమే వినియోగించడానికి అందుబాటులో ఉన్నాయి. బోల్ట్ దాని స్వంత ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది మరియు ఇది ఏదైనా EVని స్మార్ట్ EVగా మార్చగలదని పేర్కొంది. ఇది యాక్సిడెంట్ డిటెక్షన్, SOS టెక్నాలజీ, నావిగేషన్ మరియు నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను EVలోనే యాక్సెస్ చేయడానికి రైడర్‌లను అనుమతిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతదేశంలో ప్రతి రోజు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలో దాదాపు అన్ని నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. ఈ సమయంలో పెట్రోల్ మరియు డీజిల్ తో నడిచే వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కావున ఇప్పుడు కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కస్టమర్లు ఎక్కువా భాగం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున భవిష్యత్తులో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలు కూడా మెండుగా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Revos introduced bolt iot enabled charging points in india for electric vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X