యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఈ ఫొటోలో కనిపిస్తున్న బైక్ ని చూశారా, ఇదొక మోడిఫైడ్ యమహా RX100 బైక్ లా కనిపిస్తుంది కదూ. నిజానికి ఇదొక ఎలక్ట్రిక్ బైక్. స్వీడన్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ RGNT (గతంలో REGENT) ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను తయారు చేసింది. ఈ బైక్ పేరు నెంబర్ వన్ క్లాసిక్ (No.1 Classic). పేరుకు తగినట్లుగానే ఇది చూడటానికి క్లాసిక్ గా కనిపించే పాత కాలపు డిజైన్ కలిగిన మోడ్రన్ ఎలక్ట్రిక్ బైక్.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ (RGNT No.1 Classic) లో

నెం.1 అనేది, ఇందులో కంపెనీ మునుపటి తరానికి ఇచ్చిన పేరు. కానీ ఇప్పుడు ఇందులో కొత్తగా వెర్షన్ 1.5 ని కంపెనీ విడుదల చేసింది. అంటే, మనుపటి తరం నెం.1 క్లాసిక్ మోటార్‌సైకిల్ ను మరింత కొత్తగా అప్‌గ్రేడ్ చేసి వెర్షన్ 1.5 పేరుతో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది యూరప్ మార్కెట్లో విక్రయించబడుతోంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఐరోపాలో ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ ఎలక్ట్రిక్ బైక్ ధర 12,495 యూరోలుగా నిర్ణయించబడింది. అంటే, ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, మనదేశ కరెన్సీలో సుమారు రూ. 10.75 లక్షలు అన్నమాట. ధర షాకింగ్ గా ఉంది కదూ. మనదేశంలో అయితే, అదే రూ. 10 లక్షల రూపాయలకు ఓ ఎలక్ట్రిక్ కారే వస్తుంది. కానీ, యూరప్ లో ఈ స్పెషల్ ఎలక్ట్రిక్ బైక్ కోసం కస్టమర్లు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

స్వీడన్‌లోని కుంగ్స్‌బెకా ఫ్యాక్టరీలో ఈ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయబడుతోంది. ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ మోటార్‌సైకిల్ 90 వ దశకంలో భారతదేశంలో విక్రయించిన యమహా RX100 బైక్ మాదిరిగానే రెట్రో-క్లాసిక్ లుక్ ని కలిగి ఉంటుంది. ఈ RGNT ఎలక్ట్రిక్ బైక్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడ్రన్ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటూనే తమ పాత ఐకానిక్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తోంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ మోటార్‌సైకిల్ లో టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే పెట్రోల్ ట్యాంక్, సింగిల్-పీస్ డెస్క్ సీటు మరియు క్లాసిక్ స్పోక్ వీల్స్ వంటి డిజైన్ వివరాలను ఇందులో చూడొచ్చు. కొత్తగా వెర్షన్ 1.5 కొత్త తరం నెం.1 క్లాసిక్ బైక్‌లో ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు దాని యాంత్రిక భాగాలలో ఇవ్వబడ్డాయి.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు సరికొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో జిపిఎస్ ఆధారిత నావిగేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సిస్టమ్ ఈసారి కొత్త బైక్ కంట్రోల్ యూనిట్ (BCU) యూనిట్‌ను అందుకుంది. ఈ BCU యూనిట్ ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తుంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

అంటే, వై-ఫై కనెక్టివిటీ సాయంతో బైక్ యొక్క సాఫ్ట్‌వేర్ ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఈ కొత్త తరం యూరోపియన్ ఎలక్ట్రిక్ బైకుపై ఉపయోగించిన లైట్లు అన్నీ కూడా ఎల్ఈడి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో కొత్త 9 kW ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు. ఈ మోటార్ గరిష్టంగా 11 కిలోవాట్ల (14.7 బిహెచ్‌పి) వరకు శక్తిని జనరేట్ చేస్తుంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఇందులో ఉపయోగించిన అధునాతన ఎలక్ట్రిక్ మోటార్ అధిక నాణ్యత కలిగిన వైర్ వైండింగ్లను కలిగి ఉంటుంది, ఫలితంగా ఇది ఇంజన్ వేడిని దాదాపు 30 శాతం తగ్గించగలదని RGNT చెబుతోంది. ఇది ఈ బైక్ యొక్క ఇంధన సామర్థ్యాన్ని (రేంజ్) ను మెరుగుపరచడమే కాకుండా అధిక వేడి వలన వృధా అయ్యే బ్యాటరీ శక్తిని కూడా నివారిస్తుంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ బైక్ లో అమర్చిన 7.7 kWh లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై హైవేలలో 110 కిమీ రేంజ్ ను మరియు పట్టణ రోడ్లపై 160 కిమీల రేంజ్ ని అందిస్తుంది. ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 125 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ఈ కొత్త వెర్షన్ 1.5 మోడల్ కేవలం ఎలక్ట్రిక్ మోటార్ అప్‌గ్రేడ్ మాత్రమే కాకుండా, ఓవరాల్ బైక్ ప్రయాణ అనుభవాన్ని కూడా మెరుగపరచారు. ఇంప్పుడు ఇందులో మునుపటి కన్నా మరింత మెరుగైన షాక్ అబ్జార్వర్లను ఉపయోగించారు. ఇందులో ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇరు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

యమహా RX100 రూపంలో ఎలక్ట్రిక్ బైక్.. కానీ ఇది అది కాదు !!

ప్రయాణీకుల అదనపు భద్రత కోసం ఆర్‌జిఎన్‌టి నెం.1 క్లాసిక్ బైక్ CBS (కనెక్టెడ్ బ్రేక్ సిస్టమ్) ను కూడా కలిగి ఉంటుంది. కంపెనీ ఇదే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ను స్క్రాంబ్లర్ రూపంలో కూడా అందిస్తోంది. అయితే, స్క్రాంబ్లర్ వెర్షన్‌ లో బైక్ చూడటానికి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఇంత ఖరీదైన ఈ యూరోపియన్ ఎలక్ట్రిక్ బైక్‌ భారతీయ తీరాలను చేరుకునే అవకాశమే లేదు.

Most Read Articles

English summary
Rgnt launches updated no 1 classic electric motorcycle in europe details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X