మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తున్న బైకులలో రాయల ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఇది భారతీయ రెట్రో-క్లాసిక్ బైక్ తయారీదారు. 2021 జనవరి నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రసిద్ధ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరను పెంచినట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు కేవలం ఒక నెల తరువాత కంపెనీ ఈ బైక్ ధరను మళ్ళీ పెంచింది.

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

నివేదికల ప్రకారం ఈసారి కంపెనీ దాని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరను భారీగా పెంచింది. చివరిసారి కంపెనీ ఈ బైక్ ధరను కేవలం 200 రూపాయలు మాత్రమే పెంచగా, ఈసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరను రూ. 3,213 నుంచి రూ. 3,552 వరకు పెంచింది. ఇది మాత్రమే కాకుండా కలర్ ఆప్షన్ ప్రకారం కూడా కంపెనీ ఈ బైక్ ధరను పెంచింది.

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని కిక్ స్టార్ట్ బుల్లెట్ సిల్వర్ మరియు ఒనిక్స్ బ్లాక్ కలర్ 1,46,624 రూపాయలకు అమ్ముడవుతుండగా, ఇప్పుడు అది ఎక్స్-షోరూమ్ 1,49,837 రూపాయలకు అమ్మబడుతుంది. అదే సమయంలో, కిక్ స్టార్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను రూ .1,56,688 ధరలకు విక్రయిస్తున్నారు. ఇంతకుముందు ఇది దాని ఎక్స్ షోరూమ్ ప్రకారం 1,53,341 రూపాయకు అమ్ముడయింది.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 యొక్క ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ విషయానికి వస్తే, దాని జెడ్ బ్లాక్, రీగల్ రెడ్ మరియు రాయల్ బ్లూ కలర్ ఆప్షన్స్ ఇంతకుముందు 1,63,626 రూపాయలకు అమ్ముడు కాగా, ఇప్పుడు దీని ధర 1,67,178 రూపాయలకు చేరుకుంది.

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే
Royal Enfield Latest Price Old Price Increase
Bullet 350 KS Bullet Silver & Onyx Black: ₹1,49,837

Black: ₹1,56,688

Bullet Silver & Onyx Black: ₹1,46,624

Black: ₹1,53,341

₹3,213 - ₹3,347
Bullet 350 ES Jet Black, Regal Red &

Royal Blue: ₹1,67,178

Jet Black, Regal Red &

Royal Blue: ₹1,63,626

₹3,552

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ వీటన్నిటి ధరను 3,552 రూపాయలు పెంచింది.రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు ఎన్ని సార్లు పెరిగినా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికి ఈ బైకులు కొనే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధరల పెరుగుదల మినహా ఇందులో ఎటువంటి ఇతర మార్పులు జరగలేదు.

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

ఈ బైక్‌లో అదే ఇంజిన్ కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 తో పాటు, సంస్థ తన అత్యంత ప్రాచుర్యం పొందిన మోటారుసైకిల్ క్లాసిక్ 350 శ్రేణి ధరలను పెంచింది. గత నెలలో కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ను కొత్త కలర్ ఆప్షన్ ఫారెస్ట్ గ్రీన్ లో విడుదల చేసింది.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

కంపెనీ ఇప్పటికే తన కిక్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్లను బుల్లెట్ సిల్వర్, వనెక్స్ బ్లాక్ మరియు బ్లాక్ పెయింట్ కలర్ లో విక్రయిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో ప్రస్తుత 346 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజిన్ 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Royal Enfield Bullet 350 Price Hiked. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X