జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

భారతదేశపు ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఇప్పుడు జపాన్ దేశంలో అడుగుపెట్టింది. థాయిలాండ్ మార్కెట్‌పై పట్టు సాధించిన తర్వాత, ఈ బ్రాండ్ మరొక ఇంటర్నెషనల్ డెస్టినేషన్‌ను ఎంచుకుంది. జపాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మొట్టమొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

జపాన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదు మోడళ్లను విక్రయించనుంది. వీటిలో బుల్లెట్ 500, క్లాసిక్ 500, అడ్వెంచర్ టూరర్ హిమాలయన్, మోడ్రన్-క్లాసిక్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కేఫ్ రేసర్ స్టైల్ మోడల్ కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

జపాన్‌లోని టోక్యోలో ఈ షోరూమ్‌ని ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో పైన పేర్కొన్న ఐదు మోటార్‌సైకిళ్లతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అఫీషియల్ యాక్ససరీలు, అప్పీరల్స్ మరియు స్పేర్ పార్ట్‌లను కూడా విక్రయించనున్నారు. అంతేకాకుండా, ఇదే షోరూమ్‌లో సర్వీస్ సదుపాయాన్ని కూడా అందించనున్నారు.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

యాకేలో స్థాపించబడి భారతదేశంలో స్థిరపడిన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ప్రస్తుతం ఆసియాతో సహా అనేక ఖండాల్లో ప్రపంచంలోని 60 దేశాల్లో తమ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. ఈ బ్రాండ్‌కు చెన్నైతో పాటు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో కూడా తయారీ ప్లాంట్ ఉంది.

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ జపాన్ మార్కెట్లో తమ బ్రాండ్ రిటైల్ ఎక్స్‌పీరియెన్స్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, మోటార్‌సైకిల్ రైడ్స్ మరియు కమ్యూనిటీ ఈవెంట్స్ మొదలైన వాటిని అందించడం ద్వారా అక్కడి మార్కెట్లోని కస్టమర్లకు, అభిమానులకు మరింత చేరువ కావాలని చూస్తోంది.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

ఈ సందర్భంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బిజినెస్ హెడ్ విమల్ సాంబ్లి మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల ఉండే మోటార్‌ సైక్లిస్టులకు జపాన్ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. రాయల్ ఎన్‌ఫీల్డ్ పిసిఐతో కలిసి జపాన్‌లో ఓ పెద్ద మరియు అద్భుతమైన మోటార్‌సైకిల్ కమ్యూనిటీని స్థాపించాలని భావిస్తుందని అన్నారు.

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

ఇక మన భారతదేశం విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన సమాచారం కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

జపాన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ఐదు పాపులర్ బైక్స్ లాంచ్

అంతేకాకుండా, కంపెనీ విక్రయిస్తున్న 650సీసీ ట్విన్ మోటార్‌సైకిల్స్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లలో కూడా మైనర్ అప్‌డేట్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మీటియోర్ 350 మాదిరిగానే ఈ రెండు 650 మోడళ్లలో కూడా ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Royal Enfield Enters Into Japan Market, Opens Its First Store In Tokyo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X