కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం వల్ల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు ముగిసింది. కరోనా మహమ్మరి వల్ల ఆటోపరిశ్రమ తీవ్రనష్టాలను చవి చూసింది. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రారంభం కాగానే, వాహన తయారీదారులు తమ వాహనాల ధరలను కొంత వరకు పెంచారు.

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

ఇప్పటికే దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ మరియు హోండా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం జరిగింది. ఇదే తరుణంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన బైక్ ధరలను పెంచింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350 మరియు మీటియార్ 350 యొక్క అన్ని వేరియంట్ల ధరను కంపెనీ పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది.

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత సరసమైన బైక్ అయిన బుల్లెట్ 350 ధర ఇప్పుడు 10,000 రూపాయల వరకు పెంచింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధరను రూ. 4,490 పెంచారు. ఇప్పుడు బుల్లెట్ 350 యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 1,54,327 రూపాయలు.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్, క్లాసిక్ 350 విషయానికి వస్తే, ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 5,992 వరకు పెరిగింది. ఇప్పుడు క్లాసిక్ 350 యొక్క బేస్ మోడల్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర వద్ద 1,72,465 రూపాయలకు లభిస్తుంది. అదే సమయంలో, గత సంవత్సరం లాంచ్ చేసిన మీటియార్ 350 ధరను రూ. 6,023 పెంచారు.

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

మీటియార్ 350 యొక్క బేస్ మోడల్ ఇప్పుడు కొత్త ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం 1,84,319 రూపాయలకు లభిస్తుంది. కంపెనీ ధరలపెరుగుదల ఇప్పటికి వరుసగా మూడవసారి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంతకుముందు జనవరి, ఫిబ్రవరి నెలల్లో తన బైక్ మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

ప్రస్తుతం దేశంలో ముడి పదార్థాలు మరియు బైక్ తయారీలో ఉపయోగించే పరికరాల ధరల పెరుగుదల కారణంగా కంపెనీలు కూడా వాహనదారులను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడానికి ఇటీవల తమ కొత్త వాహనాలను టెస్ట్ చేస్తోంది. కంపెనీ తన కొత్త 350 సిసి బైక్‌ను పరీక్షిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ బైక్ పేరును 'హంటర్' అని చెబుతున్నారు. ఈ బైక్‌ను ఈ ఏడాది పండుగ సీజన్లో లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

ఇవే కాకుండా క్లాసిక్ 350 యొక్క అల్లాయ్ వీల్ మోడల్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. సమాచారం ప్రకారం, క్లాసిక్ 350 అల్లాయ్ వీల్స్‌తో కొత్త అవతార్‌లో కనిపిస్తుంది. ఇది ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టిప్పర్ నావిగేషన్‌ వంటి వాటితో క్లాసిక్ 350 అప్‌డేట్ అవుతుంది.

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంతకాలంగా భారతీయ రోడ్లపై పరీక్షించబడుతోంది. ఇటీవల, ఈ బైక్ మరోసారి టెస్ట్ చేసే సమయంలో దాని ఫోటోలు కొన్ని బయటపడ్డాయి. ఈ ఫోటోల ఆధారంగా ఈ బైక్ యొక్క ఎక్స్టీరియర్ లో గుండ్రని పిలియన్ సీటు, కొత్త గ్రాబ్ రైలు మరియు క్రోమ్ ట్రీట్మెంట్ ఇండికేటర్, అప్డేట్ చేయబడిన టెయిల్ లాంప్స్ వంటి చిన్న డిజైన్ అప్డేట్స్ పొందుతుంది.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

ట్యూబ్ లెస్ టైర్లను ఇందులో ఆప్షన్ గా అందించే అవకాశం ఉంది. ఇందులో 90/90 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 120/80 18 ఇంచెస్ రియర్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. వీటితోపాటు కంపెనీ దీనికి డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ సిస్టం కూడా అందించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కంపెనీ పెంచిన ధరలు, అమ్మకాలపరంగా ఏవిధంగా ప్రభావితమవుతాయో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Royal Enfield Classic 350 Prices Increased. Read in Telugu.
Story first published: Tuesday, April 6, 2021, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X