'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బైక్స్‌పై ఆన్‌లైన్ కస్టమైజేషన్ అప్సన్ ను వినియోగదారులకు అందించిన తర్వాత, ఇప్పుడు తన దుస్తులు శ్రేణికి అనుకూలీకరణను జోడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 'మేక్ ఇట్ యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వినియోగదారులు దుస్తులు శ్రేణిలో అందించే ఉత్పత్తులలో వ్యక్తిగత మార్పులు చేసిన తర్వాత కంపెనీ నుంచి డెలివరీ పొందవచ్చు.

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

గూగుల్ ప్లేస్టోర్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ అపెరల్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయడం ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ దుస్తులు కొనుగోలు చేయవచ్చు. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న ఉత్పత్తులను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తులలో హెల్మెట్లు మరియు టీ-షర్టులు కూడా చేర్చబడ్డాయి.

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

టీ-షర్టు మరియు హెల్మెట్ యొక్క రంగు మాత్రమే కాకుండా, దానిపై గ్రాఫిక్స్ కూడా వినియోగదారునికి నచ్చినట్లు మార్చుకోవచ్చు. టీ-షర్టుపై ప్రింటింగ్ మార్చే అప్సన్ కూడా ఇందులో ఇవ్వబడింది.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

ఈ యాప్‌లో హెల్మెట్ యొక్క ప్రారంభ ధర రూ .3,200 కాగా టీ షర్ట్ ప్రారంభ ధర రూ. 1,250 గా నిర్ణయించబడింది. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన తరువాత కేవలం మీ ప్రోడక్ట్ 15 నుంచి 20 రోజుల్లో డెలివరీ చేయబడుతుంది. ఈ మేక్ ఇట్ యువర్స్ ప్రాజెక్ట్ గత సంవత్సరం మీటీయార్ 350 మరియు 650 ట్విన్ బైక్‌లతో ప్రారంభించబడింది.

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క మేక్ ఇట్ యువర్స్ ప్రాజెక్ట్ కింద, హెల్మెట్ల కోసం 7,000 కస్టమైజేషన్ అప్సన్స్ అందించబడతాయి. హెల్మెట్ యొక్క కలర్ మార్చడంతో పాటు, హెల్మెట్ యొక్క స్టిక్కర్ మరియు దానిపై నెంబర్ కూడా మార్చుకోవచ్చు. టీ-షర్టుపై 15 వేలకు పైగా కస్టమైజేషన్ ఎంపికలను కంపెనీ అందిస్తుంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

వీటిలో టీ-షర్టుపై ప్రింట్, రైటింగ్, గ్రాఫిక్స్ మరియు కలర్ మార్పులు వంటివి ఉన్నాయి. మీ బైక్ యొక్క నెంబర్ కూడా ఎంచుకున్న టీ షర్టుపై వ్రాయించుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుండి గొప్ప స్పందన లభిస్తోందని కంపెనీ తెలిపింది.

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైక్‌ల ధరను 2021 జనవరి నుంచి రూ. 200 నుంచి రూ. 3000 వరకు పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, క్లాసిక్ 350 మరియు 650 ట్విన్ బైక్‌ల కొత్త మోడళ్లను రాబోయే రోజుల్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

'మేక్-ఇట్-యువర్స్' ప్రాజెక్ట్ ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ; ఎందుకో తెలుసా ?

క్లాసిక్ 350 మరియు కాంటినెంటల్ జిటి 650 బైక్‌ల కొత్త మోడళ్లను ఇటీవల కంపెనీ టెస్ట్ చేసింది. 2020 డిసెంబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 65,492 బైక్‌ల అమ్మకాలతో దాదాపు 35% పెరుగుదల కనపరిచిందని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇటీవల కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు దేశీయ మార్కెట్లో పరుగులుపెడుతున్నాయి. కంపెనీ నుంచి రానున్న కొత్త ఉత్పతులు కూడా రాబోయే కాలంలో మరింత మెరుగైన అమ్మకాలను కనపరచడానికి సహాయపడతాయి.

Most Read Articles

English summary
Royal Enfield Introduces Customizable Apparel Range Under Make It Yours Scheme. Read in Telugu.
Story first published: Friday, January 29, 2021, 19:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X