2021 జులై నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల జోరు; పెరిగిన వృద్ధి

దేశీయ మార్కెట్లో ఎంతోమంది యువకులకు ఇష్టమైన బైకులలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఒకటి. ఇటీవల కాలంలో చెన్నైకి చెందిన ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2021 జులై నెల అమ్మకాలను విడుదల చేసింది. నివేదికల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై నెలలో మొత్తం 44,038 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2020 జులై నెలలో 40,334 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం 9 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. అంతే కాకూండా కంపెనీ మునుపటి సంవత్సరం జులై నెల కంటే ఈ సంవత్సరం జులై నెల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. గత నెలలో కంపెనీ 4,748 యూనిట్లను ఎగుమతి చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతుల్లో కూడా 9 శాతం వృద్ధిని సొంతం చేసుకోగలిగింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో మాత్రమే కాకూండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలతో దూసుకెళ్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఏప్రిల్ మరియు జూలై 2021 మధ్య 23,711 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు తన అమ్మకాలను మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో 130 కి పైగా స్పెషాలిటీ స్టోర్లను కలిగి ఉంది. అంతే కాకుండా 60 కి పైగా దేశాలలో మొత్తం 760 కి పైగా స్టోర్లను కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ గత సంవత్సరం జపాన్, కంబోడియా, కోస్టారికా మరియు డొమినికన్ రిపబ్లిక్ వంటి దేశాల్లోకి ప్రవేశించింది. కంపెనీ తన మొదటి సికెడి యూనిట్‌ను బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనాలో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ చాలా వేగంగా విస్తహరిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రనంద్ నుంచి విడుదలైన కొత్త మీటియార్ 350 బైక్ యూరప్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, జపాన్, ఉత్తర అమెరికా మరియు ఐరోపా అంతటా శరవేగంగా అమ్ముడవుతూ చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఈ బైక్ విడుదలతో మార్కెట్లో అమ్మకాలు మరింత పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త క్లాసిక్ 350 బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త వేరియంట్‌లతో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ భారతదేశంలో చాలాసార్లు టెస్ట్ చేయబడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

ఈ 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన హిమాలయన్ అడ్వెంచర్ బైక్ యొక్క కొత్త వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హిమాలయన్ బైక్ యొక్క ఆన్-రోడ్ యొక్క కొత్త వేరియంట్ ఇటీవల స్పాట్ టెస్ట్ లో కూడా గుర్తించబడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలను అందించడానికి మరియు తమ ప్రధాన బైక్ మోడళ్లకు సాధ్యమైనంత ఉత్తమమైన సేవను అందించడానికి కేర్24 ప్యాకేజీని ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త కేర్24 ప్యాకేజీ మోడల్‌ను స్టాండర్డ్ సర్వీస్ ప్యాకేజీ కంటే కూడా ఎక్కువ డబ్బు చెల్లించి వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జులై అమ్మకాలు విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయ మార్కెట్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఈ కొత్త మోడల్స్ రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనున్నాయి. ఈ కొత్త మోడల్స్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield sales 2021 July. Read in Telugu.
Story first published: Tuesday, August 3, 2021, 11:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X