రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇటీవల తన 2021 జూన్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2021 జూన్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 35,815 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ అమ్మకాలు 2020 జూన్ నెల కంటే 2 శాతం తక్కువ. గత 2020 జూన్ నెలలో మొత్తం విక్రయించిన వాహనాల సంఖ్య 36,510 యూనిట్లు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కొంత వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగుమతుల విషయానికి వస్తే మాత్రం చాలా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 2021 జూన్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 7,233 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. అదే 2020 జూన్ లో కేవలం 1,555 యూనిట్ల వాహనాలను మాత్రమే ఎగుమతి చేసినట్లు తెలిసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

2020 జూన్ తో పోలిస్తే 2021 జూన్ ఎగుమతులు దాదాపు 365 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, ప్రస్తుతం దేశీయ మరియు విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం వాహనాల సంఖ్య 43,048 యూనిట్లు. అదే విధంగా 2020 జూన్ నెలలో అమ్మిన ద్విచక్ర వాహనాల సంఖ్య 38,065 యూనిట్లు. జూన్ 2020 తో పోలిస్తే జూన్ 2021 అమ్మకాలలో 13 శాతం పెరుగుదల కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

2020 లో కరోనా మహమ్మారి మొదటి దశ ప్రబలంగా ఉండటం వల్ల, రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకు కేవలం 57,269 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించగలిగింది, అదే సమయంలో 2021 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 1,23,640 మోటార్‌సైకిళ్లను విక్రయించి 116 శాతం వృద్ధిని నమోదు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్ అమ్మకాలు 91 శాతం పెరిగి 1,04,677 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో 54,939 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. గ్లోబల్ మిడ్-సైజ్ మోటారుసైకిల్ విభాగంలో బ్రాండ్ ట్రాక్షన్‌ను కొనసాగిస్తున్నందున, రాయల్ ఎన్‌ఫీల్డ్ విదేశీ మార్కెట్లలో మంచి పనితీరును కొనసాగిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

2021 ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం ఎగుమతులు 18,963 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఎగుమతి చేసిన ద్విచక్ర వాహనాల సంఖ్య 2,330 యూనిట్లు. కంపెనీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 60 కి పైగా దేశాలలో 130 కి పైగా స్పెషల్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ మరియు 760 కి పైగా రిటైల్ షాప్స్ కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

రాయల్ ఎన్ఫీల్డ్ గత సంవత్సరం జపాన్, కంబోడియా వంటి కొత్త దేశాల్లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. అదే విధంగా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో కంపెనీ కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్స్ ద్వారా అమ్మకాలను ప్రారంభించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 జూన్ సేల్స్ రిపోర్ట్.. వచ్చేసింది.. చూసారా?

దేశీయ మార్కెట్లో ప్రవేశించిన, రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ మోడల్, మీటియార్ 350, యూరప్, థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, జపాన్, ఉత్తర అమెరికా మరియు ఐరోపా మార్కెట్లలో బాగా అమ్ముడవుతోంది. కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి ఈ కొత్త మోడల్ చాలా బాగా ఉపయోగపడింది.

Most Read Articles

English summary
Royal Enfield 2021 June Sales Details. Read in Telugu.
Story first published: Saturday, July 3, 2021, 12:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X