రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

భారత మార్కెట్లో రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, ప్రస్తుతం 650సీసీ విభాగంలో కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ విభాగాన్ని విస్తరించేందుకు కంపెనీ ఓ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రానున్న ఈ శక్తివంతమైన 650సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్ చూడటానికి ఇది అప్‌గ్రేడెడ్ థండర్‌బర్డ్‌లా అనిపిస్తుంది. తాజాగా ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించిన స్పై వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయింది. మాస్క్డ్‌మోటో అనే యూట్యూబర్ ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ఈ వీడియోలో వేగంగా వెళ్తున్న 650సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను చూడొచ్చు మరియు దాని ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్)ను కూడా వినొచ్చు. ఈ వీడియోని కారు లోపల నుండి రికార్డ్ చేయడం వలన ఎగ్జాట్ నోట్‌లో స్పష్టత లేదు, అయితే ఇది ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 యొక్క 270-డిగ్రీల ఫైరింగ్ ఆర్డర్ ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో సమానంగా ఉంటుంది.

MOST READ:రాపిడో రెంటల్ సర్వీస్ స్టార్ట్, కేవలం ఈ నగరాలలో మాత్రమే

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

కానీ, ఈ కొత్త 650సీసీ బైక్ ఎగ్జాస్ట్ నోట్ పైన పేర్కొన్న రెండు మోడళ్ల కంటే బిగ్గరగా వినిపించే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ పూర్తి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేస్తోంది. ఫలితంగా దీనికి సంబంధించిన అనేక డిజైన్ వివరాలు వెల్లడి అయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌కు రెట్రోల్ లుక్‌నిచ్చేందుకు గుండ్రటి హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లను ఉపయోగించారు. ఇంకా ఇందులో ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్, కర్వ్‌డ్ ఫెండర్స్, సుదూర ప్రయాణాల కోసం ఇందులో సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ఈ మోటార్‌సైకిల్‌లోని స్ప్లిట్ సీట్ డిజైన్ మరియు పిలియన్ రైడర్ కోసం బ్యాక్‌రెస్ట్ మరో అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఇందులో ముందు వైపు అమర్చిన అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ (యూఎస్‌డి) ఫోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ ప్రొటెక్టర్, అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద ప్రొఫైల్‌తో కూడిన టైర్లు వంటి ఫీచర్లను కూడా మనం గమనించవ్చచు.

ఈ టెస్టింగ్ వాహనంలో కనిపిస్తున్న అప్ సైడ్ డౌన్ ఫోర్కులను ప్రొడక్షన్ మోడల్‌లో కూడా కంపెనీ ఉపయోగించినట్లయితే, ఇదే బ్రాండ్ యొక్క మొట్టమొదటి యూఎస్‌డి ఫోర్క్ సెటప్ అవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలో ఇప్పటి వరకూ ఈ తరహా ఫోర్కులను ఉపయోగించలేదు.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ మోటార్‌సైకిళ్లలో కనిపించినట్లుగా, ఈ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఇరువైపులా సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మోటారుసైకిల్‌లో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై పెద్ద టైర్లు కూడా ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లో పొడవైన వీల్‌బేస్, టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, ఎత్తుగా మరియు వెడల్పుగా ఉండే హ్యాండిల్ బార్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మొదలైన ఫీచర్లుు ఉన్నాయి. ఇవన్నీ రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తాయి.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ఇక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, మీటియోర్ 350 మోడల్‌లో కనిపించినట్లుగా ఇందులో కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే, ఇంజన్ విషయానికి వస్తే ఇతర 650సీసీ మోడళ్లలో ఉపయోగిస్తున్న అదే ఇంజన్‌ను ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ క్రూయిజర్ బైక్ టెస్టింగ్; త్వరలోనే విడుదల!

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) మోటార్‌సైకిళ్లలో 649సీసీ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ను మరియు 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు స్లిప్పర్-క్లచ్ అసిస్ట్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Royal Enfield's New 650cc Cruiser Motorcycle Spotted Testing, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X