సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ డిమాండ్ కేవలం కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాదు, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం, దేశంలో ఇంధన ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉండటమే.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఇదిలా ఉండగా మరోవైపు కరోనా మహమ్మారి కూడా ఆటో మొబైల్ పరిశ్రమ మీద మరియు ప్రజల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా పరిశ్రమలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతే కాకుండా ప్రజలు కరోనా ప్రబలుతుందనే భయంతో ప్రజా రవాణాను పూర్తిగా విస్మరించారు.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించిన తరువాత ప్రజలు సొంత వాహనాలను కలిగి ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపారు. ఈ కారణంగా సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి అధిక మొత్తంలో డబ్బు అవసరమౌతుంది.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

అయితే సెకండ్ హ్యాండ్ వాహనాలకు అంత డబ్బు అవసరం లేదు. కావున ప్రజలు ఎక్కువగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను కొనుగోలు చేసిన మాదిరిగా సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగింది.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎలాంటి వాహనాలను గోనుగోలు చేయాలి వంటి విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కారణాలు:

సాధారణంగా ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు కొత్తవయినా లేదా పాతవయినా పర్యావరణానికి ఎటువంటి కాలుష్యాన్ని కలిగించవు. ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను కొనుగోలు చేయాలంటే, ఎక్కువా కాలం వేచి ఉండవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయటానికి ఎక్కువ సమయం అవసరం లేదు. వీటిని చాలా తొందరగా వినియోగాదారులు పొందవచ్చు. వ్యక్తిగత ఉపయోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా అనుకూలంగా ఉంటాయి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

బ్యాటరీ లైఫ్:

సాధారణంగా సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలైతే వాటి ఇంజిన్ పరిశీలిస్తారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే వారు ఆ వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ ఏంటి అది ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అనే విషయం తప్పకుండా పరిశీలించాలి. మీరు సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం వెచ్చిస్తున్న డబ్బు సరైనదా.. వంటి విషయాలు ఒక సారి నిర్దారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ మరియు పరిధిని గుర్తించడం కష్టం, కానీ దానిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. కొన్ని స్టార్టప్ కంపెనీలు వాటిని ట్రాక్ చేయడానికి మార్కెట్లో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ నేయి ఛార్జింగ్ టైప్, ఛార్జింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు బ్యాటరీ స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

వెహికల్ లో ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, వెయిటింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. కానీ హోమ్ ఛార్జింగ్ సాకెట్ దీర్ఘ కాలిక బ్యాటరీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. క్రమం తప్పకుండా ఛార్జ్ చేయకపోవడం మరియు బ్యాటరీపై పూర్తి ఛార్జ్ చేయడం బ్యాటరీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఆవకాశం ఉంటుంది, కావున కొనుగోలుదారులు తప్పకుండా బ్యాటరీ లైఫ్ నిర్దారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

రేంజ్:

ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రేంజ్ అనేది బ్యాటరీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పెద్దగా ఉన్నప్పుడు, ఇవి చాలా దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు బ్యాటరీ పరిమాణం మరియు అది అందించే సగటు పరిధిని కూడా ఒకసారి నిర్దారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

మౌలిక సదుపాయాల లభ్యత:

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు తప్పకుండా దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, లేదా అనేది తెలుసుకోవాలి. హోమ్ ఛార్జింగ్ సులభమైన పరిష్కారం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ లో రిమూవబుల్ బ్యాటరీ లేదా స్థిరంగా ఉండే బ్యాటరీ టైప్ గురించి కూడా నిర్ధారించుకోండి.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వ్యక్తులు హైవేలు మరియు దూర ప్రాంతాలలో ప్రయాణించవచ్చు. కావున వీటికి కావలసిన మౌలిక సదుపాయాల గురించి బేరీజు వేసుకోవాలి. ప్రస్తుతం దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు బ్యాటరీ కాంట్రాక్ట్ సౌకర్యాలను అందిస్తున్నాయి. కావున వాహన వినియోగరులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఖర్చు:

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు మనం పరిగణించాల్సిన మరో అంశం దాని యొక్క నిర్వహన ఖర్చు. యాజమాన్యం ధర కొనుగోలు ధర మరియు ఇప్పటివరకు EV మరమ్మతుల మొత్తం ఖర్చును కలిగి ఉంటుంది. పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పోలిస్తే వీటి ధర ఎక్కువగా ఉంటుంది, కానీ మొత్తం యాజమాన్యం ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులు బేరీజు వేసుకుని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి.

గమనిక: ఇక్కడ ఉపయోగించిన ఫొటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Things to keep in mind while purchasing second hand electric vehicle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X