భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగుతుండటంతో, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు చక్కటి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీని కూడా అందిస్తున్నారు. ఫలితంగా, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు బారీగా దిగొచ్చాయి.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఆగస్టు 15వ తేదీన, ఓలా ఎలక్ట్రిక్ మరియు సింపుల్ ఎనర్జీ సంస్థలు తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారత మార్కెట్లో విడుదల చేశాయి. ఇప్పటికే మన మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని మాత్రమే బెస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్లను మరియు రేంజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మరి ఆ టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

1. సింపుల్ వన్: ధర - రూ. 1,09,999, రేంజ్ - 236 కిమీ

లాంగ్ రేంజ్ బ్యాటరీ, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో కెల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో 4.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 4.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 110 కిలోలు మరియు ఇందులో 30-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో ఓ పెద్ద సైజు హెల్మెట్‌ను ఉంచవచ్చు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే, దానిపై 236 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. యూజర్ స్మార్ట్‌ఫోన్ సాయంతో దీనిని రిమోట్‌గా కనెక్ట్ చేసుకొని, ఆపరేట్ చేయవచ్చు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఇంకా ఇందులో జియో ఫెన్సింగ్, ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు, రూట్ సేవ్ ఫీచర్, రైడింగ్ స్టాటిక్స్ మరియు రిమోట్ లాకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్‌ను నమ్మ రెడ్, బ్రెజెన్ బ్లాక్, అజూర్ బ్లూ మరియు గ్రేస్ వైట్ అనే నాలుగు రంగులలో అందిస్తోంది. ఆసక్తికరకమైన విషయం ఏంటంటే, ఇందులో రిమూవబల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మరియు దానిని విడిగా తీసి చార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

2. ఓలా ఎస్1, ఎస్1 ప్రో: ధర - రూ. 99,999 నుండి రూ. 1,29,999, రేంజ్ - 181 కిమీ

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కూడా ఆగస్ట్ 15వ తేదీన ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్లు 3.9 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి మరియు వీటిలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వీటిని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. ఇందులోని టచ్‌స్క్రీన్ సిస్టమ్ ద్వారా ఈ స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయి కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ వంటి అనేక ఫంక్షన్లు కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ అనే రైడ్ మోడ్స్ కూడా ఉంటాయి.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

పూర్తి చార్జ్‌పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 181 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్ మరియు బలమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ మొత్తం 10 రంగులలో ప్రవేశపెట్టింది.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

3. ఏథర్ 450ఎక్స్: ధర - రూ. 1,44,500, రేంజ్ - 116 కిమీ

ఏథర్ ఎనర్జీ నుండి లభిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గత కొంత కాలంగా మార్కెట్లో ఉంది. ఈ స్కూటర్‌లో కంపెనీ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3.3 kW పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో, గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 6.5 సెకన్ల సమయం పడుతుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఫీచర్లు

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది కూడా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంటుంది మరియు టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా ఈ ఫీచర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్పోర్ట్, రైడ్ మరియు ఎకానమీ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి స్కూటర్ రేంజ్ మారుతూ ఉంటుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ స్పోర్ట్ మోడ్‌లో 60 కిమీలు, రైడ్ మోడ్‌లో 70 కిమీలు మరియు ఎకో మోడ్‌లో 85 కిమీలుగా ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క పూర్తి ఛార్జ్‌పై 116 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని బ్యాటరీ 3 గంటల 35 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్ల రేంజ్‌కు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

4. బజాజ్ చేతక్: ధర - రూ. 1 లక్ష నుంచి రూ. 1.15 లక్షలు, రేంజ్ - 95 కిమీ

ఇక ఈ జాబితాలో చివరిది బజాజ్ ఆటో అందిస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 kWh సామర్థ్యం కలిగిన IP67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4kW పవర్‌ను మరియు 16 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లు (స్పోర్ట్ మరియు ఎకో) ఉంటాయి.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఫీచర్లు

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో గరిష్టంగా 95 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కాగా, దీనిని స్పోర్ట్ మోడ్‌లో గరిష్టంగా 85 కిమీ వరకు నడపవచ్చని కంపెనీ పేర్కొంది. ఇతర స్మార్ట్ స్కూటర్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లేటెస్ట్ కెనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది మరియు క్విక్ ఛార్జింగ్ సహాయంతో, కేవలం 1 గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

5. టీవీఎస్ ఐ-క్యూబ్: ధర - రూ.1,00,000, రేంజ్ - 75 కిమీ

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.4 kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిమీ వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో 2.25kWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు 5 గంటలు పడుతుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఫీచర్లు

ఈ స్కూటర్‌లో కంపెనీ స్మార్ట్‌కనెక్ట్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇందులో అధునాతన టిఎఫ్‌టి క్లస్టర్ మరియు కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్‌ను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని, వివిధ రకాల ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు. వీటిలో జియో ఫెన్సింగ్, రిమోట్ లాంకిగ్, బ్యాటరీ ఛార్జింగ్ స్థితి, నావిగేషన్ అసిస్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, ఇన్‌కమింగ్ కాల్/మెసేజ్ మొదలైనవి ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్‌తో కంపెనీ 3 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీని ఇస్తోంది.

Most Read Articles

English summary
Top 5 electric scooters in india simple one ola s1 ather 450x tvs iqube bajaj chetak
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X