పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రత్యేకించి, ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఈ వృద్ధి గణనీయంగా ఉంది. ఈ విభాగంలో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మరియు సింపుల్ వంటి పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి మరికొన్ని సంస్థలు కొత్త ఉత్పత్తులపై పనిచేస్తున్నాయి. భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు మరొక స్టార్టప్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ తో ముందుకొచ్చింది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

పూణేకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టార్క్ మోటార్స్ (Tork Motors) తమ మొట్టమొదటి ప్రొడక్షన్ వెర్షన్ హై-పెర్ఫార్మెన్స్ బైక్ టార్క్ టి6ఎక్స్ (Tork T6X) ని అధికారికంగా ఆవిష్కరించింది. త్వరలోనే ఈ బైక్ మార్కెట్లో విడుదల అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను మొదటిసారిగా చూసిన వారు ఇది పల్సర్ ఎన్ఎస్125 బైక్ యొక్క క్లోనింగ్ మోడల్ అనుకోవటం ఖాయం.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

టార్క్ టి6ఎక్స్ బైక్ పోలిక ఇంచు మించు అలానే ఉన్నప్పటికీ, ఇవి రెండూ పూర్తిగా విభిన్నమైన మోడళ్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చాలా సింపుల్ గా మరియు అంతే స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ అన్ని వైపుల నుండి మంచి స్పోర్టీ వైఖరిని కలిగి ఉంటుంది. టార్క్ మోటార్స్ ఈ బైక్‌ ను తొలిసారిగా 2016 లో ప్రదర్శించింది. కాగా, ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ కి సిద్ధంగా ఉన్న మోడల్ ని కంపెనీ ఆవిష్కరించింది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ఈ సరికొత్త టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్ వెనుక భాగంలో ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంటాయి మరియు టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి రూపంలోనే ఉంటాయి. దీని హ్యాండిల్‌బార్ మధ్యలో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది మరియు ఇది లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ఈ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సాయంతో రైడర్ నావిగేషన్ ఫీచర్లను పొందవచ్చు మరియు తన స్మార్ట్‌ఫోన్ సాయంతో బైక్ కు రిమోట్ గా కనెక్ట్ అయి వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కంపెనీ ఇందులో ఓ ప్రత్యేమైన మొబైల్ యాప్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇంకా ఇందులో డేటైమ్ రన్నింగ్ లైట్, మొబైల్ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో ఫెన్సింగ్ మరియు రిమోట్ లాక్ / అన్‌లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ బైక్‌ లో ఇన్‌స్టాల్ చేయబడిన బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాకపోతే, ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిమీ వరకూ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకూ ఉంటుందని టార్క్ మోటార్స్ తెలిపింది. ఈ గరిష్ట వేగంతో ఇది హైవేపై నడపడానికి కూడా మెరుగైన ఎలక్ట్రిక్ బైక్‌ గా మారుతుంది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

బైక్ చార్జింగ్ విషయానికి వస్తే, కేవలం 1 గంట వ్యవధిలోనే 80 శాతం చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో అమర్చిన 6 కిలోవాట్ ఎక్సియల్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ మోటార్ 96 శాతం వరకు సమర్థవంతమైనది మరియు ఇది గరిష్టంగా 27 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మొత్తం బరువు 130 కిలోలు గా ఉంటుంది. పూనేలో ఉన్న టార్క్ మోటార్స్ ఫ్యాక్టరీలో ఈ బైక్ ను తయారు చేయనున్నారు.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

టిరోస్ (Tork Intuitive Response Operating System - TIROS) అనేది టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని నడిపించే టెక్నాలజీ. ఇది ప్రతి రైడ్, పవర్ మేనేజ్‌మెంట్, రియల్ టైమ్ పవర్ వినియోగం మరియు రేంజ్ ఫోర్కాస్ట్‌లకు సంబంధించిన విశ్లేషణ మరియు డేటాను తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఈ బైక్ ను మీరు ఎలా రైడ్ చేస్తారో కూడా తెలుసుకుంటుంది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

TIROS కూడా క్లౌడ్ ద్వారా ఆటోమేటిక్‌గా కొత్త ఫీచర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో వస్తున్న కొత్త Tork T6X నిజంగానే రోడ్డు మీద ఓ తెలివైన మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఈ బైక్ లో పవర్ డెలివరీని సర్దుబాటు చేయడానికి సులభంగా అనుకూలీకరించదగిన (కస్టమైజబల్) రైడ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

ఇక ఇందులోని మెకానికల్స్‌ని గమనిస్తే, టార్క్ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో కాస్ట్ అల్యూమినియం ఐపి67 లిథియం అయాన్ బ్యాటరీని (సామర్థ్యం ఇంకా తెలియాల్సి ఉంది, బహుశా 72 ఆంపియర్ అయి ఉండొచ్చు) ఉపయోగించారు. ముందు వైపు 267 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ లను ఉపయోగించారు. ఇవి రెండూ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తాయి.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ఈ బైక్ లో ఇరువైపులా అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ముందు వైపు 18/100-17 టైర్ మరియు వెనుక వైపు 110/80-17 టైర్ ఉంటాయి. ఇవి రెండూ కూడా ట్యూబ్‌లెస్ టైర్లు. ఇది చైన్ సాయంతో సాధారణ బైక్ మాదిరిగానే నడుస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ లను బైక్ మధ్య భాగంలో అమర్చబడి ఉంటాయి. బైక్ బ్యాలెన్సింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా వీటిని అమర్చారు.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు వైపు ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇది మొత్తం 1960 మిమీ పొడవు, 784 మిమీ వెడల్పు, 1085 మిమీ ఎత్తు మరియు 1336 మిమీ వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది. ఈ బైక్ సీట్ ఎత్తు 785 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ గానూ ఉంటుంది.

పల్సర్ అనుకొని పొరపాటు పడ్డారా..? ఇది Tork T6X ఎలక్ట్రిక్ బైక్, త్వరలోనే లాంచ్!

ఈ బైక్ విడుదల సమయంలో కంపెనీ దాని ధర మరియు డెలివరీకి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. దేశంలోని ఇతర ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే, టార్క్ టి6ఎక్స్ కూడా కేంద్రం యొక్క ఫేమ్-2 సబ్సిడీకి మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మినహాయింపులకు లోబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Tork motors unveiled t6x electric bike in india launch expected soon range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X