నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా (Toyota) ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం పేరు టొయోటా సి ప్లస్ వాక్ టి (Toyota C+walk T). ఇది సాంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా, ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

జపాన్ కి చెందిన టొయోటా మోటార్ కార్పొరేషన్ (టిఎమ్‌సి) శుక్రవారం నాడు ఈ మూడు చక్రాల బ్యాటరీ పవర్డ్ స్టాండ్ ఓరియెంటెడ్ సిటీ కమ్యూటింగ్ ఆప్షన్‌ అయిన టొయోటా సి+వాక్ టి తమ స్వదేశీ మార్కెట్లో విడుదల చేసింది. పేరుకు తగినట్లుగానే ఇది నడవటానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే ఎలక్ట్రిక్ వెహికల్.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

సాధారణ ప్రజలే కాకుండా వికలాంగులు మరియు నడవటానికి కష్టపడే వృద్ధులు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యవంతులు ఈ Toyota C+walk T ఈవీపై ఎంచక్కా నిలుచుకొని ముందుకి సాగిపోవచ్చు. అలాకాకుండా, ఇందులోని వీల్ చైర్ ఆప్షన్ సాయంతో దీనిని తమ సాధారణ వీల్ చైర్ కి కనెక్ట్ కూడా చేసుకోవచ్చు.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

వయసుమళ్లిన పెద్ద వారి కోసం ఇందులోనే కుర్చీ లాంటి నిర్మాణంతో కూడిన మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని ఎలక్ట్రిక్ కార్ట్ మాదిరిగా నడపవచ్చు. టొయోటా ప్రత్యేకించి నగరవాసులను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. సి+వాక్ టి కేవలం 150 మిమీ ఫ్లాట్ బేస్ కలిగి ఉంటుంది మరియు ఇది ప్రధానంగా నడక ప్రదేశాలలో ఉపయోగించడానికి ఉద్దేశించబడింది.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

టొయోటా సి+వాక్ టి ఫ్రంట్ వీల్ లో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది మరియు దాని హ్యాండిల్ బార్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సింపుల్ గా చెప్పాలంటే, ఒక మనిషి నడిచే సగటు వేగంతోనే ఇది ప్రయాణిస్తుంది. ప్రజలు నడిచే మార్గంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దీని వేగాన్ని తగ్గించారు.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టొయోటా సి+వాక్ టి ఈవీలో అధునాతన సెన్సార్లు ఉంటాయి. ఇవి రోడ్లపై లేదా కాలినడక ప్రదేశాల్లో ఉన్న వాహనాలు లేదా ఇతర వ్యక్తులను స్వయం చాలకంగా (ఆటోమేటిక్‌గా) గుర్తించి, వేగాన్ని తగ్గిస్తాయి లేదా రైడర్ ని అలెర్ట్ చేస్తాయి. ఈ బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రిక్ వాహనంలో బ్రష్ లేని డిసి (బ్రష్‌లెస్ డిసి) మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి 2.5 గంటల సమయం పడుతుంది. దీనిని ఏసి 100 వోల్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ తో కూడా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనంలో యాక్సిలరేటర్ లివర్, బ్రేక్ లివర్‌లు స్టీరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. వీటికి అదనంగా ఇందులో ఒక చిన్న ఎల్‌సిడి స్క్రీన్ కూడా ఉంటుంది.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

ఈ ఎల్‌సిడి స్క్రీన్ పై వాహనం యొక్క వేగం, బ్యాటరీ ఛార్జ్ స్థాయి వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. జపాన్ మార్కెట్లో టొయోటా సి-ప్లస్ వాక్ టి ధర 3,41,000 యెన్ లుగా ఉంది. అంటే, మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం దీని విలువ రూ. 2.27 లక్షలు గా ఉంటుంది.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

టొయోటా సి+వాక్ టి రూపకల్పన వెనుక ప్రధాన ఆలోచన అవసరమైన వారికి మొబిలిటీ ఆప్షన్లను అందించడమే అని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం టార్గెట్ చేయబడిన వారిలో వృద్ధులు మరియు వికలాంగులు కూడా ఉన్నారు. నగర పరిధిలో చిన్నపాటి దూరాలను కవర్ చేయడానికి ఈ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

అంతేకాకుండా, ఇది టూర్ ఆపరేటర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది తమ రోజువారీ రౌండ్స్ కోసం లేదా ఫ్యాక్టరీలు మరియు తయారీ కేంద్రాలలో అధికారులు, సిబ్బంది రౌండ్స్ వేయటం కోసం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అందరికీ మొబిలిటీ స్వేచ్ఛను అందించడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని మరియు సి+వాక్ సిరీస్‌లో సీటింగ్-టైప్ మరియు వీల్‌చైర్-లింక్డ్-టైప్ మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

కాగా, Toyota C+walk T ఈవీ యొక్క రేంజ్ మరియు ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. యువకులకు ఇదొక ఫన్ టూ రైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గానూ మరియు వయస్సు మళ్లిన వారికి, వికలాంగులకు అవసరమైన నీడ్ టూ రైడ్ వెహికల్ గానూ ఉంటుంది. ఈ వాహనం సాయంతో శరీర కదలికను తగ్గించి, చిన్నపాటి దూరాలను సునాయాసంగా చేరుకోవచ్చు.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలు అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కాన్సెప్ట్ లపై పనిచేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి ఉన్న ఏకైక అడ్డంకి తగినంత చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే.

నడవటానికి బదులుగా Toyota C+walk T ఎలక్ట్రిక్ వెహికల్

ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే, అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ నెట్‌వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. మనదేశంలో కూడా ఆటోమొబైల్ కంపెనీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచేందుకు ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను ఆకర్షించడానికి ప్రభుత్వం వాటిపై భారీ ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Toyota c plus walk t ev launched in japan details
Story first published: Friday, October 1, 2021, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X