ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

ప్రముఖ వాహన తయారీదారు 'పియాజియో ఇండియా' 2021 ఆగష్టు 19 న తన వెస్పా '75 వ ఎడిషన్' స్కూటర్ ని భారతీయ మార్కెట్లో విడుదలచేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్కూటర్ గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల చేయలేదు.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

వెస్పా 75 వ ఎడిషన్‌లో, కంపెనీ ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో వెస్పా ప్రైమవెరా 150 మరియు జిటిఎస్ వంటి స్కూటర్లను కూడా అందిస్తుంది. కంపెనీ ఇటీవల 2021 వెస్పా జిటిఎస్ 75 వ యానివర్సరీ ఎడిషన్ మరియు కొత్త 2021 వెస్పా ప్రైమవెరా 75 వ యానివర్సరీ ఎడిషన్‌ను మలేషియాలో ప్రారంభించింది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

వెస్పా నుంచి రానున్న కొత్త 75 వ ఎడిషన్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ బాడీ పాన్ మీద '75' అనే నెంబర్ వ్రాయబడి ఉంటుంది. ఈ నెంబర్ కంపెనీ 75 వ యానివర్సరీ జ్ఞాపకార్థం ఉపయోగించబడింది. దీనితో పాటు, మలేషియాలోని వెస్పా 75 వ ఎడిషన్ స్కూటర్‌లో కనిపించే ఈ మోడల్ టైల్ పై పెద్ద వృత్తాకార బ్యాగ్ కూడా కనిపిస్తుంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

ఇందులోని ఈ బ్యాగ్ వెడల్పుగా మరియు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది లెదర్ తో తయారు చేయబడి దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేయబడింది. దీనితో పాటు, ఈ బ్యాగ్‌లో లగేజ్ ర్యాక్‌లో షోల్డర్ పట్టీ మరియు క్లిప్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు వాటిని గమనించవచ్చు.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త వెస్పా అసలు మోడల్ యొక్క పెయింట్ థీమ్‌పై ఆధారపడిన స్పెషల్ జియలో 75 వ పెయింట్ స్కీమ్‌లో అందిచబడి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా బ్యాడ్జ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ మడ్‌గార్డ్, మఫ్లర్ మరియు రియర్ వ్యూ మిర్రర్‌లపై క్రోమ్ ఉపయోగించబడి ఉంటుంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

కొత్త వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్ స్కూటర్ లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మిర్రర్స్, రౌండ్ హెడ్‌లైట్, ఫ్లాట్-టైప్ సీట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ మరియు స్టబ్బీ ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి కోసం 4.3 ఇంచెస్ టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

కొత్త వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్ స్కూటర్ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ స్కూటర్ లో ఏబీఎస్ తో పాటు ముందు మరియు వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉండే అవకాశం ఉంటుంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్ స్కూటర్ యొక్క ధర విషయానికి వస్తే, వెస్పా 75 వ ఎడిషన్ స్కూటర్ దాని స్టాండర్డ్ మోడల్ స్కూటర్ కంటే కూడా ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

కంపెనీ నివేదికల ప్రకారం వెస్పా గత 75 సంవత్సరాలలో మొత్తం 19 మిలియన్ స్కూటర్లను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. ఐతే కాకుండా కంపెనీ యొక్క పొంటిదేరా ప్లాంట్‌లో విడుదల చేసిన 19 వ మిలియన్ స్కూటర్ వెస్పా జిటిఎస్ 300.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో చాలామంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే వెస్పా కంపెనీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

భారతదేశంలో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువమంది కావాలని ఆశిస్తే తప్పకుండా, భారతీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, కంపెనీ ప్రస్తుతం దాని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌పై పనిచేస్తోంది.

ఆగష్టు 19 న వెస్పా నుంచి రానున్న మరో కొత్త స్కూటర్; వివరాలు

వెస్పా యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌లో 4.2 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉపయోగించబడుతుంది. ఈ పవర్‌ట్రెయిన్‌తో, ఈ స్కూటర్ 200 ఎన్ఎమ్ టార్క్ అందించగలదు. ఇది మంచి పర్ఫామెన్స్ అందించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Vespa 75th edition scooter to launch on 19th august features details
Story first published: Wednesday, August 18, 2021, 9:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X