కరోనా ఎఫెక్ట్; వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ పొడిగింపు

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న కారణంగా దాదాపు దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు అన్ని ఆటో మొబైల్ కంపెనీలు ఉత్పత్తి నిలిపివేశాయి. ఈ కారణంగా వాహన అమ్మకాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వెస్పా మరియు అప్రిలియా యొక్క స్కూటర్లకు డిస్కౌంట్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది.

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

వెస్పా మరియు ఏప్రిలియా కంపెనీలు కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మే నెలలో భారీ తగ్గింపును అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏప్రిలియా ఎస్ఆర్ 160 బుకింగ్‌పై ఇప్పుడు రూ. 5000 వరకు ఫ్రీ ఇన్సూరెన్స్, మరియు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 5 సంవత్సరాల వారంటీ అందిస్తోంది. ఈ ఆఫర్లు వెస్పా స్కూటర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఇప్పుడు వెస్పా, అప్రిలియా స్కూటర్లను 5 సంవత్సరాల వారంటీతో పాటు రూ. 4,999 డౌన్‌ పేమెంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ లాక్ డౌన్ సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ అనేక కొత్త ఆఫర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఆకర్షణీయమైన ఆఫర్లు ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఈ ఆఫర్లతో పాటు పియాజియో గ్రూప్ ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వంటి వాటి వ్యవధిని పొడిగించింది. భారతదేశంలో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ అమలులో ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో డీలర్షిప్ మరియు సర్వీస్ సెంటర్ మూసివేయబడింది.

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఇటువంటి పరిస్థితిలో కస్టమర్లు ఎటువంటి ఇబ్బందికి లోనుకాకుండా ఉండటానికి కంపెనీ వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని పొడిగించింది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇదేబాటలో నడుస్తున్నాయి. 2021 ఏప్రిల్ నుండి దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ విధించబడింది, ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల సౌలభ్యాన్ని కోసం పియాజియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కంపెనీ అందించిన ఈ అవకాశం చాలామంది కస్టమర్లకు ఉపశమనం కలిగించనుంది. కావున వాహనాలను సర్వీస్ వంటి వాటికోసం కస్టమర్లు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు.

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

వెస్పా మరియు అప్రిలియా కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం వారంటీ మరియు సర్వీస్ పీరియడ్ 2021 జూలై 31 వరకు పొడిగించబడింది. గత ఏడాది కూడా కంపెనీ తమ ద్విచక్ర వాహనాలకు మరియు కమర్షియల్ వాహనాలకు ఇలాంటి అవకాశం కల్పించింది.

MOST READ:కరోనా బాధితులకోసం కొత్త హాస్పిటల్ ప్రారంభించిన ఒమేగా సెకి మొబిలిటీ; పూర్తి వివరాలు

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

కరోనా సెకండ్ వేవ్ ఆటో పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో అంచనాలకు మించి విక్రయాలు తగ్గిపోతున్నాయి. ఇది మరింత తగ్గిపోతుందని అంచనా. ఇది కార్లు మరియు వాణిజ్య వాహన అమ్మకాలపై కూడా భారీగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఎప్రిలియా ఇటీవల భారతదేశంలో ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ విడుదల చేసింది. ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో గత నెలలో చేర్చారు, ఇదే సమయంలో కంపెనీ ఈ స్కూటర్లు యొక్క బుకింగ్స్ ప్రారంభించబడింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్, ఎస్ఎక్స్ఆర్ 160 నుండి ప్రేరణ పొందింది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్

ఎప్రిలియా 125 స్కూటర్ లో 125 సిసి త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 9.3 బిహెచ్‌పి శక్తిని, 9.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఎప్రిలియా 125 స్కూటర్ యొక్క డెలివరీలు కరోనా లాక్ డౌన్ పూర్తయిన తరువాత ప్రారంభమవుతాయి.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Vespa And Aprilia May 2021 Offers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X