వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీని 'ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దినోత్సవం' (వరల్డ్ ఈవీ డే) గా జరుపుకుంటారు. పెట్రోల్, డీజిల్ వంటి వాహనాల నుండి పెరుగుతున్న వాయి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రజలు మరియు కార్ కంపెనీలు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతున్నారు.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఫ్యూచర్ మొబిలిటీగా ప్రకటించబడుతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మరియు వాటి చార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తృతంగా పెంచేందుకు ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలు కాదు మనదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు కూడా వేగంగా పావులు కదుపుతున్నాయి. ప్రపంచంలో విక్రయించే ప్రతి 100 ద్విచక్ర వాహనాలలో 30 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయంటే, వాటి వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఇటీవలి కాలంలో భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రత్యేకించి, భారత ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమ అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే, అనేక కొత్త కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించగా, మరికొన్ని త్వరలోనే రాబోతున్నాయి. వరల్డ్ ఈవీ డేని పురస్కరించుకొని, మనదేశంలో లభిస్తున్న 6 బెస్ట్ ఎలక్ట్రిక్ టూవీలర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

1. Hero Photon

ధర: రూ. 71,440 ; రేంజ్: 108 కిమీ

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో ఫోటాన్ (Hero Photon). ఈ స్కూటర్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 108 కిమీ దూరం ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 45 కిమీ వరకూ ఉంటుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 1200W ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు రైడింగ్ మోడ్‌ లు ఉంటాయి. వీటిలో మొదటిది ఎకానమీ మరియు రెండవది పవర్. ఎకానమీ మోడ్ లో పవర్ తక్కువగా రేంజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, పవర్ మోడ్ లో స్పీడ్ ఎక్కువగా రేంజ్ తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్, యాంటీ-థెఫ్ట్ అలారం, కీలెస్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ టైర్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

2. Okinawa Ridge+

ధర: రూ. 78,307 ; రేంజ్: 120 కిమీ

Okinawa బ్రాండ్ నుండి లభిస్తున్న Ridge+ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌ పై 120 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో, కంపెనీ రీఛార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పాటుగా 800W ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిస్తోంది. ఈ స్కూటర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లో ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్‌ కూడా ఉంటుంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీ తెఫ్ట్ అలారం, కీలెస్ స్టార్ట్, ఈబిఎస్, సెంట్రల్ లాకింగ్, జిపిఎస్ నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఈ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 2 నుండి 3 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌పై కంపెనీ 3 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

3. Ather 450X

ధర: రూ. 1.32 లక్షలు ; రేంజ్: 116 కిమీ

Ather 450X అనేది అధిక పనితీరు కలిగిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 2.61 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఏథర్ 450 ఎక్స్ గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. కంపెనీ ఈ స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాల అపరిమిత వారంటీని కూడా అందిస్తోంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఏథర్ 450X స్కూటర్‌ లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 1 GB RAM మరియు 8 GB స్టోరేజ్‌, Android OS మరియు స్నాప్‌డ్రాగన్ 212 క్వాడ్-కోర్ 1.3 GHz ప్రాసెసర్‌తో పనిచేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది లేటెస్ట్ కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 3.3 kW / 6 kW మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై ఈ స్కూటర్ 116 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

4. Revolt RV400

ధర: రూ. 1.29 లక్షల నుండి రూ. 1.48 లక్షలు ; రేంజ్: 150 కిమీ

భారతీయ మార్కెట్లో రివాల్ట్ మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయిస్తుంది. వీటిలో ఒకటి Revolt RV400. ఇదొక ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. అంతేకాదు, రివోల్ట్ ఆర్‌వి400 భారత మార్కెట్లో విడుదల చేయబడిన మొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బైక్ కూడా. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 3 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 3.24 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో జత చేయబడి ఉంటుంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, RV400 ఎకో మోడ్‌లో 150 కిమీ, స్టాండర్డ్ మోడ్‌లో 100 కిమీ మరియు స్పోర్ట్స్ మోడ్‌లో 80 కిమీల రేంజ్ ని అందిస్తుంది. Revolt RV400 బైక్ బేస్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద, కస్టమర్లు రూ. 3999 నెలవారీ వాయిదాతో బైక్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

5. Bajaj Chetak Electric

ధర: రూ. 1.15 లక్షలు ; రేంజ్: 85 కిమీ

Bajaj Auto గతంలో విక్రయించిన ఐకానిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ను కంపెనీ తిరిగి ఎలక్ట్రిక్ అవతార్‌లో రీలాంచ్ చేసింది. Bajaj Chetak (బజాజ్ చేతక్) ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రెట్రో మోడ్రన్ స్టైల్ లో ఉంటుంది. ఇందులో 3 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జింగ్‌పై చేతక్ ఎలక్ట్రిక్‌ ఎకో మోడ్‌లో 95 కిమీ మరియు స్పోర్ట్ మోడ్‌లో 85 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఈ స్కూటర్ యొక్క బ్యాటరీని 15 amp హోమ్ చార్జర్ సాయంతో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఇదే బ్యాటరీని ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

6. TVS iQube

ధర: రూ. 1.15 లక్షలు ; రేంజ్: 75 కిమీ

టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube). ఇది ఈ విభాగంలో బజాజ్ చేతక్‌కు అత్యంత సమీప ప్రత్యర్థిగా ఉంటుంది. TVS iQube స్కూటర్ పూర్తి ఛార్జ్‌ పై 75 కిలోమీటర్ల రేంజ్ (ఎకో మోడ్‌లో) ను ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో 4.4 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.

వరల్డ్ ఈవీ డే: భారత మార్కెట్లో లభించే టాప్ 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగవంతం అవుతుంది. ఇంకా ఇందులో SmartXonnect కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. మార్కెట్లో ఈ స్కూటర్‌ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలుగా ఉంటుంది.

Most Read Articles

English summary
World ev day top 6 best electric scooters available in india price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X