Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క బైకులు మరియు స్కూటర్లు మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. యమహా మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవల భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ యమహా R15 సిరీస్‌ను విడుదల చేసింది, దీని కింద కంపెనీ యమహా R15 V4 మరియు యమహా R15M అనే రెండు ఫెయిర్డ్ మోటార్‌సైకిళ్లను కలిగి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ మరో కొత్త బైకును మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. యమహా కంపెనీ నుంచి రానున్న ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

యమహా (Yamaha) కంపెనీ కొత్త మోటార్‌సైకిల్ కోసం భారతదేశంలో ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. కంపెనీ భారతీయ మార్కెట్ కోసం యమహా YZF-R9 పేరును నమోదు చేసింది. కావున ఈ యమహా కొత్త బైక్‌ను కంపెనీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Yamaha YZF-R9 అనేది ఒక సూపర్‌స్పోర్ట్ బైక్‌గా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

Yamaha కంపెనీ అంతర్జాతీయంగా MT-07 ఆధారిత Yamaha YZF-R7 ని ప్రారంభించినప్పటి నుండి, Yamaha దాని అధిక-పనితీరు గల MT-09 తో ఇలాంటిదే విడుదల చేయాలనే సంకల్పంతో సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. కావున మరో ట్రేడ్‌మార్క్ అప్లికేషన్‌తో, ఇది త్వరలో రావచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

కొత్తగా రానున్న Yamaha YZF-R9 కోసం, కంపెనీ ఇప్పటికే ఉన్న Yamaha MT-09 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. కావున ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో కూడా 890 సిసి 3-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ఈ ఇంజన్ దాదాపు 119 బిహెచ్‌పి పవర్ మరియు 93 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తిని పొందుతుంది, స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ ఎంపికలు కూడా ఇందులో ఉంటాయి.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

కొత్త యమహా YZF-R9 కొంచెం ఎక్కువ ట్రాక్-ఓరియెంటెడ్‌గా ఉంటుందని పరిగణనలోకి తీసుకుంటే, టాప్-స్పెక్ MT-09 SP వేరియంట్‌కు సమానమైనదిగా ఉండే అవకాశం ఉంటుంది. కావున MT-09 SP లో కంపెనీ పూర్తిగా అడ్జస్టబుల్ చేయగల సస్పెన్షన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

ఈ కొత్త బైక్ లో ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు ప్రొజెక్టర్ ల్యాంప్ తో పాటు షార్ప్ ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు ఏరోడైనమిక్ వైజర్‌తో షార్ప్ ఫ్రంట్ ఫాసియాని కలిగి ఉండనుంది. టైల్ భాగం చాలా షార్ప్‌గా, చివరలో ఎల్ఈడీ టైల్‌లైట్ వంటివి కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

ఈ బైక్ స్ప్లిట్ సీట్ సెటప్ కూడా పొందుతుంది. బైక్‌లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, ట్రాక్షన్ కంట్రోల్, వీల్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్ మరియు రైడింగ్ మోడ్ ఉన్నాయి. యమహా YZF-R9 సూపర్‌స్పోర్ట్ బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇది ప్రీమియం ఓహ్లిన్స్ సస్పెన్షన్ యూనిట్‌ను కలిగి ఉంది, ముందువైపు USD ఫోర్క్స్ మరియు వెనుకవైపు మోనోషాక్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ బైక్ యొక్క ఫ్రేమ్ MT-09 వలె ఉంటుందని భావిస్తున్నాము.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

Yamaha యొక్క రాబోయే ZF-R9 సూపర్‌స్పోర్ట్ బైక్ నవంబర్ 23 నుండి నవంబర్ 28 వరకు ఇటలీలోని మిలన్‌లో జరిగే 2021 EICMA షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడుతుంది. ప్రొడక్షన్ వెర్షన్ తర్వాత, బహుశా 2022లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

యమహా నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న YZF-R7 బైక్‌ను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త యమహా YZF-R7 సూపర్‌స్పోర్ట్ బైక్ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది. యమహా తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన YZF-R6 బైక్ స్థానంలో YJHF-R7 పరిచయం చేయబడింది.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

ఈ కొత్త యమహా YZF-R7 బైక్‌లో దూకుడు రూపాన్ని కలిగి ఉండే LED DRLలతో కూడిన ఫ్రంట్ ట్విన్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కొత్త బైక్ యొక్క విండ్‌స్క్రీన్ YZF-R6 మోడల్ కంటే వెడల్పుగా మరియు పొడవుగా ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

Yamaha YZF-R7 సూపర్‌స్పోర్ట్ బైక్‌లో MT-07 నుండి తీసుకోబడిన 689 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 73.4 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ మరియు అసిస్ట్ ఫంక్షన్‌తో కూడిన స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

Yamaha నుంచి రానున్న మరో కొత్త బైక్ YZF-R9

యమహా కంపెనీ ఈ కొత్త YZF-R9 సూపర్‌స్పోర్ట్ బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తే, ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ ద్వారా దేశీయ మార్కెట్లోకి దిగుమతి చేయబడుతుంది. ఈ కారణంగా ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త బైక్ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు, అయితే త్వరలో అందుబాటులో వస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha motorcycles trademark yzf r9 name for india details
Story first published: Wednesday, November 10, 2021, 10:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X