తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility)కి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ (Ampere Electric Vehicles) తన మొదటి అనుభవ కేంద్రాన్ని (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్)ను తమిళనాడులో ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ కాటన్ యాజమాన్యంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ దక్షిణాది రాష్ట్రంలోని రాణిపేటలో తమ మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, కంపెనీ ఇటీవల రాణిపేటలో ప్రారంభించిన మెగా ప్లాంట్ దగ్గర్లోనే ఉంది. ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ఆంపియర్ అందిస్తున్న వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మరియు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరెయెన్స్ ను వినియోగదారులకు అందిస్తుంది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు మరియు కొనుగోలు ధోరణులకు అనుగుణంగా, వినియోగదారులకు భౌతిక అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంపియర్ తెలిపింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ద్వారా కొనుగోలుదారులు కంపెనీ అందిస్తున్న తాజా ఉత్పత్తులను చెక్ చేయవచ్చు అలాగే, కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఆంపియర్‌ల ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ లో కంపెనీ EV నిపుణుల బృందాన్ని నియమించింది, వారు EV సాంకేతికత గురించి కస్టమర్‌లకు సంక్షిప్తంగా తెలియజేస్తారు మరియు సులభంగా అర్థం చేసుకోగలిగే డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వారిని కనెక్ట్ చేస్తారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త వాహనాలు మరియు సాంకేతిక కోసం ఆంపియర్ టెక్నాలజీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

తమిళనాడులో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా గ్రీవ్స్ కాటన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సిఇఒ నగేష్ ఎ బసవనహళ్లి మాట్లాడుతూ రాణిపేటలో కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసిన EV మెగా సైట్ మరియు కొత్తగా ప్రారంభించిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో అందరికీ క్లీన్ మొబిలిటీని అందజేస్తామని ఆంపియర్ తన ప్రతిజ్ఞను తీసుకుందని చెప్పారు. వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల కోసం అత్యుత్తమ ఉత్పత్తులను మరియు సపోర్టు సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్‌లు, సాంప్రదాయ డీలర్‌షిప్‌లకు బదులుగా అనుభవ కేంద్రాలను (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను) తెరవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు కొనుగోలుదారులకు డిజిటల్ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారిస్తాయి, అదే సమయంలో స్కూటర్‌ను దగ్గరగా తెలుసుకునేందుకు మరియు పరీక్షించడానికి వారికి అవకాశాన్ని కల్పిస్తాయి.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గడచిన డిసెంబర్ 2021 నెలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత నెలలో కంపెనీ త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 101 శాతం పెరిగాయి. డిసెంబర్ 2020తో పోలిస్తే డిసెంబర్ నెలలో ఆంపియర్ ఆదాయంలో దాదాపు ఆరు రెట్లు రికార్డు వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసికంలో, గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇ-త్రీవీలర్ బ్రాండ్ ELE (ఇ-రిక్షా)లో 100 శాతం వాటాను మరియు మరొక ఇ-త్రీవీలర్ బ్రాండ్ MLR ఆటోలో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

తమిళనాడులోని రాణిపేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ మెగా ప్లాంట్ నుప్రారంభించినట్లు ప్రకటించిన తర్వాత డిసెంబర్‌లో కంపెనీకి అధిక వృద్ధి సంఖ్యలు వచ్చాయి. దాదాపు 35 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ దేశీయ ఈవీ స్పేస్‌లో కంపెనీ యొక్క మార్కెట్ వాటాను పెంచుకోవడానికి సహకరించనుంది. ఈ ప్లాంట్ కోసం కంపెనీ సుమారు రూ. 700 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌ ద్వారా ఏటా 1.20 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఇదిలా ఉంటే, ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మాగ్నస్ ఈఎక్స్ (Magnus EX) ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. అపార్ట్‌మెంట్ లలో నివసించే వారు మరియు అవుట్‌డోర్ చార్జింగ్ సదుపాయాలు లేని వారి కోసం ఈ ఫీచర్ అనువుగా ఉంటుంది. బ్యాటరీని స్కూటర్ నుండి వేరు చేసి, ఇంటి లోపల చార్జింగ్ చేసుకుని, తిరిగి బ్యాటరీలో అమర్చుకోవ్చచు. ఈ ప్రక్రియ అంతా చాలా సులువుగానే ఉంటుంది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సరికొత్త ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని, ఇది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరియు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. గడచిన అక్టోబర్ 2021లో భారత మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది పూర్తి ఛార్జ్‌పై 121 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

తమిళనాడులో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరెయన్స్ సెంటర్‌ను ప్రారంభించిన Ampere Electric

ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఇ-స్కూటర్ లో1200-వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఈ విభాగంలో అత్యధిక రేటింగ్ పొందిన ఎలక్ట్రిక్ మోటార్లలో ఒకటి. ఈ మోటార్ పనితీరును గమనిస్తే, ఇది కేవలం 10 సెకన్లలోనే స్కూటర్‌ను 0 నుండి 40 కి.మీ వరకు వేగవంతం చేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో సూపర్ సేవ్ ఎకో మోడ్ మరియు పెప్పియర్ పవర్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Ampere electric vehicles inaugurates its customer experience centre in tamil nadu
Story first published: Wednesday, January 5, 2022, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X